E-Paper
Advertisement

Bike Theft Protection: దొంగతనం కాకుండా బైక్ ను కాపాడుకోవడం ఎలా? ఈ టిప్స్ పాటించండి!

Bike Theft Protection: దొంగతనం కాకుండా బైక్ ను కాపాడుకోవడం ఎలా? ఈ టిప్స్ పాటించండి!
Advertisement

How To Protect Your Bike From Thieves: భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ మార్కెట్ గా కొనసాగుతోంది. గత సంవత్సరం 20 మిలియన్లకు పైగా బైక్స్  అమ్ముడయ్యాయి. అదే సమయంలో, బైక్ దొంగతనాలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బైక్ దొంగతనాలు జరగకుండా నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.  ఒకవేళ మీకూ బైక్ ఉంటే.. దొంగతనం జరగకుండా కాపాడుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి..

దొంగతనం నుంచి బైక్ ను ఎలా కాపాడుకోవాలి?   

కార్లతో పోల్చితే బైక్స్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. బైక్స్ తేలికగా, అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉండవు. జాగ్రత్తలు తీసుకోకపోతే, నిమిషాల్లో బైక్‌ను దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. అందుకే, బైక్ యజమానులు మరింత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

Advertisement

బైక్ ను కాపాడుకునేందుకు నాణ్యత కలిగిన లాక్ ను పెట్టించుకోవాలి. స్ట్రాంగ్ స్టీల్‌ తో తయారు చేసిన డిస్క్ లాక్‌లు,  U-లాక్‌లు మెరుగైన రక్షణను అందిస్తాయి. చౌకైన లాక్‌లు ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే, కాస్త ధర ఎక్కువగా ఉన్నా, మంచి లాక్స్ తీసుకోవాలి.

బైక్ పార్కింగ్ ప్లేస్ కూడా దొంగతనాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడూ జనాలు చుట్టూ ఉండే ప్రదేశంలో, బాగా లైటింగ్ ఉండే ప్రదేశాల్లో పార్క్ చేయాలి. చీకటిగా ఉండే ప్రదేశాల్లో బైక్స్ పార్కింగ్ చేయకూడదు. అటు బైక్ కవర్ ఉపయోగించడం వల్ల కూడా దొంగతనాలు జరగకుండా కాపాడుకోవచ్చు. కవర్ కారణంగా బైక్ గురించి ఎలాంటి వివరాలు బయటకు తెలియకుండా ఉంటాయి.

Advertisement

ఇక ఒకటి కంటే ఎక్కువ తాళాలను ఉపయోగించడం వల్ల దొంగతనం జరగకుండా కాపాడుకోవచ్చు. ఒక తాళం బైక్ ను ఈజీగా దొంగతనం చేసేలా సాయపడుతుంది. అందుకే, రెండు తాళాలు వేయడం మంచిది. డిస్క్ లాక్‌ను చైన్, యు లాక్‌తో కలపడం వల్ల భద్రత పెరుగుతుంది. దొంగతనం జరిగే అవకాశాలు తగ్గుతాయి.

అటు బైక్ లో అలారం వ్యవస్థను ఇన్‌ స్టాల్ చేయడం వల్ల భద్రత పెరుగుతుంది. దొంగతనం జరిగే అవకాశాలు తగ్గుతాయి. బైక్ కదలగానే అలారం గట్టిగా అరుస్తుంది. సమీపంలోని వ్యక్తులను అప్రమత్తం చేస్తుంది. ఇప్పుడు పలు అలారం వ్యవస్థలు మోషన్ సెన్సార్లు, రిమోట్ కంట్రోల్‌లతో వస్తున్నాయి. ఇవి పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాలలో ఉపయోగపడతాయి.

ప్రస్తుతం భారత్ లో GPS ట్రాకర్లు కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. సీక్రెట్ గా అమర్చిన ట్రాకర్ మోటార్‌ సైకిల్ దొంగిలించబడితే త్వరగా గుర్తించడంలో సహాయపడుతుంది. రికవరీ అవకాశాలు మెరుగవుతాయి.

⦿ స్ట్రాంగ్ స్టీలో తో తయారు చేసిన నాణ్యత గల తాళాన్ని ఉపయోగించాలి.

⦿ చౌకైన తాళాలకు బదులుగా డిస్క్ తాళాలు, U-తాళాలను ఎంచుకోవాలి.

⦿ ఎల్లప్పుడూ ప్రజలు తరచుగా తిరిగే విధంగా బాగా వెలుతురు ఉన్న ప్రదేశాలలో పార్క్  చేయాలి.

⦿ జనాలు లేని చోట, చీకటి ప్రదేశాలలో పార్కింగ్ చేయకూడదు.

⦿ బైక్ కనిపించకుండా ఉంచడానికి బైక్ కవర్‌ను ఉపయోగించాలి.

⦿ అదనపు భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ తాళాలను ఉపయోగించాలి.

⦿ వీలైతే డిస్క్ లాక్‌ను చైన్, U-లాక్‌తో లింక్ చేయాలి.

⦿ మోషన్ సెన్సార్లతో మోటార్‌ సైకిల్ అలారం వ్యవస్థను ఇన్‌ స్టాల్ చేయాలి.

⦿ బైక్ కు GPS ట్రాకర్‌ ను అమర్చుకోవాలి.

Read Also: వామ్మో ఇదెక్కడి క్రేజ్ భయ్యా, 135 సెకెన్లలో కార్లన్నీ కొనేశారు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×