E-Paper
Advertisement

Car tyres Manufacturing Date: కారు టైర్ల తయారీ డేట్ చాలా ఇంపార్టెంట్.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Car tyres Manufacturing Date: కారు టైర్ల తయారీ డేట్ చాలా ఇంపార్టెంట్.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Advertisement

ఈ రోజుల్లో చాలా మంది కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఫ్యామిలీ ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, కారు రోడ్డు మీదికి వెళ్లినప్పటి నుంచి ఇంటికి చేరే వరకు దాని టైర్లు కీలక పాత్ర పోషిస్తాయి. కారు టైర్లు సమయానికి మార్చుతూ ఉండాలి. పాత టైర్లను అలాగే కొనసాగించడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇంతకీ టైర్లు సేఫ్ గా ఉన్నాయో? లేవో? తెలుసుకోవాలంటే కారు టైర్ల మీద ఉన్న తయారీ డేట్ ను చెక్ చేయాలి. ఇంతకీ టైర్ మీద ఉన్న వివరాలు ఏం చెప్తాయంటే?

టైర్ తయారీ డేట్ ఎందుకు తెలుసుకోవాలంటే?

టైర్ల రబ్బరు అనేది నెమ్మది నెమ్మదిగా బలహీనపడుతుంది. టైర్లు వాడకపోయినా, పాతపడే కొద్దీ దాని పనితీరు బలహీనపడుతుంది. ట్రెడ్ అరిగిపోకపోయినా, ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న టైర్లను కచ్చితంగా మార్చాలని నిపుణులు చెప్తుంటారు. హీట్, సన్ లైట్, తేమ, లోడ్ కారణంగా టైర్లు బలం కోల్పోతాయి. తయారీ డేట్ ను పరిశీలించడం వల్ల ఎప్పుడు మార్చితే మంచితో ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

టైర్లపై తయారీ కోడ్‌ను ఎలా గుర్తించాలి?   

Advertisement

ప్రతి టైర్ సైడ్‌వాల్‌ లో DOT కోడ్ తో పిలిచే అక్షరాలు, సంఖ్యలు ఉంటాయి. ఈ కోడ్ చివరలో టైర్ ఎప్పుడు తయారు చేశారు? అనే వివరాలను చెప్పే నాలుగు అంకెల సంఖ్య ఉంటుంది. టైర్ రూపొందించబడిందనే అంశం మీద ఆధారపడి ఈ కోడ్ బటి సైడ్ వాల్ లేదంటే లోపలి సైడ్ వాల్ లో ఉండవచ్చు.

టైర్ డేట్ కోడ్ ను ఎలా చదవాలి?  

టైర్ మీద ఉండే నాలుగు అంకెల కోడ్ తయారీ వారం, సంవత్సరాన్ని సూచిస్తుంది. ఫస్ట్ రెండు అంకెలు టైర్ తయారీ   వారాన్ని సూచిస్తాయి. చివరి రెండు అంకెలు తయారీ సంవత్సరాన్ని సూచిస్తాయి. ఒకవేళ 2419 అని రాసి ఉందనుకోండి, ఆ టైర్ 2019 సంవత్సరంలో 24వ వారంలో తయారు చేసినట్లు భావించాలి. అలా కాకుండా 0123 ఉంటే 2023 సంవత్సరంలో తొలి వారంలో తయారు చేసినట్లు గుర్తించాలి. సాధారణంగా ఈ తయారీ డేట్ అనేది బయటి వైపు సైడ్ వాల్ మీద ఉంటుంది. కొన్ని తయారీ కంపెనీలు లోపలి వైపున కూడా ప్రింట్ చేస్తాయి.

టైర్లు త్వరగా చెడిపోకుండా ఉండాలంటే?

Advertisement

సాధారణంగా టైర్లకు ఆరు సంవత్సరాలకు పైగా వయసు ఉంటే, అవి చూడ్డానికి బాగున్నా మార్చాల్సి ఉంటుంది. పగుళ్లు, ఉబ్బెత్తులు లాంటి లక్షణాలు కనిపిస్తే, టైర్లు దెబ్బతిన్నట్లు భావించాలి. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా అన్ని టైర్లను పరిశీలించాల్సి ఉంటుంది. టైర్ల లైఫ్ ను పెంచుకునేందుకు సిఫార్సు మేరకు గాలి ఉండేలా చూసుకోవాలి. ప్రతి 5 వేల నుంచి 7 వేల కిలో మీటర్లు నడిచిన తర్వాత టైర్లను రొటేట్ చేయడం మంచిది. ఎక్కువ బరువు అనేది టైర్ల మీద అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే, ఓవర్ లోడ్ చేయకూడదు. రెగ్యులర్ వీల్ అలైన్ మెంట్, బ్యాలెన్సింగ్ కూడా చూసుకోవాలి.

Read Also: కార్ల టైర్లు ఎప్పుడు మార్చాలి? నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×