E-Paper
Advertisement

ఒక్క అక్షరం మార్చి చలాన్లు తప్పించుకున్నారు.. కానీ, కెమెరాలకు చిక్కి బుక్కైపోయారు!

ఒక్క అక్షరం మార్చి చలాన్లు తప్పించుకున్నారు.. కానీ, కెమెరాలకు చిక్కి బుక్కైపోయారు!
Advertisement

హైదరాబాద్‌ లో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు చేస్తున్న కొత్త మోసాన్ని పోలీసులు బయటపెట్టారు. స్కూటర్ నంబర్ ప్లేట్‌ లో కేవలం ఒక అక్షరాన్ని మార్చి అధికారులను మోసం చేయాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు చివరకు పోలీసులకు చిక్కారు. సిటీలో అధునాతన కెమెరా వ్యవస్థల సహాయంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త స్కామ్ ఎలా బయటపడిందంటే..

Advertisement

నిందితులు తమ వాహనాల అసలు రిజిస్ట్రేషన్ నంబర్లలో ఒక అక్షరాన్ని మాత్రమే మార్చి నకిలీ నంబర్ ప్లేట్లను ఉపయోగించారు. వాళ్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు వేరే వాహన యజమానుల పేర్లపై ఇష్యూ అవుతున్నాయి. అమాయక వాహనదారులు తాము చేయని తప్పులకు జరిమానాలు కట్టాల్సి వస్తుంది.

ఫస్ట్ ఇన్సిడెంట్ ఎలా వెలుగులోకి వచ్చిందంటే?

ఫస్ట్ ఇన్సిడెంట్ లో హిమాయత్‌ నగర్‌ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి తన హోండా యాక్టివా స్కూటర్ నంబర్‌ ను AP09CH9428 నుంచి AP09CM9428గా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడి ట్రాఫిక్ వాయిలేషన్స్ అన్నింటికి అదే నంబర్ కలిగిన మరో వాహన యజమానికి వెళ్లాయి. దీంతో అసలు యజమానికి వరుసగా చలాన్లు రావడంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు వాహనం వివరాలు, రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలించి అసలు విషయాన్ని గుర్తించారు. అనంతరం నిందితుడిపై BNS, మోటార్ వాహనాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రెండో ఘటన ఇలా బయటపడింది!

Advertisement

ఇదే తరహా మరో ఘటన తపచబుత్రలో వెలుగులోకి వచ్చింది. నటరాజ్ నగర్‌ కు చెందిన 24 ఏళ్ల యువకుడు తన స్కూటర్ నంబర్‌ ను TS12EP8323 నుంచి TS12EB8323గా మార్చి వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి ట్రాఫిక్ వాయిలేషన్స్ కు షా గంజ్ ప్రాంతానికి చెందిన మరో వాహన యజమానికి వచ్చేవి. విచారణ అనంతరం అతడిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశారు.

నిందితులను ఎలా గుర్తించారంటే?

ఈ రెండు కేసులను గుర్తించడంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. నగరంలోని సీసీటీవీ నెట్‌ వర్క్, ట్రాఫిక్ నిఘా వ్యవస్థల ద్వారా వాహనాల వివరాలను పరిశీలించిన అధికారులు నంబర్ ప్లేట్లు, వాహనాల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించారు. దీంతో మోసం బయటపడింది.

నిజానికి నంబర్ ప్లేట్లలో మార్పులు చేయడం తీవ్రమైన నేరం. చట్టాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిటీలో అమలులో ఉన్న ఆధునిక నిఘా వ్యవస్థల కారణంగా ఇలాంటి మోసాలు కప్పిపుచ్చడం సాధ్యం కాదంటున్నారు. వాహన యజమానులు తమ పేరుపై నమోదవుతున్న ఈ-చలాన్లను తరచుగా తనిఖీ చేయాలని సూచించారు. తామకు సంబంధం లేని చలాన్లు కనిపిస్తే వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Read Also: ఒక్క నెలలో 5.18 లక్షల బైక్స్ అమ్మకం.. హోండా సేల్స్ బూమ్ వెనుక అసలు మ్యాటర్ ఏంటంటే?  

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×