E-Paper
Advertisement

ఇక యాక్సిడెంట్లకు చెక్.. రూ. 15 లక్షల లోపు ADAS కార్లు వచ్చేశాయి!

ఇక యాక్సిడెంట్లకు చెక్.. రూ. 15 లక్షల లోపు ADAS కార్లు వచ్చేశాయి!
Advertisement

Indian Cheapest ADAS Cars:  దేశంలో కార్ మార్కెట్‌ లో సేఫ్టీ టెక్నాలజీ రోజు రోజుకు మరింత వేగంగా పెరుగుతోంది.  ఒకప్పుడు అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) అనేది కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రూ. 15 లక్షల లోపు బడ్జెట్ కార్లలో కూడా ఈ అధునాతన భద్రతా ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. మధ్యతరగతి వినియోగదారులు కూడా ప్రీమియం సేఫ్టీ ఎక్స్ పీరియెన్స్ ను పొందుతున్నారు.

ఇంతకీ ADAS సిస్టమ్ అంటే ఏంటి?

ADAS సిస్టమ్ అనేది కెమెరాలు, రాడార్ సెన్సర్లు ఆధారంగా పని చేస్తుంది.  రోడ్డుపై పరిస్థితిని ముందుగానే గుర్తించి డ్రైవ ర్‌కు హెచ్చరికలు ఇస్తాయి. అవసరమైతే వెహికల్ ను ఆటోమేటిక్ కంట్రోల్ చేస్తాయి. లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ లాంటి ఫీచర్లు ఇప్పుడు సాధారణంగా మారుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ADAS సిస్టమ్ బడ్జెట్ కార్ల గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ హోండా అమేజ్

Advertisement

ఈ సెగ్మెంట్‌ లో హోండా అమేజ్ కీలక మోడల్ గా కొనసాగుతోంది. సుమారు రూ.9 లక్షల ధరలో లభించే హోండా సెన్సింగ్ టెక్నాలజీతో ADAS అందిస్తోంది. సిటీ డ్రైవింగ్‌ లో ప్రమాదాలను తగ్గించేందుకు  ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ లాంటి ఫీచర్లను అందిస్తుంది. హైవే డ్రైవింగ్‌లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉపయోగపడుతుంది.

⦿  మహీంద్రా XUV 3XO

ఈ లిస్టులో మహీంద్రా XUV 3XO కీలక పోటీదారుగా కొనసాగుతోంది. సుమారు రూ. 13 లక్షల ధరలో లెవెల్ 2 ADAS అందిస్తోంది. ఇది ముందు వాహనాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా వేగాన్ని తగ్గించడం, అవసరమైతే బ్రేక్ వేయడం లాంటి  పనులు చేస్తుంది. హైవేల్లో ఇది డ్రైవింగ్‌ ను మరింత సురక్షితంగా మారుస్తుంది.

⦿ హోండా సిటీ

Advertisement

హోండా సిటీ కూడా ADAS సెగ్మెంట్‌ లో చాలా పాపులర్ మోడల్. ఇందులో లేన్ డిపార్చర్ వార్నింగ్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. చాలా వేరియంట్లలోనే ఈ సేఫ్టీ సూట్ అందుబాటులో ఉంది.

⦿  టాటా నెక్సాన్

ఈ కారు ఇప్పటికే ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ తో మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు ADAS జోడించడంతో మరింత బలమైన సేఫ్టీ ప్యాకేజ్‌ గా మారింది. లేన్ సెంటరింగ్, ఆటోమేటిక్ బ్రేకింగ్ లాంటి ఫీచర్లు డ్రైవింగ్‌ లో అదనపు భద్రతను అందిస్తాయి.

⦿  హ్యుందాయ్ వెన్యూ

ఈ కారు సుమారు రూ. 10 లక్షల ధరలోనే లెవెల్ 2 ADASను కలిగి ఉంది. సిటీ ట్రాఫిక్‌ లో ముందుగా హెచ్చరికలు ఇవ్వడం, లేన్‌ లో వాహనాన్ని వెళ్లేలా చూస్తుంది.

⦿  కియా సోనెట్‌

కియా సోనెట్‌ లో కూడా ADAS ఉంది. కానీ, ఇది లెవెల్ 1 సిస్టమ్. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ అసిస్ట్ లాంటి ప్రాథమిక ఫీచర్లను మాత్రమే అందిస్తుంది.

మొత్తంగా రూ. 15 లక్షల కాస్త పైగా ఉన్న మోడళ్లలో MG ఆస్టర్, హోండా ఎలివేట్, కొత్త రెనాల్ట్ డస్టర్ కూడా లెవెల్ 2 ADAS‌తో వస్తున్నాయి. వీటిలో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ లాంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Read Also: పెట్రో ధరలు పెరిగినా డోంట్ కేర్.. మే కార్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డులు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×