E-Paper
Advertisement

హోండా సంచలన నిర్ణయం.. భారత్ నుంచే ప్రపంచానికి కొత్త బైక్స్ ఎగుమతులు!

హోండా సంచలన నిర్ణయం.. భారత్ నుంచే ప్రపంచానికి కొత్త బైక్స్ ఎగుమతులు!
Advertisement

Honda India Expansion: ప్రపంచ మోటార్‌ సైకిల్ మార్కెట్లో భారత్‌ కు మరింత కీలక స్థానం కల్పించాలనే లక్ష్యంతో హోండా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశీయ మార్కెట్‌ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లను కూడా దృష్టిలో పెట్టుకుని కంపెనీ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. కొత్త టూవీలర్స్, ఎలక్ట్రిక్ మోడళ్లు, ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు, ప్రీమియం మోటార్‌ సైకిళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది.

గ్లోబల్ తయారీ కేంద్రంగా భారత్

ఇటీవల హోండా భారత్‌ లో తయారు చేసిన 10 కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. అయితే, ఇది కేవలం కొత్త మోడళ్ల పరిచయానికే పరిమితం కాకుండా, దేశాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా పెద్ద ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ అనే లక్ష్యంతో భారత్ లో తయారైన వాహనాలను ప్రపంచంలోని మరిన్ని దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది.

Advertisement

ఈ ప్రణాళికలో భాగంగా భారత్ లో మరింత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, విడిభాగాల స్థానిక తయారీని ప్రోత్సహించడం, ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని విస్తరించడం లాంటి అంశాలపై హోండా దృష్టి సారిస్తోంది. దేశీయంగా తయారయ్యే వాహనాల నాణ్యత మరింత మెరుగుపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పోటీ సామర్థ్యం పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

ఎగుమతులలో సత్తా చాటిన హోండా

ఎగుమతుల విషయంలోనూ హోండా సత్తా చాటుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 3.6 లక్షల టూ వీలర్స్ ను విదేశాలకు ఎగుమతి చేసిన సంస్థ, 2025-26 నాటికి ఆ సంఖ్యను 6.2 లక్షల యూనిట్లకు పెంచింది. రాబోయే రోజుల్లో భారత్‌లో తయారయ్యే మరిన్ని మోడళ్లను విదేశీ మార్కెట్లలోకి తీసుకెళ్లడం ద్వారా ఈ వృద్ధిని అలాగే కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడల్స్ ను తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రీమియం మోటార్‌ సైకిళ్లు, అధిక సామర్థ్యం కలిగిన ఇంజిన్లతో వచ్చే బైకులు, అడ్వెంచర్, లైఫ్‌ స్టైల్ మోడళ్లపై ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా కొత్త  వెహికల్స్ ను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ఎలక్ట్రిక్ వాహనాలపైనా స్పెషల్ ఫోకస్

Advertisement

ఇక భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా హోండా మరింత దృష్టి పెట్టనుంది. పర్యావరణహిత సాంకేతికతలకు అనుగుణంగా ఎలక్ట్రిక్  టూవీలర్స్, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన మోడళ్లను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెంచుతోంది. దీంతో వినియోగదారులకు మరిన్ని కొత్త మోడల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్‌ను కేవలం  పెద్ద మార్కెట్‌ గా కాకుండా, ప్రపంచానికి వాహనాలను సరఫరా చేసే ప్రధాన తయారీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో హోండా ముందుకు సాగుతోంది. కొత్త మోడల్స్, పెరుగుతున్న ఎగుమతులు, స్థానిక తయారీ విస్తరణ, ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీలపై పెట్టుబడులతో రానున్న రోజుల్లో భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ డబుల్ గేమ్.. ఒకవైపు ఈవీలు.. మరోవైపు పెట్రోల్ బైక్‌లు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×