// // Honda Sony SUV EV: జత కట్టిన హోండా-సోనీ, ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV వచ్చేది ఎప్పుడంటే? Honda Sony SUV EV: హోండా-సోనీ ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. టెస్లాకు దెబ్బ తప్పదా? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Honda Sony SUV EV: హోండా-సోనీ ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. టెస్లాకు దెబ్బ తప్పదా?

Honda Sony SUV EV: హోండా-సోనీ ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. టెస్లాకు దెబ్బ తప్పదా?
Advertisement

Afeela 1 Electric SUV: ఆటో మోబైల్ దిగ్గజం హోండా, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ జతకట్టాయి. ఈ రెండు కంపెనీల జాయింట్ వెంచర్ సోనీ హోండా మొబిలిటీ (SHM) తొలి ఎలక్ట్రిక్ SUVని అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. తాజాగా అఫీలా1 ఈవీ ప్రోటోటైప్ 2026ను రిలీవ్ చేసింది. ఈ కొత్త కారు మంచి స్పేస్, అధునాతన టెక్నాలజీతో రూపొందింది. చూడ్డానికి అచ్చం సెడాన్ మాదిరిగా కనిపిస్తుంది. దాదాపు ఒకేలాంటి ఫ్రంట్ ఎండ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కానీ, క్రాస్ ఓవర్ SUV లాంటి ప్రొఫైల్‌ తో కొంచెం ఎత్తులో ఉంటుంది. ఈ ఏడాది చివరలో అమెరికాలో అఫీలా 1 డెలివరీ ప్రారంబించాలని భావిస్తున్నట్లు సోనీ హోండా మొబిలిటీ కన్ఫార్మ్ చేసింది. 2026 చివరిలో కాలిఫోర్నియాకు, 2027లో అరిజోనా, జపాన్‌ లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

జనవరి 2025 నుంచే రిజర్వేషన్లు ప్రారంభం

వాస్తవానికి జనవరి 2025 నుంచే కాలిఫోర్నియాలో రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరిలో 2025లో కంపెనీ ఫస్ట్  అఫీలా స్టూడియో షోరూమ్‌లను ప్రారంభించింది. ఒక సంవత్సరం లోపు, 100,000 మందికి పైగా వప్రజలు షోరూమ్‌లను సందర్శించారు. 24,000 కంటే ఎక్కువ ఇన్ వెహికల్ డెమోలు చూపించారు. రాబోయే కొన్ని నెలల్లో, కాలిఫోర్నియాలోని టోరెన్స్,  ఫ్రీమాంట్‌ లో అఫీలా స్టూడియో, డెలివరీ హబ్‌లను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది చివరలో మో డ్రైవ్‌ లను కలిగి ఉన్న అఫీలా అడ్వాన్స్‌ డ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌ లో చేరడానికి ముందస్తు రిజర్వేషన్ హోల్డర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ జాయింట్ వెంచర్ ఇప్పటికే ఒహియోలోని హోండా ఈస్ట్ లిబర్టీ ఆటో ప్లాంట్‌లో భారీ ఉత్పత్తికి సిద్ధమవుతున్నందున ట్రయల్ ప్రొడక్షన్‌ ను ప్రారంభించింది.

Advertisement

Read Also: బజాజ్ To హోండా.. 2026 ట్రెండింగ్స్ బైక్స్ ఇవే!

ధర ఎంత ఉంటుందంటే?

SHM ప్రకారం, అఫీలా 1 అధునాతన సాఫ్ట్‌ వేర్, హై ఫర్ఫార్మెన్స్ ను కలిగి ఉంటుంది.  ఇది వెహికిల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో నేరుగా ప్లే స్టేషన్ 5ని ప్లే చేయగల సామర్థ్యంతో సహా సోనీ ఎంటర్ టైన్ మెంట్ ప్లాట్‌ఫారమ్‌ కు యాక్సెస్ కలిగి ఉంటుంది.  అఫీలా 1 18 కెమెరాలు, 1 LiDAR, 9 రాడార్లు, 12 అల్ట్రాసోనిక్ సెన్సార్లతో సహా 40 సెన్సార్‌ లతో అమర్చబడి ఉంటుంది.  ఇంటెలిజెంట్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా కొత్త అడ్వాన్స్‌ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం చివర్లో వచ్చే సిగ్నేచర్ ట్రిమ్ $102,900(రూ. 9,170,000)నుంచి ప్రారంభమవుతుంది. 2027లో ప్రారంభించనున్న ఆరిజిన్ ధర $89,900(రూ.8,080,000) నుంచి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం అఫీలా రిజర్వేషన్లు వెబ్‌ సైట్‌ ద్వారా $200(రూ. 18,000) తిరిగి చెల్లించే డిపాజిట్ తో అందుబాటులో ఉన్నాయి. అయితే, హోండా- సోనీ జాయింట్ వెంచర్ అమెరికాలో టెస్లాను తట్టుకుని నిలబడగలదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2028లో వచ్చే SUVతో కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Read Also:  ఒక్క ఛార్జ్ తో 400 కిలో మీటర్ల రేంజ్, సింపుల్ ఎనర్జీ నుంచి అదిరిపోయే ఈవీ!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×