E-Paper
Advertisement

Honda Shine vs Honda SP 125: హోండా షైన్ vs హోండా SP 125.. ఏది కొంటే బెస్ట్ అంటే?

Honda Shine vs Honda SP 125: హోండా షైన్ vs హోండా SP 125.. ఏది కొంటే బెస్ట్ అంటే?
Advertisement

Honda Shine vs Honda SP 125 Comparison: హోండా కంపెనీ నుంచి బెస్ట్ కమ్యూటర్స్ హోండా షైన్, హోండా SP 125. రెండూ 125 cc ఇంజిన్ తో అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు బైక్స్ ఫీచర్లు ఎలా ఉన్నాయి? డిజైన్, ఇంజిన్ ప్రత్యేకలు ఉంటి? మైలేజ్ ఎంత ఇస్తుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ డిజైన్

BS6గా మారిన తర్వాత హోండా షైన్ చిన్న చిన్న మార్పులకు గురయ్యింది. మరింత అందమైన కమ్యూటర్ ఓరియెంటెడ్ డిజైన్‌ను కలిగి ఉంది. అదే సమయంలో, SP 125 హెడ్‌ ల్యాంప్, ఫ్యూయెల్ ట్యాంక్, పొడవైన, సొగసైన టెయిల్ సెక్షన్‌ తో స్పోర్టీ లుక్ ను కలిగి ఉంది. ఇది ఫ్యాన్సియర్ లుకింగ్ అల్లాయ్ వీల్స్‌ ను కలిగి ఉంటుంది.

⦿ ఫీచర్లు

Advertisement

షైన్ ఫీచర్ల పరంగా కూడా చాలా ప్రైమరీగా ఉంటుంది. సాంప్రదాయ లైటింగ్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. స్టార్ట్ స్టాప్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ హై బీమ్, పాస్ స్విచ్ లాంటి ఫీచర్లు ఉంటాయి. SP 125 LED హెడ్‌ ల్యాంప్, టెయిల్ లాంప్ తో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రూపంలో మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ రెండు బైక్‌లలో తక్కువ ఇంజిన్ క్రాంకింగ్ సౌండ్ కోసం ACG సైలెంట్ స్టార్టర్ ఉంటుంది.

⦿ బైక్స్ కొలతలు

షైన్, SP 125 కొలతలు పరంగా కొద్దిగా భిన్నంగా ఉంటాయి. షైన్ సీటు పొడవు 651mm కాగా, SP 125 సీటు పొడవు 705mm. ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. షైన్ 114kg (డ్రమ్), 115kg (డిస్క్) బరువుతో తేలికగా ఉంటుంది. SP 125 బరువు 117kg (డ్రమ్), 118kg (డిస్క్) ఉంటుంది. ముందు భాగంలో రెండు బైక్‌లు ఒకేలా ఉన్నప్పటికీ, SP 125 11 లీటర్ల ప్యూయెల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇది షైన్ కంటే అర లీటరు పెద్దగా ఉంటుంది.

⦿ ఇంజిన్

Advertisement

ఈ బైక్‌లకు 24cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది 7,500rpm దగ్గర 10.5bhp,  6,000rpm దగ్గర 11Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్  మంచి మైలేజీ ఇస్తుంది. SP 125 ఐదు స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉంటుంది. BS4 మోడల్‌ లో నాలుగు స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉన్నట్లుగానే షైన్ BS6 అప్ డేటెడ్ వెర్షన్ లో ఉంటుంది.

ధర ఎలా ఉంటుందంటే?

హోండా షైన్ డ్రమ్ బ్రేక్ మోడల్ ధర రూ.67,857, డిస్క్ వేరియంట్ ధర రూ.72,557తో చౌకగా ఉంటుంది. అటు SP 125 కూడా రూ.73,452 (డ్రమ్),  రూ.77,652 (డిస్క్) గా ఉంటుంది. షైన్ తో పోల్చితే SP 125 ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

Read Also: టీవీఎస్ To బజాజ్.. ఫిబ్రవరిలో ట్రెండింగ్ మైలేజ్ బైక్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×