// // Honda Shine 125: హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Honda Shine 125: హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?

Honda Shine 125: హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?
Advertisement

Honda Shine 125 Limited Edition Bike: హోండా కంపెనీ నుంచి విడుదలైన షైన్ మోడల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కించుకుంది. లక్షలాది అమ్మకాలతో ఇండియన్ టూవీలర్ మార్కెట్ లో టాప్ బైక్ గా సత్తా చాటింది. ఇప్పటికే ఈ బైక్ పలు అప్ డేట్స్ ను అందుకుంది. ప్రస్తుతం షైన్ 125 డిస్క్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ ను ఇండియన్ మార్కెట్ లోకి  విడుదల చేసింది. ఈ కొత్త బైక్ కు సంబంధించిన  పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్‌ ధర ఎంత అంటే?

హోండా ఇటీవల లాంచ్ చేసిన షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్‌ ను ఇండియన్ మార్కెట్ లోకి రూ. 86,211 (ఎక్స్ షోరూమ్) ధరకు విడుదల చేసింది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న షైన్ 125 డిస్క్ వేరియంట్ కంటే జస్ట్ రూ. 1,000 ఎక్కువతో అందుబాటులోకి వచ్చింది.

కొత్త రంగుల్లో సరికొత్త వేరియంట్

Advertisement

షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్‌ పెర్ల్ సైరెన్ బ్లూ  స్పెషల్ కలర్ స్కీమ్ ను కలిగి ఉంది. బైక్ పెట్రోల్ ట్యాంక్‌ మీద బ్రౌన్ గ్రాఫిక్స్‌ తో మొత్తం ముదురు నీలం రంగు ఫినిషింగ్ ను కలిగి ఉంటుంది. హోండా దీనికి పైరైట్ బ్రౌన్ రంగు మిశ్రమ లోహాలను కూడా ఇచ్చింది. ఇది బైక్‌కు మరింత ప్రీమియం టచ్ ఇస్తుంది.  లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేక గ్రాఫిక్స్, పెయింటెడ్ రిమ్‌ల కారణంగా మరింత ఖరీదైనదిగా అనిపిస్తుంది. ఇది షైన్ 125 లైనప్‌ లోని మరే ఇతర వేరియంట్‌కు లభించదు. కానీ, కొత్త రంగులను పక్కన పెడితే, షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ టెక్నికల్ గా షైన్ 125 డిస్క్ లాగానే ఉంటుంది.

షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్‌ ఇంజిన్ గురించి..

షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్‌ ఇంజిన్ పవర్ గురించి తెలుసుకుంటే.. ఇది 10.6bhp పవర్, 11Nm టార్క్ ను అందించనుంది.  కానీ, అదే 123.94cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ తో శక్తిని పొందుతుంది. ఇది ముందు భాగంలో 240mm డిస్క్ బ్రేక్,  వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. అదనపు భద్రత కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ తో ఉంటుంది.

Advertisement

Read Also: టీవీఎస్ ఐక్యూబ్ vs యమహా EC-06.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది కొంటే మంచిదంటే?

అడిషనల్ రూ. 1000 అందుకేనా?

ప్రస్తుత షైన్ 125 డిస్క్ తో పోల్చితే, షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్‌ ధర కేవలం రూ. 1000 అదనంగా ఉంది. అయితే, ప్రత్యేక కలర్ స్కీమ్, పెయింట్ చేయబడిన రిమ్‌ల కోసమే ఈ అదనపు ధర తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, హోండా షైన్ 125కి భవిష్యత్తులో మరింత సమగ్రమైన అప్ డేట్స్ ఇస్తుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×