E-Paper
Advertisement

హోండా అడ్వెంచర్ స్కూటర్ వచ్చేస్తోంది.. హీరో జూమ్, ఏరాక్స్‌కు చుక్కలే!

హోండా అడ్వెంచర్ స్కూటర్ వచ్చేస్తోంది.. హీరో జూమ్, ఏరాక్స్‌కు చుక్కలే!
Advertisement

హోండా కంపెనీ భారత్ లోకి  సరికొత్త అడ్వెంచర్ స్కూటర్‌ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ADV160 స్కూటర్‌ కు సంబంధించిన డిజైన్ పేటెంట్‌ కోసం అప్లై చేసింది. దీంతో ఈ స్కూటర్ త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో అమ్ముడవుతున్న ADV160 మోడల్‌ మాదిరిగానే ఉండబోతోంది.

భారత్ లో హోండాకు మంచి గుర్తింపు

Advertisement

భారత్ లో హోండా ఇప్పటికే యాక్టివా, డియో లాంటి స్కూటర్లతో పెద్ద మార్కెట్‌ ను సంపాదించింది. ఇప్పటి వరకు కంపెనీ రోజువారీ వినియోగానికి అనువైన కమ్యూటర్ స్కూటర్లపైనే దృష్టి పెట్టింది. కానీ, ఇప్పుడు మార్కెట్లో స్పోర్టీ, అడ్వెంచర్ స్టైల్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఆ సెగ్మెంట్‌ లోకి అడుగుపెడుతోంది.

ఇటీవల భారత మార్కెట్లో పర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యత ఉన్న స్కూటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా యమహా మోటార్ కంపెనీ ఏరాక్స్ 155 మంచి సక్సెస్ అందుకుంది. హీరో జూమ్ 160 కూడా ఈ సెగ్మెంట్‌ లో మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు హోండా ADV160తో తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. ADV160 సాధారణ స్కూటర్‌ లా కాకుండా అడ్వెంచర్ స్టైల్ డిజైన్‌ తో వస్తుంది. ముందు భాగంలో పెద్ద ఫెయిరింగ్, ఎత్తైన విండ్‌ స్క్రీన్, స్ట్రాంగ్ బాడీ డిజైన్ దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చనున్నాయి. భారత మార్కెట్ కోసం కొన్ని చిన్న మార్పులు కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆకట్టుకునే ఫీచర్లు

Advertisement

ఫీచర్ల పరంగా కూడా ఈ స్కూటర్ చాలా ప్రీమియంగా ఉండనుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఇగ్నిషన్, ఆల్ LED లైటింగ్, అడ్జస్టబుల్ విండ్‌ స్క్రీన్, స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, USB మొబైల్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. యూత్ ను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.

ఇక ఈ స్కూటర్ అండర్‌ బోన్ ఫ్రేమ్‌ పై తయారవుతుంది. దీని వల్ల రైడింగ్ స్టెబిలిటీ మెరుగ్గా ఉండటంతో పాటు రోడ్లపై మంచి బ్యాలెన్స్ లభిస్తుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. బ్రేకింగ్ కోసం ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఇవ్వనున్నారు. సింగిల్ ఛానల్ ABS కూడా స్టాండర్డ్‌ గా అందించే అవకాశం ఉంది.

ఇంజిన్ గురించి..

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 157cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది సుమారు 16hp పవర్, 14.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ADV160 మంచి రిఫైన్‌ మెంట్‌ తో రావచ్చని భావిస్తున్నారు.  ఇందులో 8.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఇది ఏరాక్స్, జూమ్ లాంటి పోటీ మోడల్స్ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. హోండా ADV160 భారత్ లో ప్రీమియం అడ్వెంచర్ స్కూటర్ సెగ్మెంట్‌ లో గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

Read Also: వెన్యూ మైలేజ్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్స్.. సిటీలో ఎంత ఇస్తుందంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×