E-Paper
Advertisement

హోండా 0 ఆల్ఫా ఈవీ ఇంటీరియర్ లీక్.. భారీ టచ్‌ స్క్రీన్‌ తో డిజైన్ అదిరింది భయ్యా!

హోండా 0 ఆల్ఫా ఈవీ ఇంటీరియర్ లీక్.. భారీ టచ్‌ స్క్రీన్‌ తో  డిజైన్ అదిరింది భయ్యా!
Advertisement

Honda 0 Alpha Electric SUV Interior Revealed: హోండా ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ SUV 0 ఆల్ఫా EVని 2027లో మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, అధికారిక లాంచ్‌ కు ముందే ఈ కారు ఇంటీరియర్‌ కు సంబంధించిన స్పై ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ఎలా ఉండబోతోందో తెలిసింది. నిజానికి ఈ ఏడాది మార్చి నుంచి హోండా భారత్‌ లో ఈ వెహికల్ ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన ఫోటోల్లో కారులోని క్యాబిన్ డిజైన్ స్పెషల్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా డాష్‌ బోర్డ్‌  మీద అమర్చిన భారీ టచ్‌ స్క్రీన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్క్రీన్ ద్వారా వెహికల్ లోని పలు ఫీచర్లను కంట్రోల చేసే అవకాశం ఉంటుంది.

సూపర్ లుక్ ఇంటీరియర్

టచ్‌ స్క్రీన్ పక్కనే చిన్న డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో స్పీడ్, బ్యాటరీ స్థితి, రేంజ్ లాంటి కీలక సమాచారం కనిపించే అవకాశం ఉంది. అలాగే, మూడు స్పోక్‌ లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఈ కారుకు స్పోర్టీ లుక్‌ ను ఇస్తోంది. స్టీరింగ్ వెనుక ప్యాడిల్ షిఫ్టర్లు కూడా కనిపించాయి. ఇప్పటి కార్లలో ఎక్కువగా అన్ని ఫంక్షన్లు టచ్‌ స్క్రీన్‌ లోనే ఉంటున్నప్పటికీ, హోండా మాత్రం ఫిజికల్ బటన్లను కూడా కొనసాగించింది. సెంటర్ కన్సోల్‌ పై క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఫీచర్ల కోసం ప్రత్యేక బటన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో డ్రైవింగ్ సమయంలో ఫీచర్లను సులభంగా ఉపయోగించుకోవచ్చు.

హోండా 0 ఆల్ఫా EV డిజైన్ గురించి..

Advertisement

బయటి డిజైన్ విషయానికి వస్తే, హోండా 0 ఆల్ఫా EV ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న ఇతర హోండా కార్లకు పూర్తిగా భిన్నంగా కనిపించనుంది. ఈ SUVకు బాక్సీ డిజైన్, పెద్ద బంపర్లు, సన్నని హెడ్‌ లైట్లు, నిలువుగా ఉండే టెయిల్ ల్యాంప్స్, స్క్వైర్ వీల్ ఆర్చ్‌ లు ఉండనున్నాయి. ఇవి రోడ్లపై ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉంది.

బ్యాటరీ గురించి..

బ్యాటరీ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇండోనేషియా నుంచి తీసుకొచ్చే CATL బ్యాటరీ ప్యాక్ ఇందులో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే మంచి డ్రైవింగ్ రేంజ్ అందించేలా హోండా ఈ SUVను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏ మోడల్స్ కు పోటీ ఇస్తుందంటే?

Advertisement

భారత్‌ లో విడుదలైన తర్వాత హోండా 0 ఆల్ఫా EVకు గట్టి పోటీ ఎదురుకానుంది. మహీంద్రా BE 6, ఎంజీ మోటార్ ZS EV, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా మోటార్స్ సియెర్రా EV, మారుతి సుజుకి ఇ-విటారా లాంటి మిడ్‌ సైజ్ ఎలక్ట్రిక్ SUVలకు పోటీగా నిలవనుంది.

Read Also: 2031 నాటికి 15 మోడళ్లు.. టాటా ప్లాన్ చూస్తే మతిపోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×