E-Paper
Advertisement

Car Protection – Holi: హోలీ రంగుల కేళీ.. కారు మీద పడ్డ కలర్ మరకలు సింపుల్ గా ఇలా తొలగించుకోండి!

Car Protection – Holi: హోలీ రంగుల కేళీ.. కారు మీద పడ్డ కలర్ మరకలు సింపుల్ గా ఇలా తొలగించుకోండి!
Advertisement

హోలీ సందర్భంగా దేశ వ్యాప్తంగా కోలాహలంగా ఉంటుంది. చిన్నా, పెద్దా అంతా కలిసి రంగుల్లో మునిగితేలుతారు. రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇక చిన్నపిల్లలు రంగు నీళ్లలో తేలియాడుతారు. అయితే, రంగు నీళ్ల మరకలు కార్లు, బైకుల మీద పడుతాయి. కొన్ని మరకలను తొలగించడం చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ మరకలు అలాగే ఉండిపోతాయి. పెయింటింగ్ ను కూడా డ్యామేజ్ చేస్తాయి. అయితే, హోలీ వేళ కార్ల మీద పడిన రంగు మరకలను ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కారును రంగు మరకల నుండి ఎలా కాపాడుకోవాలి?

⦿ పార్కింగ్

హోలీ వేళ కారును రంగులు పడగని ప్రదేశంలో పార్క్ చేయాలి. గ్యారేజ్ లేదంటే పార్కింగ్ స్థలంలో కారును పెట్టాలి. వీలుంటే దాని మీద కవర్ కప్పడం మంచిది. ఒకవేళ పొరపాటున రంగునీళ్లు పడ్డా, అవి కవర్ మీదే ఉండిపోతాయి.  వీలైనంత వరకు హోలీ ఆడే సమయంలో గ్యారేజీ షటర్ ను క్లోజ్ చేయడం మంచిది.

⦿ మైనంతో పాలిష్ చేయండి!

Advertisement

కారు మీది వ్యాక్స్ పూత పూయడం వల్ల మరింత మెరిసేలా కనిపించడంతో పాటు కారు కలర్ ను ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాదు, హోలీకి ఉపయోగించే రంగులు కారు పెయింట్‌ ను దెబ్బ తీయకుండా కాపాడుతాయి. కారు వెలుపలి భాగం దెబ్బతినకుండా, రంగుకు డ్యామేజీ కలగకుండా ఉంచడానికి మైనపు పాలిష్ అనేది రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది.

⦿ కారు లోపలి భాగాలను కాపాడుకోవాలి!

హోలీ రంగు మరకలు కారు పై భాగంతో పాటు ఇంటర్నల్ గానూ పడే అవకాశం ఉంటుంది. అందుకే, బయటి భాగంతో పాటు కారు లోపలి భాగాలను కూడా కాపాడుకోవాలి.  ముందుగా, కారు కిటికీలు జాగ్రత్తగా మూసివేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసి పెట్టకూడదు. మీ బట్టల మీద పడిన కలర్ మరకలు కారు సీట్లకు అంటుకోకుండా, కవర్ ను కప్పాలి. డాష్‌బోర్డ్, ఇతర భాగాల మీద మైనపు పొరను పూయాలి. ఇలా చేయడం వల్ల ఏదైనా కలర్ మరకలు పడినా, ఈజీగా శుభ్రం చేసుకునే అవకాశం ఉంటుంది. హోలీ ఆడుతున్న వ్యక్తికి కారులో వెళ్ళవలసి వస్తే, వారిని లోపలికి అనుమతించే ముందు సీట్లు, కింది భాగంలో కలర్ నుంచి కాపాడే షీట్‌ ను ఉంచాలి.

⦿ కలర్ మరకలను ఎలా తొలగించాలి?

Advertisement

ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కారు మీద మరకలు పడినట్లు అయితే, వాటిని కొన్ని పద్దతులు పాటించడం వల్ల తొలగించే అవకాశం ఉంటుంది. రంగు మరకలు పొయేలా చేయాలంటే కారును షాంపూతో కడగాలి. అయితే, కారు వాష్ సమయంలో ఎలాంటి డిటర్జెంట్, హార్డ్ సోప్ లు వాడకూడదు. వీటి మూలంగా కారు పెయింటింగ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కఠినంగా లేని కారు షాంపూ, సబ్బును ఉపయోగించాలి. ఎందుకంటే, ఇవి కారు కలర్ కు ఎలాంటి హాని కలిగించవు.

Read Also: ఎలక్ట్రిక్ కారు యజమానులకు అలర్ట్, ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×