// // Impala Car for Weddings: పెళ్లి బరాత్ ల బ్రాండ్ షెవర్లెట్ ఇంపాలా.. వామ్మో ఈ కార్ల వెనుక ఇంత కథ ఉందా? -->
E-Paper
Advertisement

Impala Car for Weddings: పెళ్లి బరాత్ ల బ్రాండ్ షెవర్లెట్ ఇంపాలా.. వామ్మో ఈ కార్ల వెనుక ఇంత కథ ఉందా?

Impala Car for Weddings:  పెళ్లి బరాత్ ల బ్రాండ్ షెవర్లెట్ ఇంపాలా.. వామ్మో ఈ కార్ల వెనుక ఇంత కథ ఉందా?
Advertisement

Chevrolet Impala Vintage Cars: ఒకప్పుడు ఇండియాలో పెళ్లి బరాత్ లకు ఫేవరెట్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది షెవర్లెట్ ఇంపాలా. నార్త్ నుంచి సౌత్ వరకు ధనవంతుల పెళ్లిళ్లలో ఈ కారులో నూతన వధూవరులు ఊరేగాల్సిందే. అంతలా క్రేజ్ సంపాదించుకుంది. అమెరికన్ కార్ మాన్యుఫ్యాక్చరర్ షెవర్లెట్ ఈ కార్లను తయారు చేసింది. ఇది 1958లో తొలిసారి మార్కెట్ కు పరిచయం అయ్యింది. 1985 వరకు ఉత్పతి అయ్యాయి. ఆ తర్వాత 1994-1996, 2000-2020 వరకు తయారయ్యాయి. వింటేజ్ మోడల్స్ 1958-1970 మధ్య కాలంలో ఉత్పత్తి అయ్యాయి. ఈ ఐకానిక్ కార్లు అమెరికాతో పాటు  ప్రపంచ వ్యాప్తంగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. భారత్ లో ఈ వింటేజ్ ఇంపాలా కార్లు వివాహాలు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, సినిమాలకు హైర్ చేసుకునే వారు. ఎందుకంటే అవి లగ్జరీ, క్లాసిక్ లుక్ ఇస్తాయి.

ఇంపాలా కార్ల గురించి..  

ఇంపాలా తొలుత 1956లో GM మోటరమా షోలో కాన్సెప్ట్ కారుగా ప్రదర్శించబడింది.  తర్వాత 1958లో ప్రొడక్షన్ మోడల్‌గా వచ్చింది. ఇది ఆఫ్రికన్ యాంటెలోప్ పేరు మీదుగా ఇంపాలాగా మారింది. వింటేజ్ ఎరాలో అంటే 1958-1970 వరకు ఇది అమెరికాలో టాప్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 1965లో 10 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.

Advertisement

⦿ మొదటి జనరేషన్ (1958): బెల్ ఎయిర్ సబ్ సిరీస్‌గా పరిచయంగా పరిచయం అయ్యింది. ట్రిపుల్ టెయిల్‌లైట్స్, 283 క్యూబిక్ ఇంచ్ V8 ఇంజిన్ (185-250 hp), ఎయిర్ రైడ్ సస్పెన్షన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. 1.8 లక్షల యూనిట్లు తయారయ్యాయి.

⦿ రెండవ జనరేషన్ (1959-1960): రీడిజైన్‌ తో టెయిల్‌ ఫిన్స్, టియర్‌డ్రాప్ టెయిల్‌ లైట్స్ ను కలిగి ఉంది. ఇంజిన్ 348 క్యూబిక్ ఇంచ్ V8 (335 hp వరకు) కలిగి ఉంటుంది. బాడీ స్టైల్స్ 4 డోర్ సెడాన్స్, వ్యాగన్స్ కలిగి ఉండేది. కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు ఎగుమతి అయ్యాయి.

Advertisement

⦿ మూడవ జనరేషన్ (1961-1964): సూపర్ స్పోర్ట్ (SS) ఆప్షన్, 409 క్యూబిక్ ఇంచ్ V8 (425 hp) ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. బబుల్‌బ్యాక్ రూఫ్, డ్రాగ్ రేసింగ్ కోసం Z11 ప్యాకేజ్ లాంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి.

⦿ నాలుగవ జనరేషన్ (1965-1970): రికార్డ్ సేల్స్, క్యాప్రైస్ లగ్జరీ ప్యాకేజ్ సాధించింది ఇంజిన్స్ 396-454 క్యూబిక్ ఇంచ్ V8 (425 hp వరకు) సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కోక్ బాటిల్ డిజైన్, సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

⦿ ఐదు, ఆరవ జనరేషన్లు (1971-1985): ఫ్యూయల్ క్రైసిస్ కారణంగా డౌన్‌ సైజ్, ఎమిషన్స్ రెగ్యులేషన్లు వచ్చి చేరాయి.  V6, V8 ఇంజిన్లను కలిగి ఉన్నాయి. తక్కువ పవర్. ఫ్లీట్ యూజ్ కు పాపులర్ అయ్యాయి. 2020లో ప్రొడక్షన్ ఆగిపోయింది.

భారత్ లో వివాహాలకు ఉపయోగం  

భారత్ లో ఇంపాలా కార్లు తయారు కాలేదు. కానీ, 1950- 1960లలో వింటేజ్ మోడల్స్ ఇంపోర్ట్ చేసి రెస్టోర్ చేయబడ్డాయి. ఇవి పెళ్లి బరాత్,  ప్రీ-వెడ్డింగ్ షూట్స్, మ్యూజిక్ వీడియోలకు హైర్ చేసుకునేవాళ్లు. రెట్రో లగ్జరీని అందించేవి. గోవా, పంజాబ్, హైదరాబాద్, వడోదరా, కేరళలలోనూ ఈ కార్లు కిరాయిలకు ఇచ్చేవారు.

Read Also: ఇండియాలోకి అడుగు పెట్టిన ఫస్ట్ టెస్లా కారు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×