// // Hero Xoom 160: సూపర్ లుక్, అంతకు మించి మైలేజ్, హీరో జూమ్ 160 అదుర్స్ అంతే! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Hero Xoom 160: సూపర్ లుక్, అంతకు మించి మైలేజ్, హీరో జూమ్ 160 అదుర్స్ అంతే!

Hero Xoom 160:  సూపర్ లుక్, అంతకు మించి మైలేజ్, హీరో జూమ్ 160 అదుర్స్ అంతే!
Advertisement

ప్రముఖ మోటార్ సైకిల్ సంస్థ హీరో నుంచి విడుదల అయిన క్రేజీ స్కూటర్ హీరో జూమ్ 160 (Hero Xoom 160). ఇది  156cc, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ తో వచ్చే శక్తివంతమైన మ్యాక్సీ స్టైల్ స్కూటర్. ఇది సుమారు 14.81 PS పవర్, 14 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్ తో సుమారు 40 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 1.37 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. డిజిటల్ కన్సోల్, USB ఛార్జర్,  స్మార్ట్ కీ  లాంటి ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.

హీరో జూమ్ 160 పూర్తి వివరాలు..

ఈ స్కూటర్ ధర సుమారుగా రూ.1,36,898 నుంచి రూ. 1,37,115 వరకు ఉంటుంది. ఈ స్కూటర్ పవర్ పుల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 156 cc, 4-వాల్వ్, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 8000 rpm దగ్గర 14.81 PS పవర్ ను అందిస్తుంది. 6250 rpm దగ్గర 14 Nm గరిష్ట టార్క్ ను అందిస్తుంది. ఈ స్కూటర్ లో ఆటో మేటిక్ ట్రాన్స్‌ మిషన్  ఉంటుంది. సుమారు 40 కిలో మీటర్ల ARAI సర్టిఫైడ్ మైలేజ్ ఇచ్చే ఈ స్కూటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 7 లీటర్లు ఉంటుంది.

హీరో జూమ్ 160 కీలక ఫీచర్లు

Advertisement

ఈ స్కూటర్ డిజైన్ క్రేజీగా ఉంటుంది. మ్యాక్సీ స్కూటర్ స్టైల్, ఎత్తైన విండ్‌ స్క్రీన్, అడ్వెంచర్ థీమ్ తో ఆకట్టుకుంటుంది. ఇక లైటింగ్ విషయానికి వస్తే ఫుల్ LED హెడ్‌ లైట్, టెయిల్ లైట్, సీక్వెన్షియల్ LED టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను చూస్తూ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 22 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ ఉంటుంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. స్మార్ట్ కీ, ఫ్రంట్ కబ్బీలో USB ఛార్జింగ్ పోర్ట్ ను కలిగి ఉంటుంది.

Read Also:  అదిరిపోయే రంగుల్లో KTM 250 డ్యూక్, చూస్తే వావ్ అనాల్సిందే!

హీరో జూమ్ 160  టెక్నికల్ వివరాలు   

Advertisement

ఈ స్కూటర్ బరువు 142 కేజీలు ఉంటుంది. 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్  బ్రేక్స్ తో వస్తుంది. ఇక ప్రస్తుతం హీరో జూమ్ 160  మార్కెట్ లో యమహా Aerox 155కి పోటీని ఇస్తుంది. ఈ స్కూటర్ మంచి స్థిరత్వం, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి రూపొందించబడింది.

Read Also: యమహా To వెస్పా.. మార్చిలో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×