E-Paper
Advertisement

100 కి.మీ రేంజ్, సూపర్ స్మార్ట్ ఫీచర్స్.. జస్ట్ రూ. 45 వేలకే బెస్ట్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్!

100 కి.మీ రేంజ్, సూపర్ స్మార్ట్ ఫీచర్స్.. జస్ట్ రూ. 45 వేలకే బెస్ట్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్!
Advertisement

Best Budget Hero Electric Scooter: పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎక్కువ రేంజ్ ఈవీ స్కూటర్ కొనాలంటే ఎక్కువ డబ్బు ఖర్చవుతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ, హీరో కంపెనీ చౌక ధరలో చక్కటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. విడా VX2 గో పేరుతో ఈ స్కూటర్ మార్కెట్ కు పరిచయం చేసింది. తక్కువ ధర, మంచి రేంజ్, స్మార్ట్ ఫీచర్లతో ప్రస్తుతం దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

హీరో విడా VX2 గో గురించి..

హీరో విడా VX2 గో తక్కువ ధరతో అందిస్తున్నారు. ఈ స్కూటర్ ధర సుమారు రూ.44,990 నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ విధానం ద్వారా ఇంత తక్కువ ధరకు అందిస్తోంది. అంటే, బ్యాటరీని పూర్తిగా కొనాల్సిన అవసరం లేకుండా, ఉపయోగించుకున్నందుకు నెలవారీ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ఒకేసారి ఎక్కువ డబ్బు పెట్టాల్సిన అవసరం తగ్గుతుంది.

ఒకే ఛార్జ్ తో 100 కి.మీ రేంజ్

Advertisement

ఈ స్కూటర్‌ లో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 2.2 kWh, 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌లను వినియోగదారులు ఎంచుకోవచ్చు. పూర్తి ఛార్జ్‌ పై సుమారు 92 నుంచి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్‌  సరిపోతుంది. గంటకు సుమారు 70 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.  ధర తక్కువగా ఉన్నప్పటికీ హీరో కంపెనీ ఫీచర్ల విషయంలో రాజీ పడలేదు. విడా VX2 గోలో 4.3 అంగుళాల LCD డిస్‌ ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్‌ కు కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా నావిగేషన్, బ్యాటరీ రేంజ్, ఇతర ప్రయాణ వివరాలు ఈజీగా చూసే అవకాశం ఉంటుంది.

భద్రత పరంగా కూడా ఇందులో కొన్ని స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. యాంటీ థెఫ్ట్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ లాంటి టెక్నాలజీ స్కూటర్ భద్రతను మెరుగుపరుస్తాయి. దీంతో స్కూటర్ ఎక్కడ ఉందో ఈజీగా ట్రాక్ చేయవచ్చు. ఈ స్కూటర్‌ లోని బ్యాటరీని సులభంగా బయటకు తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ అవసరం ఉండదు. సాధారణ పవర్ సాకెట్ ద్వారా ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అపార్ట్‌ మెంట్లలో నివసించే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

తక్కువ రన్నింగ్ కాస్ట్

Advertisement

హీరో విడా VX2 గో మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కిలోమీటరుకు సుమారు రూ.0.90 నుంచి రూ.1.47  ఖర్చవుతుంది. పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది. రోజూ ఆఫీస్, కాలేజ్, తక్కువ దూర  ప్రయాణాల కోసం వాడేవారికి ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది.

Read Also: జస్ట్ రూ.3 లక్షల్లో ఎలక్ట్రిక్ 4 వీలర్.. బజాజ్ నుంచి క్యూట్ EV వచ్చేస్తోంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×