E-Paper
Advertisement

రూ.1 లక్షలో హీరో కొత్త EV.. మార్కెట్‌ను షేక్ చేయనున్న విడా!

రూ.1 లక్షలో హీరో కొత్త EV.. మార్కెట్‌ను షేక్ చేయనున్న విడా!
Advertisement

Upcoming Hero Vida Launch: భారత మార్కెట్లో సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి హీరో మోటోకార్ప్ నుంచి త్వరలో ఒక కొత్త ఆప్షన్ రానున్నట్లు తెలుస్తోంది. రూ.1 లక్షలోపు ధరలో ఎంట్రీ లెవల్ విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఈ మోడల్ ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై హీరో నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.

బ్యాటరీ గురించి..

ఈ కొత్త స్కూటర్‌ లో 3.8kWh ఫిక్స్‌ డ్ బ్యాటరీ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం విడా స్కూటర్లలో ఉన్న రిమూవబుల్ బ్యాటరీలకు భిన్నంగా, ఇందులో ఫిక్స్ డ్ బ్యాటరీని ఉపయోగించే అవకాశం ఉంది. దీంతో తయారీ ఖర్చు తగ్గడంతో పాటు ధర కూడా అందుబాటులో ఉండేలా కంపెనీ జాగ్రత్తలు తీసుకుంటుంది. హీరో ఇప్పటికే విడా V1, VX2 వంటి మోడళ్లతో మార్కెట్లో ఉంది. ముఖ్యంగా VX2 విడుదల తర్వాత కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఇప్పుడు మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరలో మరో కొత్త మోడల్‌ను తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు..

Advertisement

ఈ స్కూటర్ హీరో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలో భాగంగా వస్తోంది. చిత్తూరులోని శ్రీ సిటీ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ పెట్టుబడులు పెడుతోంది. భవిష్యత్‌లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

ఇక కొత్త స్కూటర్‌కు సంబంధించిన పూర్తిగా టెక్నికల్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయినప్పటికీ 3.8kWh బ్యాటరీతో నగర ప్రయాణాలకు సరిపడే రేంజ్ అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మోటార్ సామర్థ్యం, గరిష్ట వేగం వంటి అంశాలపై కూడా స్పష్టత లేదు. ఇది ప్రధానంగా రోజువారీ నగర ప్రయాణాల కోసం రూపొందించే మోడల్ కావడంతో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఉండే అవకాశముందని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Read Also: సింగిల్ ఛార్జ్‌ తో 145 కి.మీ రేంజ్.. హోండా నయా ఈవీని చూస్తే మతిపోవాల్సిందే!

ఛార్జింగ్ సమయం, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి వివరాలు కూడా ఇంకా వెల్లడికాలేదు. అలాగే డిజిటల్ డిస్‌ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడ్ మోడ్స్, రివర్స్ అసిస్ట్ వంటి ప్రాథమిక ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఖరీదైన మోడళ్లలో కనిపించే ప్రీమియం ఫీచర్లు మాత్రం ఇందులో ఉండకపోవచ్చని అంచనా.

ధర రూ. లక్ష లోపే!

ధర విషయానికి వస్తే, ఈ స్కూటర్‌ను రూ.1 లక్షలోపు తీసుకురావడమే హీరో లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది నిజమైతే టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా ఎస్1, ఏథర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Read Also: ఏఐ టెక్నాలజీతో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×