// // Hero Splendor Plus Price: హీరో లవర్స్ కు షాక్, స్ప్లెండర్ ధరలు పెరిగాయ్! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Hero Splendor Plus Price: హీరో లవర్స్ కు షాక్, స్ప్లెండర్ ధరలు పెరిగాయ్!

Hero Splendor Plus Price: హీరో లవర్స్ కు షాక్, స్ప్లెండర్ ధరలు పెరిగాయ్!
Advertisement

Hero Splendor Plus Price Hike: దేశంలో అత్యంత చౌకైన, మన్నికైన బైక్ గా హీరో స్ప్లెండర్ ప్లస్ గుర్తింపు తెచ్చుకుంది. మంచి మైలేజ్ ఇవ్వడం, అంతకు మించి సర్వీసింగ్ సపోర్ట్ ఉంటంతో ఎక్కువ మంది ఈ బైక్స్ ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అయితే, తాజాగా  హీరో మోటోకార్ప్ వినియోగదారులకు షాకిచ్చింది. 2026 స్ప్లెండర్ ప్లస్ లైనప్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రారంభించబడిన 125 మిలియన్ ఎడిషన్ మినహా స్ప్లెండర్ లైనప్‌లోని అన్ని వేరియంట్‌ల ధరను పెంచినట్లు ప్రకటించింది.

ఏ వేరియంట్ మీద ఎంత ధర పెరిగిందంటే?

స్ప్లెండర్ ప్లస్ పెరిగిన ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

⦿ డ్రమ్: స్ప్లెండర్ ప్లస్ డ్రమ్ ధర గతంలో రూ. 73,902 ఉండగా, ఇప్పుడు రూ. 74,152కి పెరిగింది. ఈ వేరియంట్ మీద జస్ట్ రూ. 250 పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.

⦿ i3S: ఈ వేరియంట్ ధర గతంలో రూ. 75,055 ఉండగా, ప్రస్తుత ధర రూ. 75,305కి చేరింది. గతంతో పోల్చితే రూ. 250 పెరిగింది.

Advertisement

⦿ Xtec: ఈ వేరియంట్ ధర గతంలో రూ. 77,428 ఉండగా, ప్రస్తుతం రూ. 77,678కి చేరింది. పాత, కొత్త ధరల మధ్య తేడా రూ. 250 ఉంది.

⦿ Xtec 2.0 (డ్రమ్):  ఈ వేరియంట్ ధర రూ. 79,964 ఉండగా, ప్రస్తుతం రూ. 80,214కి చేరింది. ప్రస్తుతం రూ. 250కి పెరిగింది.

⦿ Xtec 2.0 (డిస్క్): దీని ధర గతంలో రూ. 80,471 ఉండగా, ప్రస్తుతం రూ. 80,721కి చేరింది. రెండింటి మధ్య రూ. 250 తేడా ఉంది.

ధరల పెంపు గురించి కంపెనీ ఏం చెప్పిందంటే?

పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేయడానికి ధరలను పెంచినట్లు హీరో ప్రకటించింది. అయితే, ధర పెరుగుదల స్వల్పంగా ఉన్న నేపథ్యంలో కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయదని తెలిపింది. బ్రాండ్ లైనప్‌ లో స్ప్లెండర్ ప్లస్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా గురింపు తెచ్చుకుంది. కానీ, స్ప్లెండర్ ప్లస్ క్రమంగా ధర పెరుగుతూ వస్తుంది. బేస్ వేరియంట్ 2025లో రూ. 80,000కి చేరింది. 22 సెప్టెంబర్, 2025 నుండి అమల్లోకి వచ్చిన GST 2.0, ధరలు తగ్గించే సాయపడింది. స్ప్లెండర్ ప్లస్‌ను చౌకగా మారింది.

Read Also:  అమ్మకాల్లో దుమ్మురేపిన కియా సోనెట్, ఏకంగా 5 లక్షల యూనిట్ల మార్క్ క్రాస్!

హీరో స్ప్లెండర్ ప్లస్ గురించి..

ఈ బైక్ ఇప్పటికీ 100cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 7.09bhp పవర్, 8.05Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మెకానికల్ బిట్లు కూడా అలాగే ఉన్నాయి. స్ప్లెండర్ ప్లస్ టెలిస్కోపిక్ ఫోర్క్‌ లో, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్‌ లలో తయారు చేయబడింది.

Read Also:  ఇండియన్స్ ఏ కలర్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతారో తెలుసా? కారణం ఇదే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×