E-Paper
Advertisement

అమ్మకాల్లో దుమ్మురేపిన హీరో.. స్ప్లెండర్ మళ్లీ నంబర్ వన్!

అమ్మకాల్లో దుమ్మురేపిన హీరో.. స్ప్లెండర్ మళ్లీ నంబర్ వన్!
Advertisement

Hero Sales Analysis 2026: హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో మరోసారి సత్తా చాటింది. గత ఈ నెలలో కంపెనీ దేశీయంగా మొత్తం 5,14,879 యూనిట్లను అమ్మింది. అంతకు ముందు ఏడాదిలో విక్రయించిన 3,56,165 యూనిట్లతో పోలిస్తే.. ప్రస్తుతం దాదాపు 44% పైగా వృద్ధిని సాధించింది. ఈ పెరుగుదలకు కారణం కమ్యూటర్ బైక్‌ లకు లభిస్తున్న ఆదరణ. ముఖ్యంగా స్ప్లెండర్ లాంటి మోడల్స్ కు జనాల నుంచి మంచి ఆదరణ రావడం.

టాప్ ప్లేస్ లో స్ప్లెండర్ మోడల్

గత నెలలో కూడా స్ప్లెండర్ టాప్ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఒక్కటే 3,21,952 యూనిట్లు అమ్మకాలతో సత్తా చాటింది. మొత్తం అమ్మకాలలో పెద్ద వాటాను పొందింది. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 55% వృద్ధిని నమోదు చేసింది. ఈ మోడల్ తర్వాత స్థానంలో హెచ్ఎఫ్ డీలక్స్ 71,717 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, దీనిలో వృద్ధి  సుమారు 1.6% తక్కువగా ఉంది. ఈ రెండు బైక్‌లు కలిసి హీరోకు మంచి అమ్మకాల రికార్డును నెలకొల్పాయి.

Advertisement

వీటితో పాటు మరికొన్ని మోడళ్లు మంచి వృద్ధిని నమోదు చేశాయి. గ్లామర్ బైక్ అత్యధిక వృద్ధిని చూపిన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 202%కు పైగా పెరుగుదలతో 22,677 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అలాగే డెస్టినీ 125 స్కూటర్ కూడా 27,369 యూనిట్లతో మంచి అమ్మకాలను అందుకుంది. ప్యాషన్ బైక్ 20,041 యూనిట్లతో మంచి పెరుగుదలను కొనసాగించింది. ఎక్స్‌ ట్రీమ్ 125ఆర్ కూడా మంచి అమ్మకాలను కనబరిచింది.

ఈవీలకు పెరుగుతున్న ఆదరణ

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి హీరో అమ్మకాలలో కూడా కనిపిస్తోంది. వీడా బ్రాండ్ కింద ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు 14,320 యూనిట్లతో 133% వృద్ధిని సాధించాయి. ఇది ముఖ్యంగా నగర ప్రాంతాల్లో EVలకు పెరుగుతున్న డిమాండ్‌ ను నిదర్శనంగా నిలుస్తోంది. ఇదే సమయంలో ఎక్స్‌ పల్స్ లాంటి అడ్వెంచర్ బైక్‌లు కూడా 3,602 యూనిట్లతో మంచి వృద్ధిని నమోదు చేశాయి. ఇక స్కూటర్ల విభాగంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. డెస్టినీ,  జూమ్ 125 మంచి అమ్మకాలను నమోదు చేసినప్పటికీ, ప్లెజర్ స్కూటర్ అమ్మకాలు తగ్గాయి. జూమ్ 125 దాదాపు 130% వృద్ధితో ముందుకు సాగగా, కొత్తగా వచ్చిన జూమ్ 160 తొలి దశలోనే కొంతమేర అమ్మకాలను సాధించింది.

సత్తా చాటని ప్రీమియం విభాగం

Advertisement

ప్రీమియం బైక్‌ల విషయానికి వస్తే, అమ్మకాలు పెద్దగా లేవు. ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్, కరిజ్మా 210 లాంటి మోడళ్లకు పరిమిత డిమాండ్ కనిపించింది. మావ్రిక్ 440 గత నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడవలేదు.  హీరో మోటోకార్ప్‌ కు ప్రధాన బలం ఇప్పటికీ కమ్యూటర్ బైక్‌ లే. స్ప్లెండర్ లాంటి మోడళ్లు కంపెనీకి భారీ అమ్మకాలను అందిస్తున్నాయి. అదే సమయంలో, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కొన్ని ప్రీమియం బైక్‌ల ద్వారా తన ఉత్పత్తిని విస్తరించడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read Also: డ్రైవింగ్ లో కారు విండ్‌ షీల్డ్‌ పగిలిందా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×