E-Paper
Advertisement

హీరో నుంచి 12 కొత్త మోడళ్లు.. పోటీ కంపెనీలకు ఇక ఇత్తడే!

హీరో నుంచి 12 కొత్త మోడళ్లు.. పోటీ కంపెనీలకు ఇక ఇత్తడే!
Advertisement

హీరో మోటోకార్ప్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదిరిపోయే ప్లాన్స్ వేస్తోంది. దేశంలో స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం బైక్‌ లకు పెరుగుతున్న డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ 12కు పైగా కొత్త మోడళ్లను విడుదల చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా EV సెగ్మెంట్‌ లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

ప్రీమియం మోడళ్లతో పాటు స్కూటర్లపై ఫోకస్

ఇప్పటి వరకు హీరో మోటోకార్ప్ ఎక్కువగా కమ్యూటర్ బైక్‌ లపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అయితే, ఇప్పుడు మార్కెట్ మారుతున్న నేపథ్యంలో కంపెనీ ప్రీమియం మోడళ్లతో పాటు స్కూటర్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో ముఖ్యంగా విడా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రాధాన్యత ఇస్తోంది. హీరో ఇప్పటికే హీరో జూమ్ స్కూటర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. అలాగే డెస్టినీ స్కూటర్ తయారీని కూడా మరింత విస్తరించే పనిలో ఉంది. మరోవైపు విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని కంపెనీ మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026 చివరి నాటికి ఈ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తోంది.

Advertisement

కంపెనీ అంచనాల ప్రకారం, 2030 నాటికి హీరో స్కూటర్ అమ్మకాలలో సగానికి పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా EVల వినియోగం క్రమంగా పెరుగుతుండటంతో హీరో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి విస్తరించకుండా, ప్రాంతాల వారీగా EV మార్కెట్‌ ను అభివృద్ధి చేయాలని హీరో భావిస్తోంది. విడా స్కూటర్ల కోసం షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లను పెంచుతోంది. అలాగే, స్థానికంగా విడిభాగాల తయారీ, సరఫరా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోంది. దీంతో ఖర్చులు తగ్గి ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని కంపెనీ నమ్ముతోంది.

ఏడాదిలో 12 మోడళ్లు విడుదల

FY27లో హీరో విడుదల చేయబోయే 12కు పైగా కొత్త మోడళ్లలో పెట్రోల్ బైక్‌లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నాయి. ముఖ్యంగా 125ccకు పైగా సామర్థ్యం కలిగిన ప్రీమియం బైక్‌లపై కంపెనీ ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినియోగదారులు ఎక్కువ ఫీచర్లు, మెరుగైన పనితీరు ఉన్న వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారని హీరో గుర్తించింది.

అమ్మకాల్లో దుమ్మురేపిన హీరో

Advertisement

గత ఆర్థిక సంవత్సరంలో హీరో దాదాపు 55 లక్షల మోటార్‌ సైకిళ్లు, 5.7 లక్షలకు పైగా స్కూటర్లను అమ్మింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం, ఎగుమతులు మెరుగుపడటం, ప్రీమియం బైక్‌ల అమ్మకాలు పెరగడం వల్ల కంపెనీ లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి. చివరి త్రైమాసికంలో కంపెనీ లాభం సుమారు 30 శాతం పెరిగినట్లు సమాచారం.

Read Also: VF3 To VF8.. భారత్‌ లోకి ఒకేసారి 3 కొత్త విన్‌ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×