E-Paper
Advertisement

10 సార్లు సర్వీస్ చేసినా నో ఛేంజ్.. యజమానికి రూ. 88 వేలు రీఫండ్ ఇవ్వాలని కోర్టు తీర్పు!

10 సార్లు సర్వీస్ చేసినా నో ఛేంజ్.. యజమానికి రూ. 88 వేలు రీఫండ్ ఇవ్వాలని కోర్టు తీర్పు!
Advertisement

Hero Gets Court Shock: బైక్ కొనుగోలు చేసిన కొద్ది రోజులకే ఇంజిన్ సమస్యలు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ వినియోగదారుడికి బెంగళూరులోని జిల్లా వినియోగదారుల కమిషన్ ఊరట కల్పించింది. సమస్యను పరిష్కరించేందుకు 10 సార్లకుపైగా సర్వీస్ సెంటర్‌ కు వెళ్లినా సాల్వ్ కాకపోవడంతో, హీరో మోటోకార్ప్ తో పాటు దానికి డీలర్ కు షాకిచ్చింది. వెహికల్ వెనక్కి తీసుకోవడంతో పాటు కొనుగోలుదారుడికి రూ.88,000 తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఈ కేసులో ఫిర్యాదుదారుడు బెంగళూరుకు చెందిన గణేష్ జె. 2024 జూలై 1న హీరో ఎక్స్‌ ట్రీమ్ 125R మోటార్‌ సైకిల్‌ ను సుమారు రూ.98,709కు కొనుగోలు చేశారు. అయితే, బైక్ కొనుగోలు చేసిన కొద్ది రోజులకే సమస్యలు మొదలయ్యాయి. రోడ్డుపై వెళ్తుండగానే ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోవడం మొదలయ్యింది. ఈ సమస్యను డీలర్‌ కు చెప్పాడు. ఇమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. దీంతో ఆయన సుమారు 10 సార్లకు పైగా సర్వీస్ సెంటర్‌ కు వెళ్లాడు.

Advertisement

ఈ సమయంలో బైక్‌ లోని  పలు పార్టులను మార్చారు. థ్రాటిల్ బాడీ, క్లచ్ ప్లేట్లు, క్లచ్ స్విచ్, ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇంజెక్టర్, వైరింగ్ కిట్, ఎయిర్ ఫిల్టర్ లాంటి కీలక భాగాలను కొత్తవి అమర్చారు. థ్రాటిల్ బాడీని రెండుసార్లు మార్చినట్లు రికార్డులు చూపించాయి. హీరో మోటోకార్ప్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధికారులు కూడా బైక్‌ ను పరిశీలించారు. అయినా ఇంజిన్ ఆగిపోవడం కొనసాగింది. దీంతో గణేష్ జాతీయ వినియోగదారుల పోర్టల్‌ లో కూడా ఫిర్యాదు చేశారు. సమస్యకు సంబంధించిన వీడియో ఆధారాలను సైతం సమర్పించారు. అయినప్పటికీ, సరైన పరిష్కారం లభించకపోవడంతో చివరకు వినియోగదారుల కమిషన్‌ ను ఆశ్రయించారు.

హీరో కంపెనీ ఏం చెప్పిందంటే?

మరోవైపు హీరో మోటోకార్ప్, డీలర్లు ఆరోపణలను ఖండించారు. తమ అధికారులు నిర్వహించిన టెస్ట్ డ్రైవ్‌లో ఎలాంటి సమస్య కనిపించలేదని వాదించారు. వారంటీ నిబంధనల ప్రకారం వాహనాన్ని మార్చడం, డబ్బు తిరిగి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. అయితే కమిషన్ ఈ వాదనలను అంగీకరించలేదు. ప్రతివాదులే సమర్పించిన అఫిడవిట్‌ లో టెస్ట్ రైడ్ సమయంలో వాహనం రెండుసార్లు ఆగిపోయిందని పేర్కొన్న విషయాన్ని కమిషన్ గుర్తించింది. ఇది, వాహనంలో లోపం ఉన్నట్లు స్పష్టంగా తెలియజేస్తుందని వెల్లడించింది. చాలా సార్లు సర్వీస్ చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని కమిషన్ పేర్కొంది. పదేపదే భాగాలు మార్చడం కూడా వాహనంలో లోపం ఉన్నట్లు సూచిస్తుందని చెప్పింది. వినియోగదారుడు కొనుగోలు చేసిన వాహనం సురక్షితంగా ఉండాల్సిన బాధ్యత తయారీదారుడిదేనని స్పష్టం చేసింది.

Advertisement

ఈ నేపథ్యంలో బైక్‌ ను తిరిగి అప్పగించిన తర్వాత కొనుగోలు ధర నుంచి 10 శాతం తరుగుదల మినహాయించి మిగిలిన రూ.88,000ను ఫిర్యాదుదారుడికి చెల్లించాలని హీరో మోటోకార్ప్, డీలర్‌ ను ఆదేశించింది. కేసు ఖర్చుల కింద రూ.2,000 చెల్లించాలని తీర్పు వెల్లడించింది.

Read Also: పెట్రోల్ ఖర్చుకు చెక్.. మారుతి నుంచి 3 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×