E-Paper
Advertisement

Hero Feb Sales: నెల రోజుల్లో 5.58 లక్షల బైక్స్ సేల్.. అదరగొట్టిన హీరో మోటోకార్ప్!

Hero  Feb Sales: నెల రోజుల్లో 5.58 లక్షల బైక్స్ సేల్.. అదరగొట్టిన హీరో మోటోకార్ప్!
Advertisement

Hero Motocorp Sales Feb 2026: టూవీలర్ తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఫిబ్రవరి 2026లో  అమ్మకాల్లో సత్తా చాటింది. ఒకే నెలలో ఏకంగా 558,216 యూనిట్లను సేల్ చేసింది. గత ఏడాదితో పోల్చితే 44 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. గత సంవత్సరం ఇదే నెలలో  కంపెనీ 388,068 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరి 2026లో హీరో 458,346 రిజిస్ట్రేషన్లతో 18 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. విడా EV సబ్ బ్రాండ్ మార్కెట్ వాటాలో మూడు రెట్లు పెరిగింది. ఫిబ్రవరి 2026లో వాహన్ పోర్టల్‌ లో ఈ స్కూటర్ కోసం ఏకంగా 12,514 రిజిస్ట్రేషన్లను పొందింది.

స్కూటర్ విభాగంలో అమ్మకాల జోరు

స్కూటర్ విభాగంలో హీరో బలమైన దూకుడును కొనసాగించింది. 100cc–125cc విభాగంలో స్థిరమైన డిమాండ్ ను కలిగి ఉంది. VIDA నిరంతర స్కేల్ అప్,  ప్రపంచ మార్కెట్లలో రెండంకెల విస్తరణ ద్వారా 44 శాతం వార్షిక వృద్ధితో ఆకట్టకుంటుంది.  ఎగుమతి వ్యాపారం కూడా 34 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో 30,772 యూనిట్లతో పోలిస్తే,  ఫిబ్రవరి 2026లో 41,248 మేడ్ ఇన్ ఇండియా బైక్‌లు, స్కూటర్లు ఎగుమతి అయ్యాయి.

భారీగా పెరిగిన దేశీయ అమ్మకాలు

Advertisement

అటు ఫిబ్రవరి 2025లో దేశీయ అమ్మకాలు 357,296 యూనిట్లతో పోలిస్తే..  ఫిబ్రవరి 2026లో 516,968 యూనిట్లకు పెరిగింది. హీరో గత నెలలో 499,756 మోటార్ సైకిళ్లను విక్రయించగా.. ఫిబ్రవరి 2025లో ఇవి 352,312 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్ల విషయానికొస్తే. ఫిబ్రవరి 2026లో 58,460 యూనిట్లుగా ఉండగా, గత సంవత్సరం ఇదే కాలంలో 35,756 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్పష్టంగా, బైక్, స్కూటర్ అమ్మకాలు రెండూ ఫిబ్రవరి 2026లో పెరిగాయి.

Read Also: 2026లో 8 కొత్త బైక్స్ లాంచ్.. బజాజ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఏ టూవీలర్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయంటే?

Advertisement

ఫిబ్రవరి 2026లో హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్, ప్యాషన్  బైక్‌లు, డెస్టినీ, జూమ్ స్కూటర్లు, అలాగే విడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. 100cc-125cc కమ్యూటర్ బైక్‌ల విభాగం అమ్మకాల్లో కీలక పాత్ర పోషించింది.

Read Also:  2026-27లో ఏకంగా 8 కొత్త మోడల్స్, రాయల్ ఎన్‌ ఫీల్డ్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×