E-Paper
Advertisement

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?
Advertisement

Hero  Affordable Flex-Fuel Bikes: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. దేశంలో ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులను తీసుకొచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందిన రెండు కమ్యూటర్ బైకులైన స్ప్లెండర్+, హెచ్‌ఎఫ్ డీలక్స్ మోడళ్లను ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లలో మార్కెట్‌ లోకి తీసుకొచ్చింది. ఈ బైక్‌లు పెట్రోల్‌ తో పాటు ఇథనాల్ మిశ్రమంతో కూడా నడిచేలా రూపొందించింది.

ధరలు ఎలా ఉన్నాయంటే?

కంపెనీ కొత్త మోడల్స్ ధరలను కూడా అందుబాటులోనే ఉంచింది. హీరో స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ధర రూ. 82,710గా నిర్ణయించింది. హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ధర రూ. 72,792గా ఫిక్స్ చేసింది. ఈ రెండు బైక్‌ లు జూలై 2026 నుంచి అమ్మకాలు మొదలు పెట్టనుంది. తొలుత ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నాయి. అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు.

ఏంటీ బైకుల ప్రత్యేకత?

Advertisement

ఈ బైక్‌ లు E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పని చేస్తాయి. సాధారణంగా ప్రస్తుతం చాలా వాహనాలు E20 వరకు మాత్రమే సపోర్టు చేస్తున్నాయి. హీరో తీసుకొచ్చిన ఈ కొత్త మోడళ్లు అధిక ఇథనాల్ శాతాన్ని తట్టుకుని నడుస్తాయి. స్ప్లెండర్+, హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ లలో హీరోకు సంబంధించిన పాపులర్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను ఉపయోగించారు. అయితే, ఇథనాల్ మిశ్రమాలతో పని చేసేలా ఇంజిన్‌ లో కొన్ని మార్పులు చేశారు. E85 ఇంధనంతో ఈ ఇంజిన్ 8.6 హెచ్‌పీ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్ లో కీలక మార్పులు

అధిక ఇథనాల్ మిశ్రమాల వినియోగానికి అనుగుణంగా హీరో కొత్త ఫ్యూయల్ పంప్, సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్ లాంటి అప్‌ గ్రేడ్ చేసిన ఫ్యూయల్ సిస్టమ్ భాగాలను అమర్చింది. అలాగే ECU కాలిబ్రేషన్‌ ను కూడా సవరించింది. దీంతో పలు రకాల ఇథనాల్ మిశ్రమాలతో బైక్ పనితీరు మెరుగ్గా ఉండేలా చూసింది.

సాధారణ బైకుల ధరలతోనే…

Advertisement

ధరల విషయానికి వస్తే, హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ ధర సాధారణ E20 మోడల్ కంటే కేవలం రూ. 172 మాత్రమే ఎక్కువ. మరోవైపు స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ధర స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే రూ. 5,153 ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడంలో కీలక అడుగుగా భావిస్తున్నారు.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఫీచర్ల పరంగా చూస్తే, రెండు బైక్‌ లలోనూ డిజి అనలాగ్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, ట్యూబ్‌ లెస్ టైర్లు అందుబాటులో ఉన్నాయి. స్ప్లెండర్+ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ లో అదనంగా హీరోకు చెందిన i3S స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ట్రాఫిక్‌ లో బైక్ ఆగినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌ గా ఆఫ్ అయి, క్లచ్ నొక్కగానే మళ్లీ స్టార్ట్ అవుతుంది. దీంతో ఇంధన ఆదా సాధ్యమవుతుంది.

Read Also: పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×