E-Paper
Advertisement

మండుటెండలో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

మండుటెండలో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
Advertisement

Heatwave Driving Tips: దేశ వ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. బయట ఎక్కువ సేపు ఉండకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో డ్రైవింగ్ చేయకపోవడం కూడా మంచిదంటున్నారు. ఎక్కువ వేడి కారణంగా కార్లలో పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే, డ్రైవర్ ఆరోగ్యంపైనా ప్రభావం  పడనుంది. అందుకే వేసవిలో, ముఖ్యంగా వేడిగాలులు వీచే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అలసట, డీహైడ్రేషన్, తలనొప్పి

తీవ్రమైన ఎండల సమయంలో కారు లోపల ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది. కొద్ది నిమిషాల్లోనే క్యాబిన్ భరించలేని స్థాయికి చేరుతుంది. దీంతో డ్రైవర్ అలసట, డీహైడ్రేషన్, తలనొప్పి లాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంజిన్, టైర్లు, ఏసీ వంటి భాగాలపై కూడా అధిక ఒత్తిడి పడుతుంది.

నీడలో పార్క్ చేయాలి!

Advertisement

కారును పార్క్ చేసే విషయంలో జాగ్రత్త అవసరం. సాధ్యమైనంత వరకు చెట్ల నీడలో పార్క్ చేయాలి. లేదంటే కవర్ ఉన్న పార్కింగ్‌ లో వాహనాన్ని నిలపడం మంచిది. ఎండలో కారును ఉంచితే లోపల ఉష్ణోగ్రత భారీగా పెరుగుతుంది. విండ్‌ షీల్డ్ సన్‌ షేడ్ వాడటం వల్ల కూడా లోపలి వేడి కొంత వరకు తగ్గుతుంది.

విండోలు ఓపెన్ చేయాలి!

కారులోకి ఎక్కిన వెంటనే ఏసీ ఆన్ చేయకుండా ముందు కిటికీలు కొద్దిసేపు తెరవడం మంచిది. లోపల ఉన్న వేడి గాలి బయటకు వెళ్లిపోతుంది. తర్వాత ఏసీ ఆన్ చేస్తే కారు త్వరగా చల్లబడుతుంది. ఏసీని నెమ్మదిగా కూలింగ్ పెంచడం మంచిది.
ఇంజిన్ టెంపరేచర్ పెరిగితే కారు ఆపాలి!

Advertisement

వేసవిలో ఇంజిన్ వేడెక్కే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే కూలెంట్ స్థాయిలు సరిగా ఉన్నాయో? లేదో? ముందుగానే చెక్ చేసుకోవాలి. డ్రైవింగ్ సమయంలో టెంపరేచర్ గేజ్ పెరిగితే వెంటనే కారును ఆపి కొంతసేపు ఇంజిన్ చల్లబడే వరకు వేచి ఉండాలి.

టైర్ల విషయంలో జాగ్రత్త

టైర్ల విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఎక్కువ వేడి కారణంగా టైర్లలోని గాలి విస్తరిస్తుంది. దీంతో టైర్ ప్రెజర్ పెరిగి పగిలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైవేపై ప్రయాణించే ముందు టైర్ ప్రెజర్ తప్పనిసరిగా చెక్ చేయాలి.

తాగునీరు తీసుకెళ్లాలి!

డ్రైవింగ్ సమయంలో కారులో తాగు నీరు తీసుకెళ్లాలి. ట్రాఫిక్‌లో ఎక్కువసేపు ఉండాల్సి వచ్చినా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలను, పెంపుడు జంతువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్క్ చేసిన కారులో ఒంటరిగా వదిలిపెట్టకూడదు. కొన్ని నిమిషాల్లోనే కారు లోపల ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి చేరుతుంది.

ఎండ లేని సమయాల్లో ప్రయాణం

సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తే తెల్లవారుజాము,  సాయంత్రం సమయాల్లో బయలుదేరడం మంచిది. మధ్యాహ్నం వేళల్లో ప్రయాణించడం వల్ల డ్రైవర్‌కు అలసట ఎక్కువగా ఉంటుంది. అదనంగా రోడ్ల నుంచి వచ్చే వేడి కూడా ఇబ్బంది పెడుతుంది. కారు లోపలి భాగాలను కూడా వేడెక్కుతాయి. లెదర్ సీట్లు, స్టీరింగ్ వీల్, టచ్‌ స్క్రీన్లు ఎక్కువ వేడెక్కుతాయి. సీట్ కవర్లు, స్టీరింగ్ కవర్లు వాడటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.

డ్రైవింగ్ సమయంలో ఏదైనా అసాధారణ వాసన, వార్నింగ్ లైట్లు, పనితీరులో మార్పులు కనిపిస్తే వాటిని కారు ఆపడం మంచింది. చిన్న సమస్య కూడా వేడిలో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే వేసవి కాలంలో కారు ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Read Also: టాటా To మారుతి.. భారత మార్కెట్ లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×