E-Paper
Advertisement

భారత్‌ లో గ్రీన్ SM ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీసులు షురూ.. ఓలా, ఉబర్‌ కు ఇక చుక్కలే!

భారత్‌ లో గ్రీన్ SM ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీసులు షురూ.. ఓలా, ఉబర్‌ కు ఇక చుక్కలే!
Advertisement

Green SM Electric Cab Service Launch: భారతీయ క్యాబ్ సేవల రంగంలో మరో కొత్త సంస్థ అడుగుపెట్టింది. వియత్నాంకు చెందిన ప్రముఖ సంస్థ విన్‌ గ్రూప్ నిర్వహిస్తున్న పూర్తి ఎలక్ట్రిక్ ట్యాక్సీ సర్వీస్ గ్రీన్ SM అధికారికంగా ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఈ సంస్థ, ఇవాళ్టి నుంచి ప్రయాణికులకు సేవలు అందిస్తోంది.

ఓలా, ఉబర్ కు గట్టి పోటీ తప్పదా?

ప్రస్తుతం దేశంలో క్యాబ్ సర్వీసుల రంగంలో ఓలా, ఉబర్ లాంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, గ్రీన్ SM వాటికి భిన్నమైన వ్యాపార విధానంతో మార్కెట్‌ లోకి వచ్చింది. సాధారణంగా ఓలా, ఉబర్ లాంటి సంస్థలు డ్రైవర్ల సొంత వాహనాలను తమ ప్లాట్‌ ఫారమ్‌ కు అనుసంధానం చేసి సర్వీసులు అందిస్తాయి. కానీ, గ్రీన్ SM మాత్రం సొంత ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల వాహనాల మెయింటెనెన్స్, డ్రైవర్ల శిక్షణ, సర్వీసులలో క్వాలిటీ, కస్టమర్ ఎక్స్ పీరియెన్స్ పై కంపెనీకి పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రయాణికులకు ఒకే రకమైన నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోంది.

క్యాస్ సర్వీసుల కోసం విన్‌ గ్రూప్‌ ఈవీ కార్లు

Advertisement

గ్రీన్ SM ప్రారంభ దశలో విన్‌ గ్రూప్‌ కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనుంది. భారత మార్కెట్లో మొదటిగా  లిమో గ్రీన్ MPV మోడల్‌ ను ప్రవేశపెడుతోంది. ఈ వాహనాలు ప్రత్యేకంగా క్యాబ్ సేవల కోసం రూపొందించబడ్డాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి క్యాబ్‌ లో త్రాగునీరు, వెట్ టిష్యూలు లాంటి అదనపు సదుపాయాలను కూడా అందిస్తున్నారు.

ఏకంగా 10 వేల ఈవీలతో క్యాబ్ సర్వీసులు

కంపెనీ.. తొలి దశలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో సుమారు 1,000 ఎలక్ట్రిక్ కార్లను రోడ్లపైకి తీసుకురానుంది. భవిష్యత్తులో ఈ సంఖ్యను భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌సిఆర్ ప్రాంతంలోనే దాదాపు 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో ఉంచే ప్రణాళికను సంస్థ రూపొందించినట్లు తెలుస్తోంది.

వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఆఫర్లు

Advertisement

కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు గ్రీన్ SM ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. జూన్ 5 నుంచి జూన్ 11 వరకు యాప్ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణాలపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే, ఈ రాయితీ గరిష్టంగా రూ.250 వరకు లభిస్తుంది.

గ్రీన్ SM ఇప్పటికే వియత్నాం, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో సేవలు అందిస్తోంది. ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించడం ద్వారా తన అంతర్జాతీయ విస్తరణను మరింత వేగవంతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీకి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని సంస్థ భారత్‌ను కీలక మార్కెట్‌గా భావిస్తోంది.

Read Also: కొత్త కారు కంటే పాత SUVలకే ఎక్కువ క్రేజ్.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×