E-Paper
Advertisement

గూగుల్ మ్యాప్స్‌ లో త్రీడీ నావిగేషన్.. ఇక దారి తప్పే ఛాన్స్ లేదు!

గూగుల్ మ్యాప్స్‌ లో  త్రీడీ నావిగేషన్.. ఇక దారి తప్పే ఛాన్స్ లేదు!
Advertisement

Google Maps Immersive Navigation: ఆండ్రాయిడ్ ఆటో యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. గూగుల్ మ్యాప్స్‌ లో కొత్త ఇమ్మర్సివ్ నావిగేషన్ ఇంటర్‌ ఫేస్‌ ను దశలవారీగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది వినియోగదారులకు మాత్రమే కనిపిస్తోంది. అయితే, ఇది యాప్ అప్‌ డేట్ వల్ల కాకుండా, గూగుల్ సర్వర్ సైడ్ రోల్‌ అవుట్‌ లో భాగంగా వస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల అందరికీ ఈ ఫీచర్ చేరడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ఏంటీ కొత్త అప్ డేట్ ప్రత్యేకత?

కొత్త నావిగేషన్ ఇంటర్‌ ఫేస్‌ లో రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఆఫ్ ర్యాంప్‌ లు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే త్రీడీలో బిల్డింగ్స్,   చెట్లు లాంటి విజువల్ ఎలిమెంట్లు కూడా మ్యాప్‌ లో కనిపించడం వల్ల డ్రైవింగ్ సమయంలో దారి గుర్తించడం మరింత ఈజీ అవుతుంది. ముఖ్యంగా తెలియని ప్రాంతాల్లో ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉండనుంది. ఈ కొత్త ఫీచర్ గురించి మొదట ఓ రెడిట్‌ యూజర్ కీలక విషయాలు వెల్లడించాడు. ఆయన ఆండ్రాయిడ్ ఆటోలో కనిపిస్తున్న కొత్త గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌ షాట్లను షేర్ చేశారు. వాటిలో కొత్త త్రీడీ నావిగేషన్ డిజైన్ స్పష్టంగా కనిపించింది. ఫ్లైఓవర్లు, భవనాలు, రోడ్డుకు పక్కనున్న చెట్లు కూడా మరింత సహజంగా కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఆండ్రాయిడ్ ఆటో v17.3 వెర్షన్‌ కు అప్‌ డేట్ చేసిన తర్వాత ఈ కొత్త ఇంటర్‌ ఫేస్ కనిపించిందని తెలిపారు.

Advertisement

అటు ఇదే సమయంలో మరో వినియోగదారు ఆండ్రాయిడ్ ఆటో, గూగుల్ మ్యాప్స్ రెండింటి తాజా బీటా వెర్షన్లను ఉపయోగిస్తున్నప్పటికీ కొత్త UI కనిపించలేదని చెప్పారు. సో, ఈ ఫీచర్ కేవలం యాప్ వెర్షన్‌ పై ఆధారపడి లేదని స్పష్టమవుతోంది. గూగుల్ తన సర్వర్ ద్వారా దశలవారీగా ఈ ఫీచర్‌ ను యాక్టివేట్ చేస్తున్నట్లు టెక్ నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల మీ ఫోన్‌ లో తాజా వెర్షన్ ఉన్నా కూడా వెంటనే ఈ ఫీచర్ కనిపించే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఆపిల్ కార్ ప్లే వినియోగదారులకు అందుబాటులోకి!

కొత్త ఇమ్మర్సివ్ నావిగేషన్ కోసం ఆండ్రాయిడ్ వినియోగదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఈ డిజైన్‌ను గూగుల్ ప్రకటించినప్పటికీ, ముందుగా ఆపిల్ కార్ ప్లే వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో కూ ఈ అప్‌ డేట్ రావడం మంచి పరిణామంగా భావిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం ఈ ఇమ్మర్సివ్ నావిగేషన్ ఫీచర్ అమెరికాలోని కొన్ని కార్లలో అందుబాటులో ఉంది. అయితే, ఇతర దేశాలకు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై గూగుల్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్‌ తో పాటు ఇతర దేశాల వినియోగదారులు ఈ ఫీచర్ కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

Read Also: లైట్ వెయిట్.. హై సేఫ్టీ.. క్రేజీ ఇగ్నైట్ కార్బన్ హెల్మెట్లు వచ్చేశాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×