E-Paper
Advertisement

వీల్స్ లోనే ఫ్యూయల్ స్టోరేజ్.. అదిరిపోయే హైడ్రోజన్ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన జర్మన్ ఇంజనీర్లు!

వీల్స్ లోనే ఫ్యూయల్ స్టోరేజ్.. అదిరిపోయే హైడ్రోజన్ ట్రాక్టర్ ను ఆవిష్కరించిన జర్మన్ ఇంజనీర్లు!
Advertisement

German Hydrogen Tractor Innovation: జర్మనీ ఇంజనీర్లు వ్యవసాయ రంగానికి ఉపయోగపడే సరికొత్త హైడ్రోజన్ ట్రాక్టర్ ను రూపొందించారు. ట్రాక్టర్ చక్రాల లోపల ఉండే ఖాళీ ప్రదేశాన్ని హైడ్రోజన్ నిల్వ కోసం ఉపయోగిస్తున్నారు. సాధారణంగా చక్రాలు వాహనాన్ని మోయడం, తిరగడం మాత్రమే చేస్తాయి. కానీ, ఇప్పుడు అవే వీల్స్ ఫ్యూయెల్ ట్యాంకుల్లా పనిచేసేలా డిజైన్ చేశారు. దీని వల్ల భారీ బ్యాటరీలు లేకుండా ట్రాక్టర్ ఎక్కువసేపు పనిచేసే అవకాశం ఉంటుంది.

ఒకసారి ఫ్యూయెల్ నింపితే రోజంతా పని చేసేలా..

ఈ ప్రాజెక్టు ను జర్మనీలోని హోర్మాన్ వెహికల్ ఇంజనీరింగ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. డీజిల్ ట్రాక్టర్లలా ఒకసారి ఇంధనం నింపితే రోజంతా పని చేసే హైడ్రోజన్ ట్రాక్టర్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ వాహనాల్లో ప్రధాన సమస్య ఇంధన నిల్వ. డీజిల్‌ తో పోలిస్తే హైడ్రోజన్ తక్కువ స్థలంలో తక్కువ శక్తిని మాత్రమే నిల్వ చేయగలదు. అందుకే పెద్ద పరిమాణంలో ట్యాంకులు అవసరం అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని హైడ్రోజన్ ట్రాక్టర్ నమూనాలు పరీక్షల్లో ఉన్నాయి.  ఫెండ్ట్ హీలియోస్ ట్రాక్టర్‌ లో పైకప్పుపై ఐదు హైడ్రోజన్ ట్యాంకులు ఉంటాయి. ఇవి సుమారు 21 కిలోల హైడ్రోజన్‌ను నిల్వ చేస్తాయి. దీంతో ట్రాక్టర్ ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు పని చేస్తుంది. అయితే, ఇది డీజిల్ ట్రాక్టర్ల సామర్థ్యానికి ఇంకా సరిపోవడం లేదు.

ట్రాక్టర్ చక్రాల్లో హైడ్రోజన్ ట్యాంకులు

Advertisement

ఈ సమస్యకు పరిష్కారంగా జర్మన్ ఇంజనీర్లు ట్రాక్టర్ భారీ చక్రాల లోపలి ఖాళీని ఉపయోగించాలని నిర్ణయించారు. చక్రాల లోపల కార్బన్ ఫైబర్‌ తో తయారు చేసిన ప్రత్యేక హై ప్రెజర్ ట్యాంకులను అమర్చే విధంగా డిజైన్ చేస్తున్నారు. దీని వల్ల వాహనం పైభాగంలో అదనపు ట్యాంకులు అవసరం ఉండదు. అలాగే ట్రాక్టర్ పని చేసే భాగాలపై కూడా ప్రభావం తగ్గుతుంది. ఈ వీల్స్ ట్యాంకులను ప్రత్యేక ఎలక్ట్రిక్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ తో కలిపి రూపొందిస్తున్నారు. అంటే, ఒకే యూనిట్‌ లో ప్యూయెల్ స్టోరేజ్, పవర్ సిస్టమ్ రెండూ పని చేస్తాయి.

ఈ టెక్నాలజీని ట్రాక్టర్లకే కాకుండా భారీ ట్రక్కులు, నిర్మాణ యంత్రాలు, ఇతర భారీ వాహనాల్లో కూడా ఉపయోగించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో హైడ్రోజన్ ఆధారిత భారీ వాహనాల అభివృద్ధికి ఈ విధానం ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా జర్మనీలో H2Agrar అనే ప్రాజెక్ట్ కొనసాగుతోంది. ఇందులో గాలి, విద్యుత్ సాయంతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నారు. రోజుకు సుమారు 900 కిలోల హైడ్రోజన్ తయారుచేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ హైడ్రోజన్‌ ను ప్రత్యేక స్టేషన్ల ద్వారా ట్రాక్టర్లకు నింపుతున్నారు.

Advertisement

వ్యవసాయ వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ టెక్నాలజీ పూర్తిగా విజయవంతం కావాలంటే, డీజిల్ ట్రాక్టర్ల మాదిరిగానే ఎక్కువ సేపు పని చేసే సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం ఈ వీల్ ట్యాంక్ సిస్టమ్‌ పై మరిన్ని పరీక్షలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఇది వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులకు దారితీస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.

Read Also: డాష్‌ బోర్డ్‌ లో ఈ లైట్లు వెలుగుతున్నాయా? అలర్ట్ కాకపోతే అంతేసంగతులు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×