E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ To హైబ్రిడ్.. హోండా నుంచి ఏకంగా 8 క్రేజీ కార్లు వచ్చేస్తున్నాయ్!

ఎలక్ట్రిక్ To హైబ్రిడ్.. హోండా నుంచి ఏకంగా 8 క్రేజీ కార్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Honda to Launch 8 New Vehicles in India: గత కొంత కాలంగా అమ్మకాలు కాస్త తగ్గినప్పటికీ, హోండా మళ్లీ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. వరుసగా అత్యాధునికి కార్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. కంపెనీ తన VTEC ఇంజిన్ ను అలాగే కొనసాగిస్తూనే, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతోంది. రాబోయే 3 సంవత్సరాల్లో పలు కొత్త కార్లు, SUVలను భారత మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇంతకీ ఆ కార్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హోండా సిటీ ఫేస్‌ లిఫ్ట్, ZR-V హైబ్రిడ్

ముందుగా హోండా హోండా సిటీ ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో డిజైన్, ఇంటీరియర్‌ లో చిన్న మార్పులతో పాటు కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. అదే సమయంలో హోండా ZR-V హైబ్రిడ్ SUVను కూడా విడుదల చేయనుంది. ఇది పూర్తిగా ఇంపోర్టెడ్ మోడల్ గా రానుంది. 2.0 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు మంచి మైలేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

⦿ హోండా ప్రిల్యూడ్

Advertisement

స్పోర్టీ లుక్‌ తో హోండా ప్రిల్యూడ్ కూడా భారత మార్కెట్లోకి రానుంది. ఇది టూ డోర్ కూపే కారు. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపిన హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. పవర్, పనితీరు పరంగా ఆకట్టుకునేలా ఉంటుంది.

⦿ హోండా 0 సిరీస్ SUV  

ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ లో కూడా హోండా కీలక ముందడుగు వేయనుంది. హోండా 0 సిరీస్ SUV ఆధారంగా ఒక కొత్త ఎలక్ట్రిక్ SUVని తయారు చేస్తోంది. ఇది భారత్‌ లోనే తయారు చేయబడే అవకాశం ఉంది. ఈ కారు ఆధునిక టెక్నాలజీ, కనెక్టెడ్ ఫీచర్లతో రానుంది.

⦿ కొత్త అప్ డేట్ తో హోండా ఎలివేట్

Advertisement

ప్రస్తుతం ఉన్నహోండా ఎలివేట్ SUVకి కూడా క్రేజీ అప్‌ డేట్ ఇవ్వనున్నారు. ఇందులో డిజైన్, ఫీచర్లలో మార్పులతో పాటు హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికను కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. దీంతో మైలేజీ, పనితీరు మరింత మెరుగవుతాయి.

⦿ 7 సీటర్ SUV

అటు హోండా కొత్తగా 7 సీటర్ SUVని కూడా తయారు చేస్తుంది. ఇది కుటుంబ ప్రయాణాలకు అనువుగా ఉండేలా రూపొందించబడుతుంది. ఈ SUVలో హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఈ సెగ్మెంట్‌ లో పోటీ ఎక్కువగా ఉండటంతో, హోండా దీన్ని బలంగా తీసుకురావాలని చూస్తోంది.

⦿ నెక్ట్స్ జెనరేషన్ హోండా సిటీ

అటు నెక్ట్స్ జెనరేషన్ హోండా సిటీ కారు కూడా రానుంది. ఇది పూర్తిగా కొత్త డిజైన్, టెక్నాలజీతో రూపొందించబడుతుంది. అదే సమయంలో కొత్త కాంపాక్ట్ SUVను కూడా అభివృద్ధి చేస్తోంది. ఈ రెండు మోడళ్లు కొత్త ప్లాట్‌ ఫారమ్‌ పై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.

మొత్తంగా హోండా భారత్‌ లో మళ్లీ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. హైబ్రిడ్, ఎలక్ట్రిక్, SUV సెగ్మెంట్లలో కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Also: టైర్ పగిలినా నో టెన్షన్.. ఈ కారు మూడు చక్రాలతో పరుగులు తీస్తుంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×