E-Paper
Advertisement

టియాగో EV To VF3.. త్వరలో విడుదల కాబోతున్న 7 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

టియాగో EV To VF3.. త్వరలో విడుదల కాబోతున్న 7 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Top 7 Entry Level Electric Cars 2026: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. భారత్ లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువగా ఎలక్ట్రిక్ SUVలు, MPVలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, ఇప్పుడు కంపెనీలు సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో లభించే ఎంట్రీ లెవల్ ఈవీలపై దృష్టి పెడుతున్నాయి. త్వరలో భారత మార్కెట్లోకి రాబోతున్న 7 ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

⦿ టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్  

టాటా మోటార్స్ తమ టియాగో ఈవీకి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన ఈ కారు, కొత్త డిజైన్ మార్పులతో రాబోతోంది. ముందు భాగంలో కొత్త గ్రిల్, అప్‌ డేటెడ్ హెడ్‌ ల్యాంప్స్, కొత్త బంపర్ లాంటి  మార్పులు కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నట్లే 19.2 kWh, 24 kWh బ్యాటరీలు ఉండొచ్చు. అలాగే పెద్ద బ్యాటరీ ఆప్షన్ కూడా రానుంది.

⦿ VF3

Advertisement

వియత్నాం కంపెనీ విన్‌ ఫాస్ట్ కూడా తమ చిన్న ఎలక్ట్రిక్ SUV స్టైల్ కారు VF3ను తీసుకురాబోతోంది. ఇది కాంపాక్ట్ సైజులో ఉంటుంది. నగర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. దీని డిజైన్ ఆకర్షణీయంగా ఉండడంతో పాటు, సుమారు 300 కి.మీ. పైగా రేంజ్ ఇచ్చే బ్యాటరీ ఆప్షన్లు ఉండొచ్చు. ధర కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

⦿ VF5

విన్‌ ఫాస్ట్ బ్రాండ్ నుంచి మరో మోడల్ VF5 కూడా రాబోతోంది. ఇది VF3 కంటే కొంచెం పెద్దది. ఇంకా ఎక్కువ ఫీచర్లు కలిగి ఉంటుంది. రేంజ్ పరంగా పెద్ద తేడా లేకపోయినా, ఫీచర్లలో మాత్రం మరింత ముందుగా ఉంటుంది.

⦿ eC3

Advertisement

సిట్రోయెన్ కూడా తన eC3 కారుకు బేస్ వేరియంట్‌ ను మళ్లీ తీసుకురావాలని చూస్తోంది. ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఇందులో అవసరమైన ఫీచర్లు మాత్రమే ఉండి, అదే బ్యాటరీతో సుమారు 300 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది.

⦿ MG కొత్త ఈవీ

MG కంపెనీ కూడా రూ. 10 లక్షల లోపు ధరలో కొత్త ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. ఇది ప్రస్తుతం ఉన్న కామెట్ EV కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. టియాగో EV, eC3 వంటి కార్లకు పోటీగా ఉంటుంది. ఈ కారు వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

⦿ BYD డాల్ఫిన్

BYD నుంచి డాల్ఫిన్ అనే మోడల్ కూడా విడుదల కాబోతోంది. ఈ ప్రాక్టికల్ హ్యాచ్‌ బ్యాక్ స్టైల్ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో రాబోతున్నది.  300 నుంచి 400 కి.మీ. వరకు రేంజ్ ఇవ్వనుంది.  ఫీచర్ల పరంగా కూడా మంచి స్థాయిలో ఉంటుంది.

⦿ హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ EV

హ్యుందాయ్ కొత్త ఎంట్రీ లెవల్ EVపై పని చేస్తోంది. ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ కారు పంచ్ EV వంటి మోడళ్లకు పోటీగా ఉండే అవకాశం ఉంది. ఇందులో ఆధునిక ఫీచర్లు, మంచి రేంజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

Read Also: చిన్న మార్పులతో పెద్ద అప్‌డేట్.. కొత్త టయోటా యారిస్ క్రాస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×