E-Paper
Advertisement

సియెర్రా To అవిన్యా.. టాటా రాబోతున్న 5 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

సియెర్రా To అవిన్యా.. టాటా రాబోతున్న 5 క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Tata’s Future EV Strategy: దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే టాప్ ప్లేస్ లో ఉన్న టాటా మోటార్స్ తన ఈవీ పోర్ట్‌ ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు రెడీ అవుతోంది.  ప్రస్తుతం కంపెనీ టియాగో.ev, పంచ్.ev, నెక్సాన్.ev, కర్వ్.ev, హారియర్.ev లాంటి మోడళ్లను విక్రయిస్తోంది. త్వరలో మరో ఐదు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

1.టాటా సియెర్రా.ఈవీ

ప్రస్తుతం భారతీయ వినియోగదారులు తక్కువ ఖర్చుతో నడిచే ఈవీలనే కాకుండా, ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, అధునాతన టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు కలిగిన కార్లను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాటా కొత్త మోడళ్లపై దృష్టి పెట్టింది. వాటిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ టాటా సియెర్రా.ఈవీ. ఒకప్పుడు భారతీయ మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన సియెర్రాను ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి తీసుకురానుంది. ఈ కారు ఆధునిక డిజైన్, ప్రీమియం ఫీచర్లు, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. టాప్ వేరియంట్లలో 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే అవకాశం ఉందని అంచనా.

2.టాటా టిగోర్.ఈవీ

Advertisement

టాటా టిగోర్.ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా త్వరలో రానుంది. కొత్త డిజైన్, మెరుగైన ఇంటీరియర్, పెద్ద టచ్‌ స్క్రీన్, కనెక్టెడ్ ఫీచర్లతో ఈ సెడాన్‌ను అప్‌ డేట్ చేయనున్నారు. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును కోరుకునే వినియోగదారులను ఈ మోడల్  అనుకూలంగా ఉంటుంది.

3.టాటా సఫారీ.ఈవీ

త్వరలో విడుదల కాబోయే మరో కీలక మోడల్ టాటా సఫారీ.ఈవీ. మూడు వరుసల సీటింగ్‌తో వచ్చే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉండనుంది. పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్, అధునాతన భద్రతా ఫీచర్లతో ప్రీమియం సెగ్మెంట్‌ లో పోటీకి సిద్ధమవుతోంది.

4.అవిన్యా

Advertisement

టాటా అవిన్యా కూడా కంపెనీకి ఎంతో కీలకమైన ప్రాజెక్ట్. ఇది పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ ఫారమ్‌ పై రూపొందించబడుతోంది. భవిష్యత్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, వేగవంతమైన ఛార్జింగ్, స్మార్ట్ టెక్నాలజీతో ఈ మోడల్ కంపెనీని లగ్జరీ ఈవీ మార్కెట్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

5.మూడు వరుసల ఎలక్ట్రిక్ MPV

అటు టాటా కొత్త మూడు వరుసల ఎలక్ట్రిక్ MPV, ఫ్యామిలీ వాహనాన్ని కూడా అభివృద్ధి చేస్తోంది. పెద్ద కుటుంబాలు, క్యాబ్ సేవలు, కమర్షియల్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాన్ని తీసుకురానుంది.

మహీంద్రా, ఎంజీ, హ్యుందాయ్, మారుతి సుజుకి లాంటి కంపెనీలు కూడా కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లతో పోటీలోకి వస్తున్న నేపథ్యంలో టాటా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ కొత్త ఈవీలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ ఐదు మోడళ్లు భారతీయ ఈవీ మార్కెట్‌లో టాటా స్థానాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి.

Read Also: భారత్‌ లో నంబర్ వన్ ఈవీగా టాటా పంచ్.. ఈ ఎలక్ట్రిక్ కారు సక్సెస్ వెనుక అసలు రహస్యం ఇదే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×