E-Paper
Advertisement

రోల్స్ రాయిస్, ఫెరారీ, బెంట్లీ.. అనంత్ అంబానీ గ్యారేజ్‌లో కార్ కలెక్షన్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

రోల్స్ రాయిస్, ఫెరారీ, బెంట్లీ.. అనంత్ అంబానీ గ్యారేజ్‌లో కార్ కలెక్షన్ చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
Advertisement

అనంత్ అంబానీకి కార్లపై ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గ్యారేజ్‌ లో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, అరుదైన, విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఫెరారీ, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ మేబాక్, బెంట్లీ లాంటి  పాపులర్ బ్రాండ్లకు చెందిన అనేక లగ్జరీ కార్లు ఆయన కలెక్షన్స్ లో ఉన్నాయి. దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన ప్రైవేట్ కార్ల సేకరణలో ఆయన గ్యారేజ్ ఒకటిగా గుర్తింపు పొందింది.

⦿ రోల్స్-రాయిస్ కల్లినన్

అనంత్ అంబానీ గ్యారేజ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచే వాహనాల్లో రోల్స్ రాయిస్ కల్లినన్ ఒకటి.  మ్యాట్ ఆరెంజ్ కలర్‌ లో ఉన్న కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ మోడల్ ఆయన పెళ్లి వేడుకల సమయంలో ఎక్కువగా పాపులర్ అయ్యింది.  అత్యాధునిక ఇంటీరియర్, అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం ఈ SUV ప్రత్యేకతలు.

Advertisement

అలాగే ఆయన దగ్గర రోల్స్-రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌ హెడ్ కూపే కూడా ఉంది. ఈ కన్వర్టిబుల్ కారు విలువ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. క్లాసిక్ డిజైన్, లగ్జరీ ఫీచర్లతో ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.

⦿ ఫెరారీ పురోసాంగ్యూ SUV

ఫెరారీ కార్ల విషయానికి వస్తే, అనంత్ దగ్గర ఫెరారీ పురోసాంగ్యూ SUV ఉంది. ఎరుపు రంగులో ఉండే ఈ కారు 6.5 లీటర్ V12 ఇంజిన్‌తో వస్తుంది. దీని ధర రూ.10 కోట్లకు పైగానే ఉంటుంది. అంతేకాకుండా ఫెరారీ SF90 స్ట్రాడేల్ కూడా ఆయన కలెక్షన్స్ లో ఉంది. ఈ హైబ్రిడ్ సూపర్‌కార్ 986 bhp వరకు పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

⦿ మెర్సిడెస్ బెంజ్ S680 గార్డ్

Advertisement

భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే కార్లలో మెర్సిడెస్ బెంజ్ S680 గార్డ్ ప్రత్యేక స్థానం సంపాదించింది. బుల్లెట్‌ ప్రూఫ్ రక్షణ వ్యవస్థలతో కూడిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన లగ్జరీ కార్లలో ఒకటిగా భావిస్తారు. దీని విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంటుంది.

మెర్సిడెస్ మేబాక్ SL 680 రోడ్‌స్టర్ కూడా అనంత్ గ్యారేజ్‌ లో ఉన్న అత్యంత అరుదైన కార్లలో ఒకటి. దేశంలో కేవలం మూడు యూనిట్లు మాత్రమే కేటాయించగా, వాటిలో రెండు అంబానీ కుటుంబం కొనుగోలు చేసినట్లు సమాచారం. 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో ఈ కారు 585 bhp శక్తిని అందిస్తుంది.

⦿ కాంటినెంటల్ GTC స్పీడ్, బెంటాయ్గా EWB

బెంట్లీ కార్లలో కాంటినెంటల్ GTC స్పీడ్, బెంటాయ్గా EWB మోడళ్లు ఉన్నాయి. కాంటినెంటల్ GTC స్పీడ్‌ ను అనంత్, రాధికకు పెళ్లి కానుకగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు బెంటాయ్గా EWB ప్రత్యేక ఆకుపచ్చ రంగులో ఉండి పెళ్లి కాన్వాయ్‌ లో కనిపించింది.

⦿ BMW i8

ఇవే కాకుండా BMW i8 కూడా ఆయన గ్యారేజీలో ఉంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, హైబ్రిడ్ టెక్నాలజీ, బటర్‌ ఫ్లై డోర్లతో ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే రేంజ్ రోవర్ వోగ్, లెక్సస్ LM వంటి లగ్జరీ వాహనాలు కూడా గ్యారేజ్‌ లో ఉన్నాయి.

Read Also: ఎలక్ట్రిక్ SUV To ప్రిల్యూడ్ స్పోర్ట్స్ కారు.. హోండా నుంచి రాబోయే 4 క్రేజీ మోడళ్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×