E-Paper
Advertisement

ఫ్లెక్స్ ఫ్యూయల్ vs పెట్రోల్ వాహనాలు.. రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా?

ఫ్లెక్స్ ఫ్యూయల్ vs పెట్రోల్ వాహనాలు.. రెండింటి మధ్య తేడాలేంటో తెలుసా?
Advertisement

Ethanol-Powered Vehicles: దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు ఇథనాల్‌ తో నడిచే కార్లు, బైక్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే ఏంటి? సాధారణ పెట్రోల్ వాహనంతో పోల్చితే తేడాలేంటి? అనే డౌట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు వాహనాల మధ్య తేడా ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 ⦿ ఇంధన విధానం

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్, స్వచ్ఛమైన ఇథనాల్ మిశ్రమంతో నడిచేలా తయారు చేస్తారు. E20, E50, E85, E100 లాంటి ఇంధన మిశ్రమాలను ఉపయోగించుకుని నడుస్తుంది. సాధారణ పెట్రోల్ వాహనాలు మాత్రం పరిమిత స్థాయి ఇథనాల్ మిశ్రమం కలిగిన ఇంధనాన్ని మాత్రమే ఉపయోగించుకుంటాయి.

⦿ ఫ్యూయల్ సిస్టమ్

Advertisement

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో ప్రత్యేకమైన ఫ్యూయల్ సిస్టమ్ ఉంటుంది. ట్యాంకులో ఎంత శాతం పెట్రోల్, ఎంత శాతం ఇథనాల్ ఉందో గుర్తించే సెన్సార్లు ఇందులో అమర్చబడతాయి. ఈ సమాచారం ఆధారంగా వాహనంలోని ఇంజిన్ కంట్రోల్ యూనిట్ ఇంజిన్ పనితీరును ఆటోమేటిక్ గా అడ్జెస్ట్ చేసుకుంటుంది. ఏ మిశ్రమం ఇంధనం ఉపయోగించినా వాహనం సాఫీగా నడుస్తుంది.

⦿ ప్రత్యేకమైన ఇంజిన్ బాగాలు

ఇథనాల్ వల్ల కలిగే తుప్పు ప్రభావాన్ని తట్టుకునేలా ఫ్యూయల్ పైపులు, ఇంజెక్టర్లు, రబ్బర్ సీల్స్ వంటి భాగాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. సాధారణ పెట్రోల్ వాహనాల్లో ఈ ప్రొటెక్షన్ ఉండదు. అందుకే అధిక ఇథనాల్ ఇంధనాన్ని సాధారణ వాహనాల్లో ఉపయోగిస్తే ఇంజిన్ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

⦿ మైలేజ్ తేడాలు

Advertisement

మైలేజ్ విషయంలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఇథనాల్‌ లో పెట్రోల్‌ తో పోలిస్తే శక్తి సాంద్రత తక్కువగా ఉంటుంది. E85, E100 లాంటి అధిక ఇథనాల్ మిశ్రమాలను ఉపయోగించినప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో మైలేజ్ కొంత తగ్గవచ్చు. అయితే, పెట్రోల్‌ తో నడిచే వాహనాలు సాధారణంగా స్థిరమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి.

⦿ పవర్ లో తేడాలు

పవర్ పరంగా చూస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు ఎక్కువ పవర్ ఉంటుంది. ఇథనాల్‌ కు అధిక ఆక్టేన్ రేటింగ్ ఉండటం వల్ల కొన్ని వాహనాలు అధిక ఇథనాల్ మిశ్రమంతో నడిచేటప్పుడు మరింత శక్తి, టార్క్‌ ను ఉత్పత్తి చేస్తాయి. సో, పనితీరు పరంగా కూడా కొన్ని సందర్భాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మెరుగ్గా ఉంటాయి.

⦿  పర్యావరణహిత ప్రయాణం

పర్యావరణ పరిరక్షణలోనూ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇథనాల్‌ను చెరకు, మొక్కజొన్నలాంటి వేస్టేజ్ నుంచి నుంచి తయారు చేస్తారు. ఈ ఇంధన వినియోగంతో కార్బన్ ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుంది. కాలుష్య కారకాలు విడుదల కూడా తగ్గుతుంది. సాధారణ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే పర్యావరణానికి మరింత అనుకూలంగా ఉంటుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు భవిష్యత్ ఇంధన అవసరాలకు అనుగుణంగా ఉండే సాంకేతికతతో తయారు చేస్తున్నారు. ఇంధన ఖర్చులను తగ్గించడం, దిగుమతి చమురుపై ఆధారాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని కాపాడడం లాంటి లక్ష్యాలతో రూపొందిస్తున్న ఈ వాహనాలు భారత ఆటోమొబైల్ రంగంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి.

Read Also: హీరో To హోండా.. ఇండియన్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తున్న ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×