E-Paper
Advertisement

Fact Check: గాల్లోకి ఎగిరి హైవే సైన్ బోర్డులో ఇరుక్కుపోయిన మహీంద్రా థార్, ఇంతకీ అది నిజమేనా?

Fact Check: గాల్లోకి ఎగిరి హైవే సైన్ బోర్డులో ఇరుక్కుపోయిన మహీంద్రా థార్, ఇంతకీ అది నిజమేనా?
Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు ఏది నిజమో? ఏది అబద్దమో చెప్పడం కష్టం అవుతోంది. ఏఐ పుణ్యమా అని పరిస్థితి ఈ స్థాయికి చేరింది. తాజాగా మహీంద్రా థార్ గాల్లోకి ఎగిరిపోయి ఒక పెద్ద హైవే ఎగ్జిట్ సైన్‌ బోర్డ్‌ ను ఢీకొట్టినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌లో, ఢిల్లీ, గురుగ్రామ్, జైపూర్, ఎగ్జిట్ 22, NH-48 అని రాసి ఉన్న ఓవర్ హెడ్ బోర్డు లోపల SUV  ఇరుక్కుపోయినట్లు కనిపిస్తుంది. ఈ విజువల్ చూడ్డానికి షాకింగ్ గా ఉంది. అదే సమయంలో అనుమానం కలిగేలా చేస్తోంది.

ఇంతకీ నిజంగానే థార్ సైన్ బోర్డులో చిక్కుకుపోయిందా?

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు దీనిని నిజమైన ప్రమాదంగా పోస్ట్ చేస్తున్నారు. వీడియోలో, ఫోటోల్లో చూపించినట్లుగా, థార్ చాలా ఎత్తులో సైన్‌ బోర్డ్‌ పై  ఉంది. రోడ్డు మీది నుంచి అత్యంత వేగంగా దూసుకెళ్లి ఆ సైన్ బోర్డులో ఇరుక్కుపోయినట్లు కనిపిస్తుంది. ఈ ఘటన నిజమైనదే అని చెప్పేలా పక్కనే ర్యాంప్ ఉన్న ట్రక్కు కూడా ఉంది. అయితే, ఆ ట్రక్కు AI-జనరేటెడ్ అని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. థార్ చిక్కుకున్న విధానం కూడా అసహజంగా కనిపిస్తుంది. ఒక SUV ఆ ఎత్తుకు వెళ్లడంతో పాటు అక్కడే చిక్కుకోవడం నిజంగా అ సాధ్యం అంటున్నారు.

అదంతా ఏఐ మాయనా?

Advertisement

ఈ ఘటనకు సంబంధించి కొంత మంది నెటిజన్లు అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇది నిజమైన ఘటన కాదని తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఏమాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. ఈ వైరల్ ఫుటేజ్ ఏఐని ఉపయోగించి క్రియేట్ చేసినట్లు చెప్తున్నారు. NH-48లోని ఎగ్జిట్ 22 దగ్గర, మహీంద్రా థార్ హైవే సైన్‌ బోర్డ్‌ ను ఢీకొట్టినట ఘటన ఏది లేదు.

Read Also:  అప్రిలియా RS 457 To కవాసకి నింజా 300.. 5 లక్షల్లోపు బెస్ట్ ఫాస్టెస్ట్ బైక్స్ ఇవే!

ఏఐ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు!

AI జనరేటెడ్ వీడియోలు సర్వసాధారణం అవుతున్నందున, అలాంటి కంటెంట్ ఆన్‌ లైన్‌ లో సులభంగా గందరగోళాన్ని వ్యాపింపజేస్తుంది. ఏదైనా వీడియోను షేర్ చేసే ముందు దాన్ని కన్ఫార్మ్ చేసుకోవాలని చెప్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి ఫ్యాక్ట్ చెక్ లో థార్ ఏ సైన్‌ బోర్డ్‌ ను ఢీకొట్టలేదని తేలింది. వీడియో డిజిటల్‌ గా క్రియేట్ చేసినట్లు వెల్లడయ్యింది. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలను చూసి ప్యానిక్ కాకూడదని నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. నిజానిజాలు ఏంటనేది ముందుగా తెలుసుకోవాలంటున్నారు.

Read Also: టయోటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV, ఇండియాలో అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×