// // Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Electric Vehicles: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Advertisement

ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రోజు వారీ వినియోగానికి సైతం ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. నగరాలతో పాటు పట్టణ ప్రజలకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, మరిన్ని మోడల్ ఆప్షన్స్, మెరుగైన ఛార్జింగ్ యాక్సెస్ EV లకు మంచి ఆదరణ దక్కేలా చేశాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడం మంచిదేనా? డబ్బులు ఆదా చేయడంలో సాయపడుతాయా? ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కొనుగోలు ఖర్చు ఎక్కువ!  

ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్రోల్ మోడళ్ల కంటే ఎక్కవ ధరను కలిగి ఉంటాయి. GST తగ్గింపు, రాష్ట్ర స్థాయి ప్రోత్సాహకాల తర్వాత కూడా, EVల ధర 20 నుంచి 30 శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఇదో పెద్ద అడ్డంకిగా చెప్పుకోవచ్చు. అయితే, బ్యాటరీ ఖర్చులు తగ్గడం, స్థానిక తయారీ మెరుగుపడటం వల్ల కాస్త ధర తగ్గే అవకాశం ఉంటుంది.

ఛార్జింగ్ యాక్సెస్ ఇబ్బందులు

Advertisement

EV మెయింటెనెన్స్ అనేది ఛార్జింగ్ యాక్సెస్‌ మీద ఆధారపడి ఉంటుంది. రోజువారీ ఉపయోగం కోసం హోమ్ ఛార్జింగ్ చౌకగా ఉంటుంది. ప్రధాన నగరాలు, రహదారులలో పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ పెరిగింది. కానీ, లభ్యత ఇప్పటికీ అంత అనుకూలంగా లేదు. ఇంట్లో, కార్యాలయంలో ఛార్జ్ చేసుకునే వాహనాలను కొనుగోలు చేసే వాళ్లు ఎక్కువ పొదుపును పొందే అవకాశం ఉంటుంది.

మెయింటెనెన్స్ ఖర్చులు

EVల నిర్మాణం తక్కువ కదిలే భాగాలతో సరళంగా ఉంటుంది. సాధారణ మెయింటెనెన్స్ అవసరాలు, సర్వీస్ ఖర్చులను తగ్గిస్తుంది. ఇంజిన్ ఆయిల్, క్లచ్ రీప్లేస్‌మెంట్, ఎగ్జాస్ట్ సిస్టమ్‌లకు సంబంధించిన ఖర్చులు ఉండవు. బ్యాటరీ జీవితం తరచుగా ఆందోళన కలిగిస్తుంది. చాలా మంది తయారీదారులు ఇప్పుడు బ్యాటరీకి చాలా కాలం పాటు వారంటీలను అందిస్తున్నారు. సాధారణంగా ఎనిమిది సంవత్సరాల వరకు వారంటీ ఇస్తున్నారు. చాలా మంది యజమానులకు మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గిస్తాయి.

రోజువారీ ఇంధన పొదుపులు  

Advertisement

EVలు రోజువారీ రన్నింగ్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ప్రతి కిలోమీటరుకు పెట్రోల్ కంటే విద్యుత్ చాలా చౌకగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఛార్జింగ్ చేసినప్పుడు మరింత తక్కువ ఖర్చు అవుతుంది. నెలవారీ పొదుపులకు కారణం అవుతుంది.

EVలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి?

ఎలక్ట్రిక్ వాహనాలు తరచుగా నగరాల్లో సాధారణ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. అప్పుడప్పుడు డ్రైవ్ చేసేవారికి,  తరచుగా సుదీర్ఘ ఇంటర్‌ సిటీ ట్రిప్‌లు చేసేవారికి, పెట్రోల్, హైబ్రిడ్ వాహనాలు బాగుంటాయి. వాస్తవ డ్రైవింగ్ అలవాట్లతో సరిపోలినప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు బాగుంటాయి.

2026లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరుగుతున్నాయి. కొనుగోలు సమయంలో ఎక్కువ ఖర్చు అయినప్పటికీ, ఆ తర్వాత రోజు వారీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. ప్యూయెల్ ఖర్చులతో పోల్చితే, మెయింటెనెన్స్ పొదుపులు పెరుగుతాయి. తక్కువ ఖర్చుతో మంచి ప్రయాణాలను కోరుకునే వారికి EVలు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: ఓలా To టీవీఎస్.. మార్చి 2026లో టాప్ ట్రెండింగ్‌ ev స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×