E-Paper
Advertisement

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!
Advertisement

Home EV Charging Safety Tips: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది ఇంట్లోనే   ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఛార్జ్ చేస్తున్నారు. అయితే, సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా ఛార్జింగ్ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల నోయిడాలో ఛార్జింగ్ సమయంలో ఓ ఎలక్ట్రిక్ వాహనానికి మంటలు అంటుకోవడంతో ఈ అంశంపై మరోసారి చర్చకు దారితీసింది.

ఇంటి కరెంట్ కనెక్షన్‌ను చెక్ చేయండి!  

ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఇంట్లో ఛార్జ్ చేసే ముందు ఇంట్లో విద్యుత్ కనెక్షన్ ఆ లోడ్‌ను తట్టుకోగలదా? లేదా? అనేది తెలుసుకోవాలి. తక్కువ సామర్థ్యం ఉన్న విద్యుత్ కనెక్షన్‌పై ఎక్కువ లో డ్‌తో ఛార్జింగ్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ లేదంటే ఇతర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అందుకే ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసే ముందు ఎలక్ట్రీషియన్‌ తో చెక్ చేయించడం మంచిది.

ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్ పెట్టించండి!  

Advertisement

హోమ్ ఛార్జర్‌ ను ఎప్పుడూ అనుభవం కలిగిన టెక్నీషియన్‌ తోనే ఇన్ స్టాల్ చేయించాలి. ప్రత్యేక విద్యుత్ సర్క్యూట్‌ కు లింక్ చేయాలి. ఇలా చేయడం వల్ల విద్యుత్ వ్యవస్థపై అనవసర ఒత్తిడి పడకుండా ఉంటుంది.

ఎక్స్‌ టెన్షన్ కార్డులు వాడొద్దు!

చాలామంది సౌకర్యం కోసం ఎక్స్‌ టెన్షన్ బోర్డులు, అడాప్టర్లు, టెంపరరీ వైరింగ్ ఉపయోగిస్తుంటారు. కానీ, ఇవి అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణంగా మారే అవకాశం ఉంది. సో, ఛార్జింగ్ కోసం నేరుగా ప్రత్యేక సాకెట్‌ ను మాత్రమే ఉపయోగించడం మంచిది.

సరైన సేఫ్టీ పరికరాలు అవసరం

Advertisement

సురక్షితమైన హోమ్ ఛార్జింగ్ కోసం ఎంసీబీ, ఆర్సీసీబీ లాంటి భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. సరైన ఎర్తింగ్ కూడా చాలా ముఖ్యం. ఛార్జర్‌ ను ఎప్పుడూ తేమ లేని, నీరు చేరని ప్రదేశంలో అమర్చాలి.

కంపెనీ ఇచ్చిన ఛార్జర్‌నే ఉపయోగించాలి!

వాహనంతో పాటు వచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. ఇతర కంపెనీల ఛార్జర్లు, నాణ్యత లేని ఛార్జర్లు వాడితే బ్యాటరీతో పాటు విద్యుత్ వ్యవస్థకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఛార్జింగ్ ఆపండి!

ఛార్జింగ్ సమయంలో కాలిపోయిన వాసన రావడం, కేబుల్ వేడెక్కడం, వైర్లు దెబ్బతినడం, స్పార్క్‌ లు కనిపించడం లాంటి సమస్యలు గమనిస్తే వెంటనే ఛార్జింగ్ నిలిపివేయాలి. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా కంపెనీ సర్వీస్ సెంటర్, లేదంటే   టెక్నీషియన్‌ను సంప్రదించడం మంచిది.

ఇంట్లో ఇ-స్కూటర్‌ను ఛార్జ్ చేయడం సౌకర్యవంతమే అయినా, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. సరైన విద్యుత్ కనెక్షన్, ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్, MCB, RCCB, మంచి ఎర్తింగ్, కంపెనీ అందించిన ఛార్జర్ వాడటం లాంటి సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. చిన్న జాగ్రత్తలు మీ ఎలక్ట్రిక్ వాహనాన్నే కాకుండా  కుటుంబాన్ని కూడా సేఫ్ గా ఉంచుతాయి.

Read Also: విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×