E-Paper
Advertisement

EV Battery Dying: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, ఈ ఈవీ బ్యాటరీ ఫెయిల్ అయినట్టే!

EV Battery Dying: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, ఈ ఈవీ బ్యాటరీ ఫెయిల్ అయినట్టే!
Advertisement

EV Battery Problems: ఈ రోజుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న ఫ్యూయెల్ ధరలు, కాలుష్యం లేని ప్రయాణాల పట్ల అవగాహన కారణంగా చాలా మంది EVలను తీసుకుంటున్నారు. అయితే, ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే వారికి ఎదురయ్యే సమస్య బ్యాటరీ. ఒకవేళ బ్యాటరీ పాడవుతోందని ఎలా తెలుసుకోవాలి? అని ఆలోచిస్తారు. నిజానికి EV బ్యాటరీలు సడెన్ గా చెడిపోవు. నెమ్మదిగా తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి.

బ్యాటరీ ప్యాక్ ఎంత కాలం పని చేస్తుంది?

ఒక EVలో ఉన్న ప్రధాన బ్యాటరీ ప్యాక్ సాధారణంగా 8 నుంచి 15 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. అయితే, ఒకేసారి అది పనిచేయకుండా ఆగిపోదు. నెమ్మదిగా దాని సామర్థ్యం తగ్గుతుంది. అంటే, కారు నడుస్తూనే ఉంటుంది. కానీ పూర్తి ఛార్జ్‌ తో వెళ్లే దూరం తగ్గిపోతుంది.

బ్యాటరీ చెడిపోతుందని ఎలా తెలుసుకోవాలి?

Advertisement

బ్యాటరీ క్షీణతకు మొదటి సంకేతం డ్రైవింగ్ రేంజ్ తగ్గడం. ఒక కారు 400 కిలో మీటర్లు వెళ్లి, ఇప్పుడు 300 కిలోమీటర్లకే ఆగిపోతే,  బ్యాటరీ సామర్థ్యం తగ్గిందని అర్థం చేసుకోవాలి. చిన్న మార్పులు సాధారణం. కానీ, 20 నుంచి 30 శాతం తగ్గుదల ఉంటే అలర్ట్ కావాలి. మరొక ముఖ్యమైన విషయం ఛార్జింగ్ వేగం తగ్గడం. ఫాస్ట్ ఛార్జర్ తో కూడా ఎక్కువ సమయం పడితే, బ్యాటరీ సరిగా ఛార్జ్ తీసుకోవడం లేదని అర్థం. అదేవిధంగా, డ్రైవింగ్ సమయంలో పవర్ తగ్గినట్లు అనిపిస్తుంది. ప్రత్యేకంగా వేగంగా యాక్సిలరేట్ చేయాలనుకున్నప్పుడు,  నెమ్మదిగా వెళ్లడం కూడా బ్యాటరీ పనితీరు తగ్గిందని చెప్పేందుకు సంకేతం.

ముందుగానే అలర్ట్ చేసే సిస్టమ్

లేటెస్ట్ EVలు బ్యాటరీ సమస్యలను ముందుగానే సూచిస్తాయి. ‘Check EV System’ లాంటి వార్నింగ్ మెసేజ్ లు డిస్ ప్లే చేస్తాయి. అలా రాగానే వెంటనే చెక్ చేయించుకోవాలి. బ్యాటరీ శాతం అకస్మాత్తుగా పడిపోవడం అంటే, 50% నుంచి 30%కి త్వరగా పడిపోవడం కూడా బ్యాటరీ ఫెయిల్యూర్ సూచిస్తుంది.

బ్యాటరీ ఎప్పుడు మార్చితే మంచిది?

Advertisement

చాలా కంపెనీలు 8–10 సంవత్సరాల వరకు 70–80% వరకు పని చేస్తామని గ్యారెంటీ ఇస్తాయి. బ్యాటరీ హెల్త్ 70% కంటే తక్కువకు పడిపోయి, మీ రోజువారీ అవసరాలు తీరనప్పుడు మాత్రమే మార్చడం మంచిది. దీనికి ముందు, టెక్నీషియన్ ద్వారా బ్యాటరీ పరిస్థితి ఎలా ఉందని చెక్ చేసే పరీక్ష చేయించడం మంచిది.  ఇక్కడ ఇంకో కీలక విషయం ఏంటంటే.. EVలో ఉన్న 12V చిన్న బ్యాటరీని ప్రధాన బ్యాటరీతో కలిపి చూసుకోకూడదు. ఈ చిన్న బ్యాటరీ లైట్లు, ఇన్ఫోటైన్‌మెంట్ లాంటి సిస్టమ్‌లకు పనిచేస్తుంది. సాధారణంగా 3–5 సంవత్సరాల్లో మార్చాల్సి ఉంటుంది.

బ్యాటరీ లైఫ్ ఎలా పెంచుకోవాలంటే?

బ్యాటరీ జీవితకాలాన్ని పెంచడం కూడా డ్రైవింగ్ చేసే వ్యక్తి చేతిలోనే ఉంటుంది. రోజూ 20% నుంచి 80% మధ్యలో ఛార్జ్ ఉండేలా చూసుకోవడం మంచిది. తరచుగా ఫాస్ట్ ఛార్జింగ్ చేయకూడదు. ఎందుకంటే, వేడి బ్యాటరీని ప్రమాదంలో నెట్టేస్తుంది. అలాగే చల్లని ప్రదేశాల్లో పార్కింగ్ చేయడం కూడా మంచిది.

Read Also: మాన్యువల్ ఫీలింగ్ తో ఆటోమేటిక్ డ్రైవ్, ప్యాడిల్ షిఫ్టర్ల గురించి మీకు తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×