E-Paper
Advertisement

ఏథర్ 450 అపెక్స్ vs చేతక్ vs ఐక్యూబ్.. వీటిలో ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్?

ఏథర్ 450 అపెక్స్ vs చేతక్ vs ఐక్యూబ్.. వీటిలో ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్?
Advertisement

Electric Scooters Comparison: ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌ లో ప్రస్తుతం మంచి పోటీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఏథర్ 450 అపెక్స్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ మోడళ్లు వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ధర, పనితీరు, రేంజ్ లాంటి కీలక అంశాల్లో ఈ మూడు స్కూటర్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. చాలా మందికి వీటిలో ఏది కొనాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ స్కూటర్ బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం..

ధరలు ఎలా ఉన్నాయంటే?

ధర విషయానికి వస్తే, ఏథర్ 450 అపెక్స్ ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో కాస్త ఖరీదైనది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.1.90 లక్షలు. బజాజ్ చేతక్ ధర సుమారు రూ. 1.18 లక్షలు. అటు టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ. 1.11 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. బడ్జెట్ పరంగా చూస్తే ఐక్యూబ్, చేతక్ మోడళ్లు మరింత అందుబాటులో ఉంటాయి.

ఏది ఎక్కువ దూరం ప్రయాణిస్తుందంటే?

Advertisement

రేంజ్ పరంగా చూసినా ఈ మూడు స్కూటర్లు దగ్గర దగ్గరగానే ఉంటాయి. ఏథర్ 450 అపెక్స్ ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 157 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బజాజ్ చేతక్ దాదాపు 151 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ సుమారు 110 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు ఇవన్నీ సరిపడే రేంజ్ ఇస్తాయి. సిటీలో ఉపయోగించే వారికి ఈ స్థాయి రేంజ్ ఉపయోగకరంగా ఉంటుంది.

పని తీరును పరిశీలిస్తే..

పనితీరు విషయంలో మాత్రం ఏథర్ 450 అపెక్స్ కొంచెం ముందు ఉంటుంది. ఇది సుమారు 7 kW పవర్‌ ను అందిస్తుంది. అందువల్ల స్పీడ్, పిక్ అప్ విషయంలో మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది. మిగతా రెండు స్కూటర్లు సౌకర్యవంతమైన రైడింగ్‌ పై ఎక్కువ దృష్టి పెట్టాయి. ముఖ్యంగా చేతక్, ఐక్యూబ్ మోడళ్లు స్మూత్, కంఫర్ట్ రైడ్ కోసం తయారు చేశారు. ఛార్జింగ్ టైమ్ విషయానికి వస్తే, ఏథర్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటల 45 నిమిషాలు పడుతుంది. మిగతా మోడళ్లలో కూడా దాదాపు ఇదే రేంజ్‌లో టైమ్ ఉంటుంది. వేరియంట్‌పై ఆధారపడి కొంత మొత్తంలో సమయం మారే అవకాశం ఉంటుంది.

డిజైన్, ఫీచర్ల గురించి..

Advertisement

డిజైన్, ఫీచర్ల పరంగా చూస్తే, ఏథర్ 450 అపెక్స్ కొంచెం స్పోర్టీ లుక్‌ తో యూత్ ను ఆకట్టుకుంటుంది. బజాజ్ చేతక్ మాత్రం క్లాసిక్ డిజైన్‌ తో స్టైలిష్‌గా కనిపిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ మాత్రం సింపుల్, ప్రాక్టికల్ డిజైన్‌ తో ఫ్యామిలీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. మూడు మోడళ్లలోనూ డిజిటల్ డిస్ ప్లే, కనెక్టివిటీ లాంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు మీరు ఎక్కువ పవర్, స్పోర్టీ ఫీల్ కోరుకుంటే ఏథర్ 450 అపెక్స్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.  స్టైల్‌ తో పాటు నమ్మకమైన బ్రాండ్ కావాలంటే బజాజ్ చేతక్ తీసుకోవచ్చు. బడ్జెట్‌ లో మంచి ఫీచర్లతో స్కూటర్ కావాలంటే టీవీఎస్ ఐక్యూబ్ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. వినియోగదారుల అవసరాన్ని బట్టి ఈ మూడు స్కూటర్లలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు.

Read Also: కొత్త లుక్‌ లో అవెనిస్ స్కూటర్.. యువత కోసం సుజుకి సూపర్ ప్లాన్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×