E-Paper
Advertisement

EV Car Maintenance Tips: ఎలక్ట్రిక్ కారు యజమానులకు అలర్ట్, ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే!

EV Car Maintenance Tips: ఎలక్ట్రిక్ కారు యజమానులకు అలర్ట్, ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా పెట్రో కార్ల నుంచి చాలా మంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఛార్జింగ్ ఇన్ ఫ్రా సదుపాయాలు పెరగడంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే, చాలా మంది వాటిని సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడంతో త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్ కు సంబంధించి కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ అవేంటి అనేది తెలుసుకుందాం..

బ్యాటరీ గురించి జాగ్రత్తలు

ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ అనేది గుండె లాంటిది. బ్యాటరీ ఎంత బాగా మెయింటెనెన్స్ చేస్తే, అంత బాగా కారు రన్ అవుతుంది. మొబైల్ ఫోన్ల మాదిరిగానే, EV బ్యాటరీలకు సరైన ఇన్ ఫుట్, అవుట్ ఫుట్ ఇవ్వాలి. బ్యాటరీని సరిగ్గా మెయింటెనెన్స్ చేస్తే, ఎక్కువ కాలం చక్కగా పని చేస్తుంది.

Advertisement

⦿ బ్యాటరీని ఓవర్‌ఛార్జ్ చేయకూడదు: EV బ్యాటరీలు త్వరగా చెడిపోవడానికి కారణం ఓవర్‌ ఛార్జింగ్. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకపోతే బ్యాటరీని 100% వరకు ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. బ్యాటరీ హెల్తీగా ఉండాలంటే 20-80% ఛార్జ్‌ని నిర్వహించడానికి ప్రయత్నించండి.

⦿ బ్యాటరీని హీట్ కాకుండా చూసుకోవాలి: EV బ్యాటరీ చెడిపోయేందుకు మరో కారణం ఎక్కువ హీట్ కావడం. తీవ్రమైన వేడి కారణంగా బ్యాటరీ డల్ అవుతుంది.  EV లను నీడలో పార్క్ చేయాలి.

Advertisement

⦿ అవసరమైతేనే ఫాస్ట్ ఛార్జర్‌ వాడండి: ఆధునిక EV లు హై వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తున్నప్పటికీ,  అవసరమైనప్పుడు మాత్రమే వాటిపై ఆధారపడటం మంచిది. ఫాస్ట్ ఛార్జర్‌లను ఎక్కువసేపు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ బ్యాటరీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఎలక్ట్రిక్ భాగాలు, మోటార్ మెయింటెనెన్స్   

బ్యాటరీ ప్యాక్ తర్వాత, ఎలక్ట్రిక్ మోటారు ఈవీలో అత్యంత కీలకమైన భాగం. పెట్రో ఇంజిన్లతో పోలిస్తే మోటారుకు చాలా తక్కువ మెయింటెనెన్స్ అవసరం అయినప్పటికీ, కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

⦿ రెగ్యులర్ చెకింగ్: EV ఎలక్ట్రిక్ మోటారు దుమ్ము, బురద లాంటివి పట్టుకుపోకుండా చూసుకోవాలి. రొటీన్ సర్వీసింగ్‌ లో భాగంగా మోటార్ భాగాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలి.  ఏదైనా సౌండ్, పనితీరు తగ్గుదల అనిపిస్తే చెక్ చేయాలి.

⦿ మంచి డ్రైవింగ్ అలవాట్లు:  ఎలక్ట్రిక్ వాహనాలను చక్కగా డ్రైవ్ చేయాలి. EVని నడిపే విధానం దాని మొత్తం పని తీరు మీద ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన స్పీడ్, క్షీణత, సడెన్ బ్రేకింగ్ వల్ల మోటారు, బ్యాటరీ పనితీరు తగ్గే అవకాశం ఉంది.

బ్రేక్, బ్రేకింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్   

ఎలక్ట్రిక్ వాహనంలో మరో కీలకమైన భాగం బ్రేక్‌లు, బ్రేకింగ్ సిస్టమ్స్. ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలు చాలా వరకు రీజెనరేటివ్  బ్రేకింగ్‌ తో వస్తాయి.  బ్రేక్‌లు, బ్రేకింగ్ సిస్టమ్ నిర్వహణ మరింత ముఖ్యమైనది. బ్రేక్‌లు సాధారణంగా ఎలక్ట్రిక్ కారులో తక్కువ   ఉపయోగించబడతాయి. బ్రేక్ భాగాలకు తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. అందుకే, క్రమం తప్పకుండా బ్రేకింగ్ వ్యవస్థను గమనించాలి.

టైర్ మెయింటెనెన్స్

ఎలక్ట్రిక్ కారు మంచి రేంజ్ అందించాలంటే టైర్లను చక్కగా మెయింటెనెన్స్ చేయాలి. గాలి ప్రెజర్ సరిగా ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. ఎప్పుడూ సరైన మొత్తంలో టైర్ ప్రెజర్ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ టైర్లు పగుళ్లు పట్టినా, దారాలు తేలేలా అరిగిపోయినా, వెంటనే మార్చడం మంచిది.

సకాలంలో సర్వీసింగ్, ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్

ఎలక్ట్రిక్ కారు చక్కగా పని చేయాలంటే టైమ్ టు టైమ్ సర్వీసింగ్ చేయించుకోవాలి. అదే సమయంలో ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయించుకోవాలి. తయారీ కంపెనీ సర్వీస్ షెడ్యూల్‌ను కచ్చింతంగా పాటించాలి.

Read Also: 1,085 బస్సులకు తెలంగాణ సర్కారు ఆర్డర్, దూసుకెళ్లిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ షేర్లు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×