E-Paper
Advertisement

E20 పెట్రోల్‌ వివాదం.. ఇప్పుడు అందరి ఫోకస్ XP100 ప్యూయల్ పైనే.. దీని స్పెషల్ ఏంటో తెలుసా?

E20 పెట్రోల్‌  వివాదం.. ఇప్పుడు అందరి ఫోకస్ XP100 ప్యూయల్ పైనే.. దీని స్పెషల్ ఏంటో తెలుసా?
Advertisement

XP100 Explained: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది వాహనదారుల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పాత కార్లు, బైక్‌లు ఉన్నవాళ్లు ఇంజిన్ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇండియన్ ఆయిల్ అందిస్తున్న XP100 ప్రీమియం పెట్రోల్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అసలు XP100 అంటే ఏంటి? ఇది నిజంగానే ఇథనాల్ లేకుండా వస్తుందా? ఎవరు దీనిని వాడాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

E20 పెట్రోల్‌ లో ఇథనాల్ మిక్సింగ్

ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న E20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, దేశ ఇంధన భద్రతను పెంచడం కోసం ప్రభుత్వం ఈ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. కొత్త వాహనాలకు ఇది అనుకూలమని ప్రభుత్వం, వాహన తయారీ సంస్థలు చెబుతున్నప్పటికీ, పాత వాహనాల యజమానుల్లో మాత్రం కొన్ని సందేహాలు కొనసాగుతున్నాయి.

ఏంటీ XP100 పెట్రోల్ ప్రత్యేకత?

Advertisement

ఇప్పుడు చాలామంది చూపు XP100పై పడుతోంది. ఇది సాధారణ పెట్రోల్ కాదని, 100 ఆక్టేన్ రేటింగ్ కలిగిన ప్రీమియం ఇంధనమని ఇండియన్ ఆయిల్ చెబుతోంది. ముఖ్యంగా ఇందులో ఇథనాల్ కలపరు. అందుకే పాత కార్లు, క్లాసిక్ వాహనాలు, హై-పెర్ఫార్మెన్స్ కార్లు, సూపర్‌బైక్‌ల యజమానులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. XP100 వాడటం వల్ల ఇంజిన్ సాఫీగా పనిచేయడం, వేగంగా యాక్సిలరేషన్ రావడం, వేగంగా ఫ్యూయల్ బర్నింగ్, కొంత మేర మైలేజ్‌ లో మెరుగుదల ఉంటుంది. అయితే, దీని కంప్లీట్ ప్రయోజనం హై కంప్రెషన్ ఇంజిన్లు ఉన్న వాహనాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.

91 ఆక్టేన్ పెట్రోల్ అవసరమయ్యే వాహనంలో XP100 పోస్తే ఏమైనా సమస్య వస్తుందా? అనే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి ప్రమాదం లేదని ఇండియన్ ఆయిల్ వెల్లడించింది. ఇంజిన్‌కు ఎలాంటి నష్టం జరగదని, పైగా పనితీరు మరింత సాఫీగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. సాధారణ పెట్రోల్‌తో XP100 కలిసిపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ చెబుతోంది. రెండూ కలిసినా ఇంజిన్‌కు హాని కలగదని, ఇంధన నాణ్యత మాత్రం 91 ఆక్టేన్ కంటే మెరుగ్గా ఉంటుందని వివరించింది. కొంతకాలం XP100 వాడిన తర్వాత తిరిగి సాధారణ 91 ఆక్టేన్ పెట్రోల్‌కు మారినా ఇంజిన్‌కు ఇబ్బంది లేదని వెల్లడించింది. అంతేకాదు, XP100 వాడే సమయంలో ఫ్యూయల్ సిస్టమ్, ఇంజిన్ భాగాలు శుభ్రంగా ఉండేందుకు కూడా సాయపడుతుందని తెలిపింది.

ధర ఎక్కువేనండోయ్!

Advertisement

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ XP100 ధర సుమారు రూ.167.35గా ఉంది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, పాత వాహనాలు లేదా హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్‌లు ఉన్నవారికి ఇదో ప్రత్యామ్నాయంగా మారింది.

Read Also: మీ పాత కారులో E20 పెట్రోల్ కొట్టిస్తున్నారా? ARAI రిపోర్ట్ ఏం చెప్పిందంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×