E-Paper
Advertisement

Renault Duster: భారత్ లో రెనాల్ట్ లోగో కంటే డస్టర్ లెటర్స్ పెద్దగా ఉంటాయి, ఎందుకో తెలుసా?

Renault Duster: భారత్ లో రెనాల్ట్ లోగో కంటే డస్టర్ లెటర్స్ పెద్దగా ఉంటాయి, ఎందుకో తెలుసా?
Advertisement

 Renault Duster Size: ఆటో మోబైల్ దిగ్గజం రెనాల్ట్ రీసెంట్ గా డస్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరింత అప్ డేట్ లుక్ తో లాంచ్ కానుంది. అయితే, ఈ కారు బ్రాండ్ లోగోతో పోల్చితే డస్టర్ నేమ్ ప్లేట్ పెద్దదిగా కనిపించింది. దీనికి గురించి   రెనాల్ట్ గ్రూప్ చీఫ్ డిజైన్ ఆఫీసర్ లారెన్స్ వాన్ డెన్ అకర్ కీలక విషయాలు వెల్లడించారు. “రెనాల్ట్ ఇండియా రీసెంట్ గా థర్డ్ జెనరేషన్ డస్టర్ ను లాంచ్ చేసింది. అయితే, ఇండియాలో డస్టర్ అనేది రెనాల్ట్ కంటే ఎక్కువ ఫేమస్. అందుకే డస్టర్ నేమ్ ప్లేట్ పెద్దగా మార్చాం” అని చెప్పుకొచ్చారు.

ఇండియన్ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు

భారతీయ ఆటో మోబైల్ మార్కెట్ లో డస్టర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కంపెనీకి సంబంధించి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సంచలనం యూరప్, ఆఫ్రికా అంతటా బాగా పాపులర్ అయ్యింది. కానీ, భారత్ లో ఆ ప్రభావం మరింత డెప్త్ గా ఉంది. డస్టర్ అమ్ముడవ్వడమే కాదు, కంపెనీకి అదో మైల్ స్టోన్ గా మారిపోయింది. చాలా మంది రెనాల్ట్ అనే పేరును మర్చిపోయి, డస్టర్ గానే గుర్తు పెట్టుకోవడం మొదలు పెట్టారు.

డస్టర్ నేమ్ ప్లేట్ సైజు ఎందుకు పెరిగిందంటే?

Advertisement

న్యూ జెనరేషన్ డస్టర్ అనేది ప్రజల్లోకి బాగా వెళ్లాలనని కంపెనీ భావించింది. అందులో భాగంగానే ఇండియన్స్ కు మరింత దగ్గర చేయాలనే కారణంతో రెనాల్ట్ లోడో కంటే డస్టర్ నేమ్ బ్యాండ్ పెద్ద సైజులో అందుబాటులోకి తీసుకొచ్చింది. నేమ్ ప్లేట్ ను చూసి ప్రజలు ఈజీగా గుర్తించేలా ఉండాలన్నారు వాన్ డెన్ అకర్. హై గ్రౌండ్ క్లియరెన్స్, చిన్న ఓవర్‌ హ్యాంగ్‌లు, మూలలకు నెట్టబడినట్టు ఉండే వీల్స్.. పెరుగుతున్న బెల్ట్‌ లైన్ కొనసాగింపును కన్ఫార్మ్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ఇండియాలో రెనాల్ట్ కంపెనీకి చెందిన కార్లకు ఇంకా అనుకున్న స్థాయిలో ఆదరణ దక్కడం లేని, అందుకే, తమ కార్లను మరింత ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా నేమ్ బ్యాండ్ పెద్దగా మార్చినట్లు వెల్లడించారు. ఇతర కార్లతో పోటీ పడాలంటే, ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అందుకే డస్టర్ పేరు రెనాల్ట్ బ్యాడ్జ్ కంటే ఎక్కువ పెద్దగా ఉండేలా చూసుకున్నట్లు వెల్లడించారు.

సరికొత్త డిజైన్ తో..

Advertisement

ఇక కొత్త డస్టర్ డిజైన్, టెక్నాలజీలో మరింత అప్ డేట్ అయ్యింది. LED లైటింగ్, డ్యూయల్ 10 అంగుళాల డిజిటల్ డిస్‌ ప్లేలు, గూగుల్ ఆటోమోటివ్ సర్వీసెస్, కనెక్టెడ్ టెక్, ప్రీమియం, డ్రైవర్ ఫోకస్డ్ క్యాబిన్ ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం రెనాల్ట్ టర్బో-పెట్రోల్, పవర్ ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్‌లపై ఫోకస్ పెడుతుంది. భవిష్యత్ ట్రెండ్‌ కు అనుగుణంగా డస్టర్ అందుబాటులోకి రానుంది. మొత్తంగా ఇండియాలో డస్టర్ రెనాల్ట్ కంటే పెద్దది అని చెప్పుకోవచ్చు.

Read Also: చౌకైన బ్యాటరీలు, CNG బ్లెండింగ్.. ఆటో ఇండస్ట్రీకి బడ్జెట్ బూస్టింగ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×