// // Automatic Gearbox: AMT vs CVT vs DCT vs DSG.. వామ్మో.. ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ లో ఇన్ని రకాలున్నాయా? -->
E-Paper
Advertisement

AMT vs CVT vs DCT vs DSG.. వామ్మో.. ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ లో ఇన్ని రకాలున్నాయా?

AMT vs CVT vs DCT vs DSG.. వామ్మో.. ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ లో ఇన్ని రకాలున్నాయా?
Advertisement

AMT, CVT, IVT, DCT, DSG Difference: భారతీయ కార్ మార్కెట్లో ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఒకప్పుడు ఆటోమేటిక్ అంటే ఒకే రకం గేర్‌ బాక్స్ అనుకునేవారు. కానీ ఇప్పుడు AMT, CVT, IVT, DCT, DSG, టార్క్ కన్వర్టర్, iMT లాంటి పలు రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ క్లచ్ పని తగ్గించినప్పటికీ, ఒక్కోటి ఒక్కో విధంగా పని చేస్తాయి. అలాగే, ఒక్కోటి వేర్వేరు రకాల వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకీ ఏ గేర్ బాక్స్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ AMT

AMT అంటే ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్. ఇది సాధారణ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ లానే ఉంటుంది. కానీ క్లచ్, గేర్ మార్పులను సిస్టమ్ ఆటోమేటిక్‌ గా మేనేజ్ చేస్తుంది. ధర తక్కువగా ఉండటంతో చిన్న కార్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సిటీ యూజ్ కు బాగానే పని చేస్తుంది. అయితే, గేర్ మార్పుల సమయంలో కొద్దిగా జర్క్ అనిపించవచ్చు.

⦿ CVT

Advertisement

CVT అంటే కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్‌ మిషన్. ఇది సాధారణ గేర్లకు బదులుగా పుల్లీ సిస్టమ్‌ తో పని చేస్తుంది. అందుకే డ్రైవింగ్ చాలా స్మూత్‌ గా ఉంటుంది. హోండా సిటీ, హోండా ఎలివేట్ వంటి కార్లలో ఇది కనిపిస్తుంది. మైలేజ్, సిటీ డ్రైవింగ్ కోసం ఇది మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. స్పోర్టీ డ్రైవింగ్ ఇష్టపడేవారికి అంతగా నచ్చకపోవచ్చు.

⦿ IVT

IVT అనేది హ్యుందాయ్, కియా కంపెనీల CVT తరహా గేర్‌ బాక్స్. ఇది కూడా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది. హ్యుందాయ్ వెర్నా, i20, కియా సోనెట్, సెల్టోస్ లాంటి కార్లలో ఉంటుంది. సిటీలోఎక్కువగా ప్రయాణించే వారికి ఇది బాగా సరిపోతుంది.

⦿ DCT

Advertisement

DCT అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌ మిషన్. ఇందులో రెండు క్లచ్‌లు ఉంటాయి. ఒకటి బేసి గేర్లకు, మరొకటి సరి గేర్లకు పని చేస్తాయి. అందుకే గేర్ మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. హ్యుందాయ్ క్రెటా టర్బో, వెర్నా టర్బో, కియా సెల్టోస్ టర్బో లాంటి కార్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

⦿ DSG

DSG అనేది వోక్స్‌ వ్యాగన్ గ్రూప్ ఉపయోగించే డ్యూయల్ క్లచ్ గేర్‌ బాక్స్ పేరు. వర్టస్, టైగన్, స్లావియా, కుషాక్ వంటి కార్లలో  ఉంటుంది. ఫాస్ట్ గేర్ మార్పులు, స్పోర్టీ ఫీలింగ్ దీని ప్రత్యేకత. డ్రైవింగ్ ఇష్ట పడేవారికి ఇది మంచి ఆప్షన్.

⦿ టార్క్ కన్వర్టర్

టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ మాత్రం చాలా మంది ఇష్టపడుతారు. ఇది స్మూత్‌గా పనిచేయడమే కాకుండా, మంచి నమ్మకాన్ని కలిగిస్తుంది. మహీంద్రా స్కార్పియో ఎన్, టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ క్రెటా డీజిల్ ఆటోమేటిక్ లాంటి కార్లలో ఇది కనిపిస్తుంది. సిటీతో పాటు హైవే ప్రయాణాలకు కూడా బాగా సరిపోతుంది.

⦿ iMT

iMT పూర్తిగా ఆటోమేటిక్ కాదు. ఇందులో క్లచ్ పెడల్ ఉండదు. కానీ, డ్రైవర్ గేర్‌ ను చేతితో మార్చాలి. ట్రాఫిక్‌ లో క్లచ్ నొక్కే ఇబ్బంది లేకుండా మాన్యువల్ ఎక్స్ పీరియెన్స్ ను కోరుకునేవారికి  ఉపయోగపడుతుంది.

తక్కువ బడ్జెట్ వారికి AMT, సిటీ డ్రైవింగ్‌కు CVT, IVT, పర్ఫార్మెన్స్ కోసం DCT, DSG, సౌకర్యం కోసం టార్క్ కన్వర్టర్ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.

Read Also: భారత మార్కెట్లోకి యూనో మిండా 3 ఛానల్ డాష్‌ క్యామ్.. 5 ఆసక్తికర విశేషాలు మీకోసం!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×