E-Paper
Advertisement

పాత వాహనాలు ఉన్నాయా? కేంద్రం అదిరిపోయే ఆఫర్లు.. చలానాలు, ట్యాక్స్ మాఫీ!

పాత వాహనాలు ఉన్నాయా? కేంద్రం అదిరిపోయే ఆఫర్లు.. చలానాలు, ట్యాక్స్ మాఫీ!
Advertisement

PARIVARTAN Scheme: దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పెరుగుతున్న రవాణా కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కీలక పరిణామం చోటుచేసుకుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో పాత వాణిజ్య వాహనాల స్థానంలో పర్యావరణ రహిత వాహనాలను తీసుకొచ్చేందుకు రూపొందించిన ‘పరివర్తన్’ (PARIVARTAN) పథకం అమలుకు దిల్లీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు కేంద్రం సైతం.. పరివర్తన్ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. పాతవాహనాల నుంచి కొత్త వాటికి మరలే వారికి అద్భుతమైన ప్రోత్సహాకాలను ప్రకటించింది.

పరివర్తన్ స్కీమ్ లక్ష్యమేంటి?

కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అందుబాటులోకి వచ్చిన ఈ ‘పరివర్తన్’ పథకం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో తిరిగే పాత, తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లే ట్రక్కులు, బస్సులను దశలవారీగా తొలగించడంపై దృష్టి సారిస్తుంది. దిల్లీలో పాటు హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ లోని ఎన్ సీఆర్ పరిధి జిల్లాల వ్యాప్తంగా ఈ పరివర్తన్ పథకం అమలు చేయనున్నారు. ఈ స్కీమ్ కింద ఆర్థిక ప్రోత్సహకాలు అందించడం ద్వారా వాహన యజమానులు.. విద్యుత్ (EV), బీఎస్-VI (BS-VI) వాహనాలకు మారేలా ప్రోత్సహించనున్నారు.

రూ. 9,585 కోట్లు కేటాయింపు

Advertisement

ఈ పరివర్తన్ కార్యక్రమానికి గాను మొత్తంగా రూ. 9,585 కోట్ల ఆర్థిక వ్యయాన్ని కేటాయించారు. ఇందులో రూ. 5,041 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. జూన్ 3న కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలుపగా.. జులై 16న కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో దాదాపు 2.07 లక్షల మంది ట్రక్కు, బస్సు యజమానులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కేంద్రం భారీ ఆఫర్లు

పరివర్తన్ స్కీమ్ కింద పాత వాహనాలను రద్దు చేసి కొత్త విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం భారీ ఆఫర్లను ప్రకటించింది. బీఎస్-IV లేదా అంతకంటే పాత LGVలను స్క్రాప్ చేసి కొత్త ఈవీ రవాణా వాహనాలను కొనుగోలు చేస్తే 10 సంవత్సరాల పాటు మోటారు వాహన పన్ను, రిజిస్ట్రేషన్ రుసుములలో 100 శాతం మినహాయింపు ఇవ్వనుంది. పన్ను మినహాయింపుతో పాటు 5 శాతం వడ్డీ సబ్సిడీ, తయారీదారుల నుండి 8 శాతం డిస్కౌంట్, ఇంధన వోచర్లు లేదా దానికి సమానమైన నిధుల సాయం ప్రభుత్వం తరపున అందనున్నాయి.

సెకండ్ హ్యాండ్ కొన్నా రాయితీ

Advertisement

ఒకవేళ వాడిన ఎలక్ట్రిక్ ఎల్‌జీవీలను కొనుగోలు చేస్తే 10 ఏళ్ల పాటు 50 శాతం పన్ను మినహాయింపుతో పాటు మిగిలిన ప్రయోజనాలు వర్తిస్తాయి. మరోవైపు మీడియం, హెవీ గూడ్స్ వాహనాల యజమానులు.. తమ పాత బీఎస్-IV వాహనాల స్థానంలో కొత్త బిఎస్-VI లేదా ఎలక్ట్రిక్ మోడళ్లను ఎంచుకుంటే పదేళ్ల పాటు పూర్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు లభించనున్నాయి. ఇదిలా ఉంటే పరివర్తన్ పథకం పరిధిలోకి పాత బస్సులను కూడా తీసుకొచ్చారు. అయితే పాత బస్సుల స్థానంలో బీఎస్-VI సీఎన్‌జీ (CNG) లేదా ఎలక్ట్రిక్ మోడళ్లను మాత్రమే అనుమతించనున్నారు.

Also Read: వాట్సప్ హ్యాక్ అయిందా? వెంటనే ఇలా చేయండి.. స్కామర్లకు పిచ్చెక్కిపోద్ది!

పెండింగ్ చలాన్లు మాఫీ

పరివర్తన్ పథకం మార్గదర్శకాల్లో భాగంగా మరో ఆఫర్ ను సైతం కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద స్క్రాపింగ్‌కు ఇచ్చే వాహనాలకు సంబంధించి ఏడాది కంటే ఎక్కువ కాలం పెండింగ్ లో ఉన్న రోడ్ ట్యాక్స్, ఫిట్‌నెస్ జరిమానాలను పూర్తిగా మినహాయించనున్నారు. ఇక పాత బీఎస్-IV వాహనాలను స్క్రాప్ చేయకూడదనుకుంటే.. ఎన్‌సీఆర్ వెలుపలి ప్రాంతాలలో విక్రయించుకునే వెసులుబాటును కూడా కల్పించారు. మరోవైపు ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రత్యేకమైన డిజిటల్ పోర్టల్ ను సైతం అందుబాటులోకి తెచ్చింది.

Also Read: 20,000mAh బ్యాటరీ.. 67W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ నుంచి మైండ్ బ్లోయింగ్ పవర్ బ్యాంక్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×