E-Paper
Advertisement

చిన్న డివైజ్.. క్షణాల్లో నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చుకోవచ్చు!

చిన్న డివైజ్.. క్షణాల్లో నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా  మార్చుకోవచ్చు!
Advertisement

Electric Bicycle Retrofit Kits: ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే, కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ బైక్ కన్వర్షన్ కిట్లు లేదంటే రెట్రోఫిట్ కిట్లు వల్ల మీ దగ్గర ఇప్పటికే ఉన్న సాధారణ సైకిల్‌ ను చాలా ఈజీగా ఎలక్ట్రిక్ సైకిల్‌ గా మార్చుకోవచ్చు.

నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చడం ఎలా?

ఈ కన్వర్షన్ కిట్లలో సాధారణంగా మోటార్, బ్యాటరీ, కంట్రోలర్, వైరింగ్, అవసరమైన ఇతర భాగాలు ఉంటాయి. వీటిని సైకిల్‌కు అమర్చడానికి ఫ్రేమ్‌ను కత్తిరించడం, వెల్డింగ్ చేయడం లాంటి పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. చాలా కిట్లు కొన్ని నిమిషాల్లోనే సైకిల్‌ కు అమర్చుకునేలా ఉంటాయి. కొన్ని పోర్టబుల్ కన్వర్షన్ డివైజ్ లు సైకిల్ వెనుక చక్రం పైన ఫ్రేమ్‌ కు క్లిప్ చేసే విధంగా ఉంటాయి. బ్యాటరీని సైకిల్‌ లో ఉండే వాటర్ బాటిల్ హోల్డర్ దగ్గర అమర్చవచ్చు. దీంతో సైకిల్ లో ఎలాంటి మార్పులు లేకుండానే ఎలక్ట్రిక్ సపోర్ట్ అందుతుంది.

Advertisement

ఈ కిట్లలో ఎక్కువగా 36V, 250W మోటార్లు ఉపయోగిస్తారు. ఇవి రోజువారీ ప్రయాణాలకు సరిపడే పనితీరును అందిస్తాయి. కొన్ని ఆధునిక మోడళ్లు 750W వరకు శక్తిని అందిస్తూ గంటకు సుమారు 32 కిలోమీటర్ల వేగం చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రైడింగ్‌ను మరింత ఈజీగా మార్చేందుకు ఈ కిట్లలో పలు రకాల మోడ్‌లు ఉంటాయి. పెడల్ అసిస్ట్ మోడ్ లో పెడల్ తొక్కినప్పుడు మోటార్ అదనపు శక్తిని అందిస్తుంది. స్టాండ్‌బై మోడ్ లో సాధారణ సైకిల్‌ లాగే ప్రయాణించవచ్చు. కొన్ని మోడళ్లలో క్రూజ్ మోడ్ కూడా ఉంటుంది. ఇందులో మోటార్ సహాయంతో తక్కువ శ్రమతో ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ఒకే ఛార్జ్ తో 90 కి.మీ ప్రయాణం

బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రీమియం కిట్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అంటే బ్రేక్ వేసినప్పుడు, డౌన్ రోడ్ లో  ప్రయాణించినప్పుడు కొంత విద్యుత్‌ను తిరిగి బ్యాటరీలో స్టోర్ చేసే విధంగా ఈ వ్యవస్థ పని చేస్తుంది.

Advertisement

భారత మార్కెట్ లో పలు రకాల కన్వర్షన్ కిట్లు

భారత మార్కెట్లో కూడా ఇలాంటి కన్వర్షన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వేర్వేరు కంపెనీలు బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, ఫీచర్లను బట్టి అనేక మోడళ్లను విక్రయిస్తున్నాయి. సాధారణంగా వీటి ధరలు రూ.10,000 నుంచి రూ.45,000 మధ్య ఉంటాయి. కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ కొనడానికి ఎక్కువ మనీ ఖర్చు చేయకుండా, ఇప్పటికే ఉన్న సైకిల్‌ను తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ సైకిల్‌ గా మార్చుకోవాలనుకునే వారికి ఈ కన్వర్షన్ కిట్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×