E-Paper
Advertisement

హాఫ్ క్లచ్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే, మీ పర్సు ఖాళీ అవ్వడం పక్కా!

హాఫ్ క్లచ్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే, మీ పర్సు ఖాళీ అవ్వడం పక్కా!
Advertisement

Half Clutch Driving: కారు క్లచ్ సమస్యలు చాలా మందికి ఆలస్యంగా గుర్తిస్తారు. క్లచ్ జారడం, పెడల్ గట్టిగా అనిపించడం, వింత శబ్దాలు రావడం మొదలైనప్పుడు మాత్రమే చాలామంది దానిపై దృష్టి పెడతారు. కానీ, అప్పటికి క్లచ్ ఎక్కువగా అరిగిపోతాయి. క్లచ్ అసెంబ్లీ మార్చడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం విడిభాగాలు, లేబర్ ఛార్జీలు పెరిగిపోవడంతో ఈ ఖర్చు మరింత ఎక్కువ అవుతోంది. అయితే, చాలా సందర్భాల్లో క్లచ్ త్వరగా దెబ్బతినడానికి ప్రధాన కారణం డ్రైవింగ్ అలవాట్లే అంటున్నారు నిపుణులు.

దేశంలో ఇప్పటికీ మాన్యువల్ కార్ల వినియోగం ఎక్కువగానే ఉంది. హ్యాచ్‌ బ్యాక్‌ లు, చిన్న SUVలు, ఎంట్రీ లెవల్ సెడాన్లలో మాన్యువల్ గేర్‌ బాక్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, తరచూ ఆగి మళ్లీ కదలాల్సి రావడం, ఎత్తైన రోడ్లపై డ్రైవ్ చేయడం లాంటి పరిస్థితులు క్లచ్‌ పై అదనపు ఒత్తిడిని పెంచుతాయి. ఈ పరిస్థితుల్లో సరైన డ్రైవింగ్ అలవాట్లు లేకపోతే క్లచ్ త్వరగా చెడిపోతుంది.

డ్రైవింగ్ సమయంలో క్లచ్ పై కాలు పెట్టడం!

Advertisement

చాలామందికి ఉండే ఒక సాధారణ అలవాటు ఏమిటంటే, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లచ్ పెడల్‌ పై కాలు ఉంచడం. కొద్దిగా ఒత్తిడి ఉన్నా క్లచ్ పూర్తిగా రిలీజ్ కాకుండా ఉంటుంది. లోపల ఘర్షణ పెరిగి వేడి ఉత్పత్తి అవుతుంది. క్లచ్ ఈజీగా అరిగిపోయేందుకు కారణమవుతుంది.

ఏటవాలు ప్రదేశాల్లో క్లచ్ వాడటం!

ఇంకొక తప్పు అలవాటు వాలుగా ఉన్న ప్రదేశాల్లో బ్రేక్ ఉపయోగించకుండా క్లచ్ సాయంతో కారును నిలిపి ఉంచడం. ఇలా చేయడం వల్ల క్లచ్ ప్లేట్‌ పై ఒత్తిడి పడుతుంది. క్లచ్ వేడెక్కి దెబ్బతినే పరిస్థితి వస్తుంది.

హాఫ్ క్లచ్ ఉపయోగించడం!

Advertisement

ట్రాఫిక్‌లో నెమ్మదిగా కదిలేటప్పుడు చాలామంది హాఫ్ క్లచ్ ఉపయోగిస్తుంటారు. అంటే క్లచ్‌ను పూర్తిగా వదలకుండా కొంత నొక్కి ఉంచి కారును కదిలించడం. ఇలా చేయడం క్లచ్‌ కు చాలా హానికరం. ముఖ్యంగా భారీ SUVలు, ఎక్కువ బరువున్న వాహనాల్లో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

అటు ఒక్కసారిగా వేగంగా స్టార్ట్ చేయడం, గేర్లు రఫ్‌గా మార్చడం, సడెన్ గా యాక్సిలరేట్ చేయడం లాంటి డ్రైవింగ్ అలవాట్లు కూడా క్లచ్‌పై ఒత్తిడిని పెంచుతాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర న్యూట్రల్‌ లో పెట్టకుండా క్లచ్ నొక్కి ఉంచడం కూడా మంచిది కాదు. దీని వల్ల రిలీజ్ బేరింగ్ వంటి భాగాలు త్వరగా అరిగిపోతాయి.

పరిమితికి మించి బరువు తీసుకెళ్లడం!

కారులో ఎక్కువ మంది ప్రయాణించడం, అధిక లగేజీ మోసుకోవడం కూడా క్లచ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చిన్న కార్లలో  మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, క్లచ్ పెడల్ గట్టిగా అనిపించడం, గేర్లు సరిగ్గా పడకపోవడం, వైబ్రేషన్ రావడం లాంటి హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యలు పెద్ద ఖర్చులకు దారితీస్తాయి.

Read Also: కొత్త కారు మంచిదా? సెకండ్ హ్యాండ్ కారు బెటరా? ముందు ఇవి తెలుసుకోండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×