E-Paper
Advertisement

CNG vs Petrol Car: సీఎన్జీ vs పెట్రోల్.. రోజు వారీ అవసరాలకు ఏ కారు బెస్ట్ అంటే?

CNG vs Petrol Car:  సీఎన్జీ vs పెట్రోల్.. రోజు వారీ అవసరాలకు ఏ కారు బెస్ట్ అంటే?
Advertisement

CNG vs Petrol Car Comparion: సాధారణంగా పెట్రోల్ కార్లతో పోల్చితే, సీఎన్జీ కార్లు ఎక్కువ మైలేజీ ఇవ్వడంతో పాటు తక్కువ ఫ్యూయెల్ ఖర్చు అయ్యేలా చూస్తాయి. సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. అటు పెట్రోల్ కార్లు మెరుగైన పనితీరు, సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. అయితే, బడ్జెట్, ప్రయాణ అవసరాలు, ప్రాధాన్యతలపై ఆధారపడి వినియోగదారులు తమకు నచ్చినకార్లను కొనగోలు చేస్తారు.  అయితే, కొత్తకారు కొనాలనుకునే వాళ్లు పెట్రోల్ కారు తీసుకోవాలా? సీఎన్జీ కారు తీసుకోవాలా? అని ఆలోచిస్తారు. ఇంతకీ ఎవరికి, ఏ కారు బాగుంటుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పెట్రోల్, సీఎన్జీ కారు మధ్య తేడాలు

⦿ పెట్రోల్ కార్లు మంచి పికప్, సున్నితమైన డ్రైవ్‌ ను అందిస్తాయి. సీఎన్జీ కార్లు తక్కువ ధరకు ఎక్కువ మైలేజీని అందిస్తాయి.  సో, రెండింటికీ లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి.

Advertisement

⦿ ప్యూయెల్ ధర కారు రోజువారీ మెయింటెనెన్స్ ఖర్చులను బాగా ప్రభావితం చేస్తాయి. అయితే, సీఎన్జీ పెట్రోల్ కంటే చౌకగా ఉంటుంది. కానీ, ఇది నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

⦿ ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద నగరాల్లో, సీఎన్జీ ధర కిలోకు రూ. 80 కంటే తక్కువగా ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు  గణనీయమైన పొదుపును అందిస్తుంది.

Advertisement

⦿ చిన్న నగరాల్లో, సీఎన్జీ ధర కిలోకు రూ.85 నుంచి రూ.100 వరకు ఉంటుంది. అయినప్పటికీ, పెట్రోల్‌ తో పోలిస్తే, సీఎన్జీ ధర తక్కువగా ఉంటుంది.

⦿ మైలేజ్ విషయానికి వస్తే, సీఎన్జీ కార్లు స్పష్టమైన మేలు కలిగిస్తాయి. పెట్రోల్ కార్లు సగటున 15 నుంచి 22 కి.మీ/లీటరు ఇస్తుండగా, సీఎన్జీ కార్లు 22 నుంచి 35 కి.మీ అందిస్తున్నాయి.

⦿ మెరుగైన మైలేజ్, తక్కువ ఖర్చుల కారణంగా, మారుతి, టాటా, హ్యుందాయ్ లాంటి కంపెనీల సీఎన్జీ కార్లు, SUVలు మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. సీఎన్జీ SUV అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి.

Read Also:  సీఎన్జీ కారు మైలేజ్ మరింత పెంచుకోవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

⦿ సీఎన్జీ కార్లు పెట్రోల్ కార్ల కంటే తక్కువ పవర్, టార్క్ కలిగి ఉంటాయి. ఎక్కువ వేగంతో ఓవర్‌ టేక్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది ప్రత్యేకంగా గమనించవచ్చు.

⦿ పెట్రోల్ కార్లు హైవే డ్రైవింగ్, సుదూర ప్రయాణాలకు మరింత అనుకూలంగా ఉంటాయి. మెరుగైన పికప్, మృదువైన పనితీరు పెట్రోల్ కార్ల ముఖ్య ప్రయోజనాలు.

⦿ నగరంలో ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించడం, ఇంధన ఖర్చులను తగ్గించడం కావాలనుకుంటే, సీఎన్జీ కారు బెస్ట్ సెలెక్షన్ గా చెప్పుకోవచ్చు. కానీ, బలమైన పనితీరు కావాలనుకుంటే, పెట్రోల్ కారును ఎంచుకోవడం మంచిది.

Read Also: సన్‌రూఫ్ vs మూన్‌రూఫ్.. రెండింటి మధ్య తేడాలేంటి? ఏది బెస్ట్?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×