E-Paper
Advertisement

High Quality Cars: ఆ కార్లు బార్డర్ దాటొద్దు, డ్రాగన్ కంట్రీ కీలక నిర్ణయం!

High Quality Cars: ఆ కార్లు బార్డర్ దాటొద్దు, డ్రాగన్ కంట్రీ కీలక నిర్ణయం!
Advertisement

China High Quality Ev Cars: కార్ల ఎగుమతులకు సంబంధించి చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి హై క్వాలిటీ వాహనాలను మాత్రమే ఎగుమతి చేయాలని నిర్ణయించింది.  యూరప్, ఉత్తర అమెరికాలోకి ఇకపై ఎలాంటి లో క్వాలిటీ చైనా కార్లు దిగుమతి కావని తెలిపింది. ఈ మేరకు కార్ల ఎగుమతులకు సంబంధించి పలు నిబంధనలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొంతకాలంగా చైనాపై తీవ్ర విమర్శలు

గత కొద్ది సంవత్సరాలుగా చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల పనితీరు అత్యంత పేలవంగా ఉందని విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 1, 2026 నుంచి కఠినమైన ఎగుమతి నియమాలను అమలు చేయబోతోంది. కార్ల అమ్మకాల తర్వాత సర్వీస్, విడిభాగాలను కూడా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు చైనా ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన వినియోగదారులు, సర్వీస్.. స్పేర్ పార్ట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చైనీస్ కంపెనీల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇకపై అలాంటి అపఖ్యాతిని మూటగట్టుకోకూడదనే ఉద్దేశంతోనే చైనా కొత్త నిబంధనలను అమలు చేయబోతోంది.

రోడ్డు రవాణాకు కొత్త నియమాలు

Advertisement

అటు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తన ఆటోమోటివ్ పరిశ్రమను మరింత అప్ గ్రేడ్ చేయడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాబోయే నిబంధనల ప్రకారం సాంప్రదాయ, హైబ్రిడ్ మోడళ్లకు ఇప్పటికే అవసరమైనట్లే ఎలక్ట్రిక్ వాహనాలకు ఎగుమతి లైసెన్స్‌ లు అవసరం. అధికారిక తయారీదారులు, కంపెనీలు మాత్రమే చైనా వెలుపల వాహనాలను విక్రయించడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన లైసెన్స్‌ను పొందుతాయి.

Read Also:  ఎలక్ట్రిక్ To పెట్రోల్.. 2026లో లాంచ్ కాబోతున్న క్రేజీ స్కూటర్లు ఇవే!

గతంలో ఏం జరిగిందంటే?

Advertisement

కొంతమంది తెలివైన మధ్యవర్తులు ఇంకా చెప్పాలంటే చట్టబద్ధమైన తయారీదారులు కానివారు కొన్ని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వారు ఉపయోగించిన వాహనాలను రీ మోడల్ అని చెప్పి బ్రాండ్ న్యూ ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారు. కానీ, బ్రాండ్‌ను నమ్మదగినదిగా చేసే అంశానికి తిలోదకాలు ఇచ్చారు. ఫలితంగా  విదేశీ మార్కెట్లలో అమ్మకాల తర్వాత సర్వీసు, విడిభాగాలు దొరక్కపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా చైనా ఆటో మోబైల్ పరిశ్రమ ఇమేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది.

తమ పరువును కాపాడుకునే ప్రయత్నం

ఈ నేపథ్యంలో చైనీస్ ఎలక్ట్రిక్ కార్లకు మంచి పేరు తీసుకొచ్చేందుక చైనా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా దిగుమతి సుంకాలు పెరుగుతున్నప్పటికీ, చైనాలో తయారైన కార్ల వృద్ధి సామర్థ్యం ఇప్పటికీ భారీగా ఉందని బీజింగ్ భావిస్తుంది. అయితే, కార్ల మీద నమ్మకాన్ని పెంచితే, ఆటోమేటిక్ గా తమ ఆటో మోబైల్ కంపెనీకి మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని భావిస్తోంది. జనవరి 2026 నుంచి, హై క్వాలిటీ వాహనాలను మాత్రమే దేశం నుంచి బయటకు ఎగుమతి చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలు మంచి గుర్తింపు తెచ్చుకోబోతున్నాయి.

Read Also:  మీకు తెలుసా? ఈ బ్రా.. బాయ్ ఫ్రెండ్ ఫింగర్ ప్రింట్‌తో మాత్రమే ఓపెన్ అవుతుందట!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×