E-Paper
Advertisement

ఏంటీ.. కార్ల లైట్లకూ ఓ భాష ఉంటుందా? ప్రతీ డ్రైవర్ కచ్చితంగా తెలుసుకోవాలండోయ్!

ఏంటీ.. కార్ల లైట్లకూ ఓ భాష ఉంటుందా? ప్రతీ డ్రైవర్ కచ్చితంగా తెలుసుకోవాలండోయ్!
Advertisement

Driving Safety Tips: కారులో చాలా రకాల లైట్లు ఉన్నాయి. పెద్ద హెడ్ లైట్ల నుంచి చిన్న చిన్న వార్నింగ్ లైట్స్ వరకు చాలా ఉంటాయి. చిన్న చిన్న లైట్లు చాలా సార్లు పెద్ద మెసేజ్ ఇస్తుంటాయి.  కానీ, ఎక్కువ మంది డ్రైవర్లు వాటిని సరిగా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతారు. ఇంతకీ కారులో ఏ లైట్ వెనుక ఏ అర్థం ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ డాష్‌ బోర్డ్ లైట్లు

డాష్‌బోర్డ్ లైట్లు చాలా రంగుల్లో ఉంటాయి. ఎరుపు రంగు సాధారణంగా వార్నింగ్ ఇండికేటర్ గా పని చేస్తుంది. ఇది వెలిగితే, వెంటనే ఆగాలి. పసుపు రంగు లైట్ వెలిగితే తొందరగా చెక్ చేయాలి. ఆకుపచ్చ, నీలం రంగులు సిస్టమ్ సరిగా పనిచేస్తోందని అర్థం. కానీ, చాలా మంది ఈ తేడాను పట్టించుకోరు.

⦿ ఇంజిన్ లైట్

Advertisement

చెక్ ఇంజిన్ లైట్ వెలిగినా చాలా మంది డ్రైవింగ్ కొనసాగిస్తారు. కారు సరిగానే నడుస్తోందని భావించి దాన్ని పట్టించుకోరు. కానీ, చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. అలాగే, ఆయిల్ ప్రెషర్ లైట్ కనిపించినప్పుడు దాన్ని సాధారణ సర్వీస్ రిమైండర్‌గా భావించడం కూడా తప్పు. ఇంజిన్‌కు సరైన ఆయిల్ ప్రెషర్ లేదని అర్థం.

⦿ బ్యాటరీ లైట్

ఈ లైట్ వెలిగితే, చాలామంది బ్యాటరీనే మార్చాలని అనుకుంటారు. కానీ, అసలు సమస్య చాలాసార్లు ఛార్జింగ్ సిస్టమ్‌ లో ఉంటుంది. చెక్ ఇంజిన్ లైట్ మెరుస్తూ ఉంటే మాత్రం అది సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్లు అర్థం. వెంటనే కారును ఆపడం మంచిది.

⦿ బ్రేక్ వార్నింగ్ లైట్

Advertisement

ఈ లైట్ బ్రేక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉండటం, బ్రేక్ సిస్టమ్ ఏమైనా సమస్య ఉన్నా వెలుగుతుంది. అలాగే ABS, స్టెబిలిటీ కంట్రోల్ లైట్లు వెలిగితే, కారు సాధారణంగా నడుస్తున్నప్పటికీ ప్రమాద సమయంలో అవి పనిచేయకపోవచ్చు.

⦿ టైర్ ప్రెషర్ లైట్‌

చాలా మంది చిన్న విషయం అనుకుంటారు. కానీ, గాలి తక్కువగా ఉంటే టైర్లు వేడెక్కి ప్రమాదానికి దారితీస్తాయి. కూలెంట్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ కొనసాగించడం ఇంజిన్‌కు కూడా ఇబ్బంది కలిగిస్తుంది.

⦿ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్‌ వార్నింగ్

వీటిని చాలామంది పట్టించుకోరు. కానీ, అవి సిస్టమ్‌ లో లోపం ఉందని సూచిస్తాయి. అలాగే, హజార్డ్ లైట్లు వేసి ఎక్కడైనా ఆగిపోవడం సరైన పద్ధతి కాదు. ఇతర డ్రైవర్లను గందరగోళానికి గురిచేస్తుంది.

⦿ హెడ్‌ లైట్ ఫ్లాష్

ఈ లైట్లు వేస్తే, ముందు ప్రమాదం ఉందని, మీ లైట్లు ఆఫ్‌ లో ఉన్నాయని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. హై బీమ్ లైట్లు ఆన్‌ లో ఉన్నప్పుడు బ్లూ కలర్ లైట్ కనిపిస్తుంది.

⦿ మెయింటెనెన్స్ రిమైండర్లు

ఈ లైట్లను పట్టించుకోకపోవడం కూడా సరైంది కాదు. అలాగే ఒకేసారి అనేక లైట్లు వెలిగితే..  అది ఎలక్ట్రికల్ సమస్య కావచ్చు. ప్రతి లైట్‌ ను  సెన్సార్ గ్లిచ్ అని భావించడం కంటే, దాని అసలు ఉద్దేశాన్ని తెలుసుకోవడం మంచిది.

Read Also: ఎలక్ట్రిక్ To ఏఐ.. వామ్మో.. ఇవేం కార్లు భయ్యా చూస్తేనే కళ్లు చెదిరిపోతున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×