E-Paper
Advertisement

లక్ష కిలోమీటర్ల తర్వాత కూడా కొత్త కారులా నడవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

లక్ష కిలోమీటర్ల తర్వాత కూడా కొత్త కారులా నడవాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!
Advertisement

Best Car Maintenance Tips: కార్లు ఎంత చక్కగా మెయింటెనెన్స్ చేస్తే, అంత మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తాయి. అయితే, సాధారణంగా కార్ల మైలేజ్ లక్ష కిలోమీటర్లు పూర్తి చేసిన తర్వాత కాస్త తగ్గుతుంది. అయితే, కారును బాగా నడిపించుకోవడం పూర్తిగా మెయింటెనెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, కారు మరిన్ని సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భారత్ లో ట్రాఫిక్, రోడ్ల పరిస్థితులు, వాతావరణం లాంటి అంశాలు కారు భాగాలపై ప్రభావం చూపుతాయి. లక్ష కిలో మీటర్లు దాటిన తర్వాత కారు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఇంజిన్ గురించి..  

కారుకు ఇంజిన్ అనేది చాలా ముఖ్యమైనది. మంచి నాణ్యత గల ఇంజిన్ ఆయిల్‌ ను ఉపయోగించాలి. కచ్చితంగా సమయానికి మార్చాలి. ఆయిల్ ఫిల్టర్‌ ను కూడా రెగ్యులర్‌ గా మార్చడం వల్ల ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. కూలింగ్ సిస్టమ్‌ ను నిర్లక్ష్యం చేయకూడదు. కూలెంట్ స్థాయిని తరచూ చెక్ చేయాలి. రేడియేటర్, హోసులు, వాటర్ పంప్ లాంటి భాగాలు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అనేది చూడాలి. ఇవి సరిగ్గా లేకపోతే ఇంజిన్ ఓవర్‌ హీట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

⦿ సస్పెన్షన్ సిస్టమ్

Advertisement

లక్ష కిలో మీటర్లు దాటిన కారు సస్పెన్షన్ సిస్టమ్ కూడా చెక్ చేయాలి. షాక్ అబ్జార్బర్లు, బుషింగ్స్, లింక్ రాడ్లు గరుకైన రోడ్ల వల్ల త్వరగా అరిగిపోతాయి. ఇవి బాగాలేకపోతే డ్రైవింగ్ కంఫర్ట్ తగ్గిపోతుంది. అలాగే మాన్యువల్ కార్లలో క్లచ్ పరిస్థితి, ఆటోమేటిక్ కార్లలో ట్రాన్స్‌ మిషన్ ఆయిల్ స్టేటస్ కూడా పరిశీలించాలి. బ్రేక్ సిస్టమ్‌ లో ఏవైనా శబ్దాలు, కంపనలు కనిపిస్తే వెంటనే ప్యాడ్లు, డిస్క్‌ లు, బ్రేక్ ఫ్లూయిడ్ చెక్ చేయాలి.

⦿ బ్యాటరీ

కారులో బ్యాటరీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా బ్యాటరీలు 3 నుండి 5 సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి బ్యాటరీ ఎలా ఉంది? కనెక్షన్లు సరిగా ఉన్నాయా అన్నది చెక్ చేస్తూ ఉండాలి. టైర్ల విషయానికి వస్తే, అవి అరిగిపోయాయా? లేదా? అని చూసుకోవాలి. అవసరమైతే వెంటనే మార్చాలి. సరైన టైర్ ప్రెజర్, అలైన్‌మెంట్, బ్యాలెన్సింగ్ వల్ల కారు సేఫ్టీతో పాటు ఇతర భాగాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

⦿ ఫ్యూయల్ సిస్టమ్‌

Advertisement

ఫ్యూయల్ సిస్టమ్‌ను కూడా శుభ్రంగా ఉంచడం ముఖ్యం. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువగా నడిచే కార్లలో ఇంజెక్టర్లలో మలినాలు పేరుకునే అవకాశం ఉంటుంది. మంచి నాణ్యత గల ఇంధనం వాడడం, అవసరమైతే క్లీనింగ్ చేయించడం వల్ల మైలేజ్, పనితీరు మెరుగుపడతాయి.

⦿ మెయింటెనెన్స్

కారు లోపలి, బయట భాగాల నిర్వహణ కూడా చాలా ముఖ్యం. రెగ్యులర్ క్లీనింగ్, సన్‌ షేడ్ వాడటం, పాలిషింగ్ చేయించడం వల్ల కారు కొత్తలా కనిపిస్తుంది. డ్రైవింగ్ స్టైల్ కూడా వాహనం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అకస్మాత్తుగా వేగం పెంచడం, గట్టిగా బ్రేక్ వేయడం, ఎక్కువ బరువు మోసేలా చేయడం లాంటివి నివారించాలి.

లక్ష కిలోమీటర్లు పూర్తవడం అంటే కారు పనితీరు తగ్గిపోతుందని కాదు. సరైన నిర్వహణ, సకాలంలో సర్వీసింగ్, చిన్న సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా అదే వాహనాన్ని మరింత కాలం నమ్మకంగా ఉపయోగించుకోవచ్చు.

Read Also: తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం.. కళ్లు చెదిరే మైలేజ్ తో కొత్త కియా సెల్టోస్ వచ్చేస్తోంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×