E-Paper
Advertisement

కారు బ్యాటరీ డౌన్ అయినా, టైర్లలో గాలిపోయినా.. ఈ ఒక్క డివైజ్ ఉంటే ఇక నో టెన్షన్!

కారు బ్యాటరీ డౌన్ అయినా, టైర్లలో గాలిపోయినా.. ఈ ఒక్క డివైజ్ ఉంటే ఇక నో టెన్షన్!
Advertisement

Car Jumper Features: ప్రయాణంలో కారు బ్యాటరీ డౌన్ అయితే చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు టైర్లలో గాలిపోతే, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సమయంలో మరో వాహనం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే కారును స్టార్ట్ చేయడం, టైర్ లో గాలి నింపడంలో సాయపడుతుంది కార్ జంపర్. కేవలం జంప్ స్టార్టర్ మాత్రమే కాదు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే మల్టిఫుల్ ఫీచర్లతో కూడిన పోర్టబుల్ డివైస్. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కార్ జంపర్ ప్రత్యేకతలు

కార్ జంపర్ అనేది కారు బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు జంప్ స్టార్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మోడల్‌ను బట్టి ఇది సుమారు 400A నుంచి 1200A వరకు పీక్ కరెంట్ అందిస్తుంది. దీంతో కార్లు, బైక్‌లు, కొన్ని చిన్న ట్రక్కులను కూడా ఈజీగా స్టార్ట్ చెయ్యొచ్చు. ఇందులో ఉండే స్మార్ట్ క్లాంప్ లు షార్ట్ సర్క్యూట్, రివర్స్ పోలారిటీ, ఓవర్ ఛార్జింగ్ లాంటి సమస్యల నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. దీనిని ఉపయోగించడం చాలా సేఫ్ గా చెప్పుకోవచ్చు.

టైరులో గాలి నింపుకోవచ్చు!

Advertisement

కార్ జంపర్‌ లో మరో ముఖ్యమైన ఫీచర్ టైర్ ఇన్‌ఫ్లేటర్. కారు, బైక్ టైర్‌ లో గాలి తగ్గినప్పుడు వేరే ఎయిర్ పంప్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఉన్న డిజిటల్ ఎయిర్ కంప్రెసర్ ద్వారా టైర్లలో సులభంగా గాలి నింపుకోవచ్చు. కొన్ని మోడళ్లు 150 PSI వరకు గాలి నింపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కారు, బై క్‌లతో పాటు సైకిళ్లు, ఫుట్‌ బాల్స్, ఇతర ఆట వస్తువులకు కూడా గాలి నింపేందుకు వేర్వేరు మోడ్‌లు అందుబాటులో ఉంటాయి.

పవర్ బ్యాంక్ గానూ ఉపయోగం

ఈ డివైజ్ పవర్ బ్యాంక్‌గానూ పనిచేస్తుంది. ఇందులో సాధారణంగా 8,000mAh నుంచి 30,000mAh వరకు బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. USB పోర్టుల ద్వారా స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్లు, వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ లాంటి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ డ్రైవ్‌ లలో చాలా ఉపయోగపడుతుంది.

LED ఎమర్జెన్సీ ఫ్లాష్‌ లైట్, వ్యాక్యూమ్ క్లీనర్

Advertisement

ఇందులో LED ఎమర్జెన్సీ ఫ్లాష్‌లైట్ కూడా ఉంటుంది. రాత్రి సమయంలో, తక్కువ లైట్ ఉన్న ప్రాంతాల్లో కారు ఆగిపోతే ఈ లైట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ లైట్‌ తో పాటు స్ట్రోబ్, SOS లాంటి ఎమర్జెన్సీ మోడ్‌లు కూడా ఇందులో ఉంటాయి. కొన్ని ప్రీమియం మోడళ్లలో హ్యాండ్‌ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ కూడా ఉంటుంది. దీని సహాయంతో కారు లోపల ఉండే దుమ్ము, చిన్న చెత్తను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఒకే డివైజ్ ద్వారా పలు రకాల పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.  వీటి ధర రూ. 1,000 నుంచి ప్రారంభం అవుతుంది.

Read Also: చిన్న డివైజ్.. క్షణాల్లో నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చుకోవచ్చు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×