// // Car Changes Color: సెకన్ల వ్యవధిలో రంగులు మార్చే కారు.. మీరు ఏ కలర్ డ్రెస్ వేస్తే ఆ రంగులోకి.. అద్భుతం కదూ! -->
E-Paper
Advertisement

Car Changes Color: సెకన్ల వ్యవధిలో రంగులు మార్చే కారు.. మీరు ఏ కలర్ డ్రెస్ వేస్తే ఆ రంగులోకి.. అద్భుతం కదూ!

Car Changes Color: సెకన్ల వ్యవధిలో రంగులు మార్చే కారు.. మీరు ఏ కలర్ డ్రెస్ వేస్తే ఆ రంగులోకి.. అద్భుతం కదూ!
Advertisement

ఒక్కొక్కరికి ఒక్కో రంగు నచ్చుతుంది. నచ్చిన రంగులో కార్లు, బైకులు కొనుగోలు చేస్తారు. అయితే, తమ కారు ఎప్పటికప్పుడు రంగులు మారితే? నచ్చినట్లు కలర్ ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంటే? ఊహించుకుంటేనే క్రేజీగా ఉంది కదా. ఇలాంటి కారుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ కారు, తన పక్కనుంచి వెళ్లే మనుషులు ధరించిన దుస్తుల రంగుల్లోకి క్షణాల్లో మారిపోతుంది.

రంగులు మార్చే కార్లు తయారు చేయడం సాధ్యమేనా?

E-Ink, అడాప్టివ్ డిజిటల్ ప్యానెల్స్ లాంటివి ఉపయోగించి రంగులు మార్చే కారును తయారు చేయవచ్చు అంటున్నారు టెక్ నిపుణులు. వీటి సాయంతో కారు ఉపరితలం, పక్కన కదిలే రంగులను బట్టి షేడ్స్, గ్రేడియంట్లు, టోన్లను మార్చుకుంటుంది. ఎవరైనా పక్కన నడవగానే, కారు తక్షణమే వారు ధరించిన దుస్తుల రంగుల్లోకి మారిపోతుంది. కారు స్టాటిక్ మెషీన్‌గా కాకుండా డైనమిక్ డిజిటల్ కాన్వాసుగా మారుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

రంగులు మార్చే కార్లు తయారీకి BMW ప్రయత్నం

వాస్తవానికి రంగులు మార్చే కార్లు త్వరలో రియాలిటీగా మారబోతున్నాయి. ముఖ్యంగా BMW కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇది ఈ-ఇంక్ (E Ink) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.

Advertisement

⦿ కారు బాడీ మీద మిలియన్ల కొద్దీ మైక్రోక్యాప్సూల్స్ ఉంటాయి. అవి మన వెంట్రుక మందం సైజు కలిగి ఉంటాయి.

⦿ ఈ క్యాప్సూల్స్‌ లో పలు ఛార్జ్‌ డ్ పిగ్మెంట్స్, ముఖ్యంగా వైట్, బ్లాక్, కలర్స్ లో ఉంటాయి.

⦿ బటన్ నొక్కితే లేదంటే యాప్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై అయ్యి రంగు మారుతుంది.

⦿ కారు రంగు మారడానికి పవర్ వాడుతుంది. మెయింటైన్ చేయడానికి ఏదీ అవసరం లేదు.

రంగలు మార్చేBMW మోడల్స్

ఇప్పటికే BMWకు చెందిన పలు మోడల్స్ రంగులు మార్చుతున్నాయి.

⦿ BMW iX Flow (2022): మొదటి వెర్షన్ – బ్లాక్, వైట్, గ్రే షేడ్స్ మధ్య మారుతుంది.

⦿ BMW i Vision Dee (2023): 32 రంగుల వరకు మార్చగలదు, ప్యాటర్న్స్ కూడా క్రియేట్ చేయవచ్చు.

⦿ BMW i5 Flow NOSTOKANA (2024): ఆర్ట్ కార్ – మల్టీకలర్ ప్యాటర్న్స్, ఆఫ్రికన్ ఆర్టిస్ట్ డిజైన్‌ తో కనిపిస్తుంది.

రంగు మార్చే కార్లతోప్రయోజనాలు

⦿ మూడ్ ప్రకారం రంగు మార్చుకోవచ్చు.

⦿ వాతావరణానికి అనుగుణంగా వేసవిలో తెలుపు (హీట్ రిఫ్లెక్ట్), శీతాకాలంలో నలుపు (హీట్ అబ్జార్బ్) రంగుల్లోకి మార్చుకోవడం ద్వారా AC యూస్ తగ్గి మైలేజీ పెరుగుతుంది.

⦿ పార్కింగ్‌లో కారును కనిపెట్టడం సులువు అవుతుంది.

Read Also: S-ప్రెస్సో To సెలెరియో.. చీప్ అండ్ బెస్ట్ మారుతి సుజుకి కార్లు ఇవే!

రంగులు మార్చే కార్ల ప్రస్తుత స్టేటస్ ఏంటి?   

ప్రస్తుతానికి BMW కార్లన్నీ కాన్సెప్ట్/ప్రోటోటైప్ మోడల్స్ మాత్రమే. మార్కెట్‌ లో అందుబాటులో లేవు. 2028-2029 నాటికి ప్రొడక్షన్ కార్లలో వచ్చే అవకాశం ఉంది.

Read Also: హ్యుందాయ్ ఇయర్ ఎండ్ ఆఫర్లు, ఆ కారుపై ఏకంగా రూ. 1.68 లక్షల డిస్కౌంట్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×