E-Paper
Advertisement

టైర్ ప్రెషర్‌ తో మైలేజీ పెరుగుతుందా? ఇదీ అసలు మ్యాటర్!

టైర్ ప్రెషర్‌ తో మైలేజీ పెరుగుతుందా? ఇదీ అసలు మ్యాటర్!
Advertisement

Boost Mileage with Tire Pressure: పెట్రో ధరలు రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో, చాలా మంది డ్రైవర్లు తమ వెహికల్ మైలేజీని ఎలా పెంచుకోవాలా అని ఆలోచిస్తుంటారు. చాలా సందర్భాల్లో ఇంజిన్ పనితీరు, డ్రైవింగ్ స్టైల్ మీ ఎక్కువ ఫోకస్ పెడతారు. కానీ, చాలా ఈజీగా మైలేజ్ పెంచుకునే, ఎక్కువ మంది పట్టించుకోని ఒక ముఖ్యమైన విషయం టైర్ ప్రెషర్. టైర్లలో సరైన గాలి ఉండటం వల్ల ఇంధన వినియోగం తగ్గి, మైలేజీ మెరుగుపడుతుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

మైలేజీపై టైర్ ప్రెషర్ ఎఫెక్ట్

టైర్లు వెహికల్, రోడ్డు మధ్య కీలకమైన సంబంధం ఉంటుంది. గాలి తక్కువగా ఉంటే, టైర్లు ఎక్కువగా నేలపై ఒత్తిడిని పెంచుతాయి. దీని వల్ల ఘర్షణ పెరిగి, వాహనం ముందుకు కదలడానికి ఇంజిన్‌కు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఫలితంగా ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. టైర్ ప్రెషర్ కొద్దిగా తగ్గినా మైలేజీ తగ్గిపోతుంది. చాలాసార్లు డ్రైవర్లకు తెలియకుండానే టైర్లలో గాలి నిర్ణీత స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది.

సరైన టైర్ ప్రెషర్ తో మంచి మైలేజ్

Advertisement

సరైన టైర్ ప్రెషర్ ఉంటే వాహనం సాఫీగా నడుస్తుంది. టైర్లు సులభంగా తిరుగుతూ ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గిస్తాయి. ఇంధనం తక్కువగా వినియోగించబడుతుంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో మరింత ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే, అక్కడ వాహనం తరచుగా ఆగుతూ, మళ్లీ వేగం పెంచుతూ ఉంటుంది. టైర్లలో గాలి తక్కువగా ఉంటే, ప్రతి సారి యాక్సిలరేట్ చేసినప్పుడు ఇంజిన్ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. హైవేలో ఈ ప్రభావం కొంచెం తక్కువగా ఉన్నా, సుదూర  ప్రయాణంలో మాత్రం మైలేజీపై ప్రభావం కనిపిస్తుంది.

భద్రతలోనూ టైర్ ప్రెషర్ కీలకం

కేవలం ఇంధన ఆదా కోసమే కాదు, భద్రతకు కూడా ఎయిర్ ప్రెషర్ చాలా ముఖ్యం. సరైన గాలి ఉన్న టైర్లు మంచి గ్రిఫ్ ను ఇస్తాయి. బ్రేకింగ్ మెరుగుపడుతుంది, డ్రైవింగ్ కంట్రోల్ కూడా బాగుంటుంది. అలాగే టైర్లు సమానంగా అరిగి, ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. గాలి తక్కువగా ఉంటే టైర్లు వేడెక్కి, దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టైర్ పగిలే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు, ఇంధనం తక్కువగా వినియోగించడం వల్ల పర్యావరణానికి కూడా మంచిదే.

కనీసం నెలకు ఓసారైనా చెక్ చేయాలి!

Advertisement

టైర్ ప్రెషర్‌ను చెక్ చేయడం చాలా సులభం. కనీసం నెలకు ఒకసారి అయినా తప్పకుండా చెక్ చేయాలి. టైర్లు చల్లగా ఉన్నప్పుడు చెక్ చేయడం మంచిది, ఎందుకంటే వేడి వల్ల ప్రెషర్ రీడింగ్ మారవచ్చు. అలాగే, ఎప్పుడూ వాహన తయారీదారు సూచించిన ప్రెషర్ లెవెల్ ను మెయింటెయిన్ చేయాలి. టైర్‌ పై ఉన్న సంఖ్య గరిష్ట పరిమితి మాత్రమే, అది సరైన లెవెల్ కాదు. చిన్న విషయంలా అనిపించినా, టైర్ ప్రెషర్ మైలేజీపై పెద్ద ప్రభావం చూపుతుందనేది గుర్తుంచుకోవాలి.  అదనపు ఖర్చు లేకుండా ఇంధనాన్ని ఆదా చేయాలంటే, ముందుగా టైర్లను చెక్ చేసుకోవాలి. ప్రతి డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Read Also: డీజిల్ కంటే బెస్ట్ మైలేజ్ ఇచ్చే 5 హైబ్రిడ్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×