E-Paper
Advertisement

కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Advertisement

Car Air Purifiers: దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో గాలి కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు, వాహనాల పొగ, నిర్మాణ పనుల ధూళి కారణంగా ఢిల్లీ లాంటి నగరాల్లో AQI స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. బయట మాత్రమే కాదు, కారులో ప్రయాణించే సమయంలో కూడా కాలుష్య ప్రభావం ఉంటుంది. ట్రాఫిక్‌ లో ఎక్కువసేపు ఉండే వారు కార్ క్యాబిన్‌ లోనే కాలుష్య గాలిని పీల్చాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది కార్ ఎయిర్ ప్యూరిఫైయర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇవి నిజంగా ఉపయోగపడతాయా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ ఎయిర్ ఫ్యూరిఫైయర్ ఎలా పని చేస్తుంది?

సాధారణంగా ప్రతి కారులో క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఇది పెద్ద ధూళి కణాలు, ఇతర కాలుష్య కారకాలను  కొంత వరకు అడ్డుకుంటుంది. కానీ, PM2.5 లాంటి చాలా చిన్న కాలుష్య కణాలను పూర్తిగా ఫిల్టర్ చేయడంలో అంతగా ప్రభావం చూపించవు. అయితే, కార్ల కోసం తయారు చేసిన ప్రత్యేక ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగపడతాయి.

మంచి కారు ఎయిర్ ఫ్యూరిఫైయర్ లో మూడు ఫిల్టర్లు

Advertisement

మంచి కార్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ లో సాధారణంగా మూడు కీలక ఫిల్టర్లు ఉంటాయి. మొదటిది ప్రీ ఫిల్టర్. ఇది పెద్ద ధూళి కణాలను అడ్డుకుంటుంది. రెండోది HEPA ఫిల్టర్. ఇది చాలా చిన్న కణాలు, పొగ, అలర్జీ కారకాలను ఫిల్టర్ చేస్తుంది. మూడోది యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్. ఇది చెడు వాసన, వెహికల్స్ పొగ సహా హానికరమైన వాయువులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్యూరిఫైయర్ ఎంత బాగా పని చేస్తుందనేది దాని ఫిల్టర్ నాణ్యతతో పాటు CADRపై ఆధారపడి ఉంటుంది. CADR అంటే ఒక గంటలో లేదంటే నిమిషంలో ప్యూరిఫైయర్ ఎంత గాలిని శుభ్రం చేయగలదో చెప్పే కొలమానం. కారు క్యాబిన్ చిన్న ప్రదేశం కావడంతో, మంచి ప్యూరిఫైయర్ తక్కువ సమయంలోనే గాలి నాణ్యతను పెంచుతుంది.

రీసర్క్యులేషన్ మోడ్!

కారులో ఎయిర్ కండిషనర్‌ ను  రీసర్క్యులేషన్ మోడ్ లో వాడటం మంచిది. ఇలా చేస్తే బయట ఉన్న కాలుష్య గాలి లోపలికి తక్కువగా వస్తుంది. అప్పుడు ప్యూరిఫైయర్ మరింత సమర్థవంతంగా పని చేస్తుంది. సరైన ఫిల్టర్లు ఉన్న కార్ ప్యూరిఫైయర్‌లు PM2.5 లాంటి హానికరమైన కణాలను సైతం పెద్ద మొత్తంలో తగ్గిస్తాయి. అయితే, పదే పదే కిటికీలు తెరిస్తే, తక్కువ దూర ప్రయాణాలు చేస్తే ప్యూరిఫైయర్ పూర్తి స్థాయిలో పని చేయడానికి సమయం లభించదు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ లాంటి అధిక కాలుష్య ప్రాంతాల్లో రోజూ ఎక్కువ సేపు డ్రైవ్ చేసే వారికి కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా అలర్జీలు, ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది మరింత మేలు చేస్తుంది.

Advertisement

Read Also: తక్కువ ఫ్యూయెల్ తో ఎక్కువ ప్రయాణం.. సింపుల్ గా ఇలా చేయండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×